బిగ్‌బాస్ లో వంటింటి మంటలు!

బిగ్‌బాస్ లో వంటింటి మంటలు!
x
Highlights

బిగ్‌బాస్ సీజన్ 3 మూడోరోజు గందరగోళంగా తయారయింది. మొదటి రెండురోజులూ మామూలుగా సాగిన షో మూడోరోజు మాత్రం అరుపులు కేకలతో దద్దరిల్లింది. నిజానికి షో...

బిగ్‌బాస్ సీజన్ 3 మూడోరోజు గందరగోళంగా తయారయింది. మొదటి రెండురోజులూ మామూలుగా సాగిన షో మూడోరోజు మాత్రం అరుపులు కేకలతో దద్దరిల్లింది. నిజానికి షో ప్రారంభం నుంచీ హేమ చుట్టూనే హౌస్ లో విషయాలు తిరుగుతూ వస్తున్నాయి. అదే వరుస మూడోరోజూ కొనసాగింది. అయితే, ఇప్పటివరకూ సైలెంట్ గా ఉన్న హేమ కొద్దిగా ఆవేశాపడడంతో మంటలు మొదలయ్యాయి.

హౌస్ అంతా యధావిధిగా మామూలుగా ఉంది. ఈ సమయంలో బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. శివజ్యోతిని కన్‌ఫెషన్‌ రూంకి పిలిచిన బిగ్‌బాస్ ఆమె ద్వారా టాస్క్ విషయాన్ని తెలిపాడు. హౌస్ లోని వారంతా 5 - 10 సంవత్సరాల వయసు పిల్లల్లా బిహేవ్ చేయాలని, వారికి కేర్ టేకర్లుగా వరుణ్ సందేశ్, పునర్నవీ వ్యవహరించాలని సూచించాడు.

ఈటాస్క్ గందరగోళంగా తయారైంది. ఎవరేం చేస్తున్నారో.. ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాని గజిబిజిగా సాగింది. ఇక కొంతమంది ఓవర్ యాక్షన్ అయితే అసలు ప్రేక్షకులతో పాటు సహచరులకూ విసుగు తెప్పించింది. దాదాపుగా హౌస్ లో ఉన్న వారంతా నటనానుభవం ఉన్నవారే. కానీ ఇచ్చిన టాస్క్ ను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారో.. వృత్తి జీవితంలో తెరపై కనిపించే సందర్భంలో దర్శకుడు ఎలా చెబితే అలా చేయడమే తప్ప.. తమ పాత్ర గురించిన అవగాహన కోసం ప్రయత్నించే అలవాటు లేదో ఏమిటో గానీ, రోత పుట్టించే విధంగా ప్రవర్తించారు. అషురెడ్డి అయితే అసలు ఏం చేస్తుందో తెలీని విధంగా చేసింది. మూడోరోజు ఉదయాన్నే టీ నీళ్లలా ఉందంటూ కొంతమంది చేసిన ఫిర్యాడుతోనే హౌస్ లో గొడవలు మొదలవుతున్న సూచనలు కనిపించాయి. ఇక ఈ టాస్క్ సందర్భంగా అవి నిజమయ్యాయి.

టాస్క్ లో భాగంగా చేశారో.. కావాలని చేశారో తెలీదు కానీ, మహేశ్ విట్టా పై 'కర్రిగాడు ఊడపొడుస్తానన్నాడు, ఇప్పుడేమో పడుకున్నాడు' అంటూ రవికృష్ణ, రోహిణిలు వ్యాఖ్యాననించారు. ఇక దానికి మహేష్ సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. తనకు తనకు ఓవర్ యాక్షన్ చేయడం ఇష్టం ఉండదని, సైలెంట్‌గా ఉంటానని, చిన్నప్పటి నుంచీ తానిలానే ఉన్నాననీ చెప్పుకొచ్చాడు మహేష్. పిల్లలందరూ ఒకేలా ఉండరు కదా. నేను అల్లరికి ఎప్పుడూ దూరంగానే ఉన్నాను. అలాగే చిన్నపిల్లల్లా మారిపోవాలని టాస్క్ అన్నపుడు నా సహజసిద్ధమైన స్వభావంతో సైలెంట్ గానే ఉన్నాను. దానికి నన్ను హేళన ఎలా చేస్తారంటూ తనను సముదాయించడానికి వచ్చిన పునర్నవీ తో చెప్పి తిరిగి మూడ్ లోకి వచ్చేశాడు. అక్కడితో ఈ సమస్య ముగిసింది.

ఇక భోజనాల సమయంలో శ్రీముఖి మాటలతో కొత్త గొడవ మొదలైంది. దాదాపు మూడున్నర రోజులు మనం ఇప్పుడు ఉన్న పదార్థాలతో కాలక్షేపం చేయాలనీ, మెనూ జాగ్రత్తగా చూసుకోవాలనీ డైనింగ్ టేబుల్ దగ్గర హౌస్ మేట్స్ తో చెప్పింది. వంటలు ఇలా చేస్తే ఫుడ్ సరిపోతుందని రాహుల్, అలీరెజా ఎదో చెబుతున్నంతలో హేమ కలుగ చేసుకుని శ్రీముఖిని ఇవన్నీ అందరితో ఎందుకు చెప్పావు. వంటింటి సంగతి నేను చూసుకుంటాను అని కోపంగా అన్నారు. దీంతో మొదలైన గొడవ.. తీవ్రం అయిపొయింది. చిలికి చిలికి గాలివానలా మారిపోయింది. టాస్క్ సంగతి వదిలేసి అందరూ ఈ గొడవలో పడ్డారు. ఎవరు ఎవర్ని ఏమంటున్నారో అర్థం కాని విధంగా గోల గోలగా పరిస్థితి మారిపోయింది. దాదాపుగా హౌస్ మేట్స్ అందరూ గట్టి గట్టిగా మాట్లాడుతూ కేకలు వేసుకుంటూ రచ్చ రచ్చ అయిపొయింది. అసలు గొడవ ఏమిటో కూడా అర్థం కాని స్థితి హౌస్ లో తయారైంది. టాస్క్ సంగతి వదిలేసి.. అందరూ ఈ గోడవలోనే పడిపోయారు. మరి ఈ గొడవ ఏరకంగా సర్డుకుంటుందో.. హౌస్ లో మామూలు పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయో.. తెలియాలంటే వేచి చూడాల్సిందే!

మూడోరోజు ఎలా ఉందంటే..

అసలు బిగ్‌బాస్ షో అంటేనే.. గొడవలు.. గోలలు.. కానీ, హిందీలో వచ్చే ఎపిసోడ్స్ కి తెలుగుకి చాలా తేడా ఉండేది. ఇప్పుడు ఈ సీజన్ లో హిందీ బిగ్‌బాస్ ను మించిపోయేలా వ్యవహారం కనిపిస్తోంది. మూదోరోజుకే ఇలా ఉంటే, ఇక ముందు ఎంత రచ్చ చూడాల్సి వస్తుందో. టాస్క్ కు సంబంధించి వ్యవహారం అదుపు తప్పినప్పుడు బిగ్‌బాస్ హౌస్ మేట్స్ ని అదుపులో పెట్టడం ఇంతకు ముందు జరిగేది. కానీ, చిత్రంగా ఈసారి అసలు టాస్క్ వదిలేసి.. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నా సరే, బిగ్‌బాస్ పట్టించుకోకపోవడం బహుశా స్క్రిప్ట్ ప్రకారమే ఇది జరిగినట్టు అనిపించింది. కొంత నాటకీయత ఎక్కువగా కనిపించింది. రియాల్టీ షో రక్తి కట్టించడానికి కొంచెం మసాలా కోసం ఈ ఎపిసోడ్ ని అలానే ప్రసారం చేశారనిపిస్తోంది. ఇంకోటి ఏమిటంటే.. ఎడిటింగ్ కూడా అసలు కుదరలేదు. అదికూడా ప్రేక్షకుడ్ని కొంత గందరగోళంలో పెట్టినట్టిందని చెప్పొచ్చు. గంట సమయంలోనే విషయాన్ని కుదించాల్సి రావడమూ కొంత అసౌకర్యాన్ని కలిగించిందనిపిస్తోంది.

ఏది ఏమైనా షో ప్రారంభం నుంచి ఇప్పటివరకూ మొత్తం వ్యవహారం హేమ చుట్టూనే తిరుగుతుండడం గమనార్హం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories