Bigg Boss 5: జులై నుంచి 'బిగ్ బాస్ 5' సీజన్?

Bigg Boss 5: 'బిగ్ బాస్' తెలుగులో ప్రముఖ రియాలిటీ షోలలో ఒకటి. త్వరలో సీజన్ 5 ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Venkata Chari
Published on: 4 April 2021 3:27 PM IST
Bigg Boss Telugu season 5: Starting in July?
X

బిగ్ బాస్ ౫ (ఫొటో హన్స్ ఇండియా)

Bigg Boss 5: 'బిగ్ బాస్' తెలుగులో ప్రముఖ రియాలిటీ షోలలో ఒకటి. త్వరలో సీజన్ 5 ప్రారంభం కానున్నట్లు సమాచారం. కరోనా కారణంగా బిగ్ బాస్ సీజన్ 4 కొంత ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. కానీ, ప్రస్తుత సీజన్ అంటే బిగ్ బాస్ 5 ను మాత్రం త్వరగానే ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇక సీజన్ 5 ను జూన్ లేదా జులైలోనే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ చెబుతున్నారు. గత సీజన్ లో అభిజీత్ విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సారి కూడా నాగార్జున అక్కినేని ఈ షోకి ఆతిథ్యం ఇవ్వబోతున్నారు.

కంటెస్టెంట్స్ విషయంలో ఈసారి మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారట. బిగ్ బాస్ మేకర్స్ ఇప్పటికే పరిశ్రమలోని కొంతమంది నటులతో చర్చలు చేస్తున్నట్లు టాక్. ఈసారి, ఎక్కువ మంది మహిళా నటులను తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 చాలా స్పెషల్ గా తీర్చి దిద్దాలని భావిస్తున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story