బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 36: బాబా భాస్కర్, పునర్నవి సేఫ్

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 36: బాబా భాస్కర్, పునర్నవి  సేఫ్
x
Highlights

ఈ వారం ఎలిమినేషన్ నుంచి బాబా భాస్కర్ సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు నాగార్జున

బిగ్ బాస్ 3 ఆదివారం సందడి మొదలైంది. నాగార్జున హౌస్ మేట్స్ తో కలసి వీక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. శివజ్యోతి కి కొన్ని జంతువుల పేర్లు చూపిస్తూ దానికి సూటయ్యే హౌస్ మెట్ ఎవరో చెప్పి ఎందుకో చెప్పమన్నారు. శివజ్యోతి చెప్పిన జవాబులు అందర్నీ అలరించాయి. ఇక ఎలిమినేషన్ కు నామినేషన్స్ లో ఉన్న పునర్నవి, బాబా భాస్కర్, రాహుల్, హిమజ, అషు రెడ్డి ల లో ఎవరు ఎలిమినేట అవుతారనేది ఈరోజు తేలనుంది. కాగా, ఎలిమినేషన్స్ నుంచి సేఫ్ జోన్ లో ఉన్న హౌస్ మేట్ గా బాబా భాస్కర్ ను ప్రకటించారు నాగార్జున. ఈ సందర్భంగా బాబాను ఎలిమినేట్ జోన్ లో పెట్టిన అలీని నీకెలా ఉంది అని ప్రశ్నించారు. దానికి అలీ.. ఆరోజు తప్పని సరి పరిస్థితిలో బాబాభాస్కర్ ను నామినేట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇక పునర్నవి కూడా ఎలిమినేషన్స్ నుంచి సేఫ్ లో ఉన్నట్టు నాగార్జున ప్రకటించారు. ఇప్పుడు రాహుల్, హిమజ, అషు రెడ్డి లలో ఎవరు ఈరోజు బయటకు వెళతారనేది కొద్ది సేపట్లో తేలనుంది.
Show Full Article
Print Article
More On
Next Story
More Stories