బిగ్ బాస్ నుంచి అషు రెడ్డి ఎలిమినేట్!

బిగ్ బాస్ నుంచి అషు రెడ్డి ఎలిమినేట్!
x
Highlights

అంతా అనుకున్నట్ట్టు జరిగింది. ఏమీ సంచలనాలు లేవు. లీకులు నిజమయ్యాయి. బిగ్ బాస్ 3 తెలుగు ఐదో వారం లో అషు రెడ్డి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు.

బిగ్ బాస్ 3 ఆదివారం సందడి మొదలైంది. నాగార్జున హౌస్ మేట్స్ తో కలసి వీక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. హౌస్ మేట్స్ తో సరదా ఆటలు ఆడిస్తున్నారు. ఒకరిని ఒకరుగా అనుకరిస్తూ చూపించమని చెప్పారు నాగార్జున. అవతలి వారి పేరున్న బోర్డు పెట్టుకుని వారిలా అనుకరిస్తూ చేయాలని చెప్పారు. బాబాభాస్కర్ ను అషు రెడ్డి అనుకరించింది. ఆయనలా మాట్లాడి అందర్నీ నవ్వించింది. బాబా భాస్కర్ అషు రెడ్డిలా అందరికీ మేకప్ వేస్తున్నట్టు అనుకరించి చూపించి వినోదాన్ని పంచారు. పునర్నవి వరుణ్ లా.. వరుణ్ పునర్నవి లా.. ఇక మహేష్ శివజ్యోతి లా, శివజ్యోతి మహేష్ లా చేశారు. అదేవిధంగా రవికృష్ణ హిమజ లా.. హిమజ రవికృష్ణలా చేశారు. తర్వాత రాహుల్ సేఫ్ జోన్ లో ఉన్నారని ప్రకటించారు. ఇక అలీ వితిక లా నటించి చూపించి అందర్నీ నవ్వుల్లో ముంచారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో భాగంగా అషు రెడ్డి హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories