Arav Nafeez Gets Married To Raahei : హీరోయిన్ ని పెళ్ళాడిన బిగ్ బాస్ విన్నర్

Arav Nafeez Gets Married To Raahei : బిగ్ బాస్ తమిళ సీజన్ వన్ కి విజేతగా నిలిచిన నటుడు అరవ్ నఫీజ్ నటి నటి రాహియాను ఈ రోజు (సెప్టెంబర్ 6)

Krishna
Published on: 6 Sept 2020 5:51 PM IST
Arav Nafeez Gets Married To Raahei : హీరోయిన్ ని పెళ్ళాడిన బిగ్ బాస్ విన్నర్
X

Arav Nafeez gets married to actress Raahei

Arav Nafeez Gets Married To Raahei : బిగ్ బాస్ తమిళ సీజన్ వన్ కి విజేతగా నిలిచిన నటుడు అరవ్ నఫీజ్ నటి నటి రాహియాను ఈ రోజు (సెప్టెంబర్ 6) చెన్నైలోని వివాహం ఆడాడు. ప్రభుత్వ నిబంధనలకు పాటిస్తూ, కరోనా జాగ్రత్తలతోనే ఈ పెళ్లి వేడుక జరిగింది. కరోనా నేపధ్యంలో జరిగిన వివాహం కావడంతో ఈ వివాహ వేడుకకి అతికొద్ది మాత్రమే హాజరయ్యారు.. దీనికి సంబంధించిన ఫోటోలని నటి బిందు మాధవి పోస్ట్ చేశారు. సీజన్ వన్ లో బిందు మాధవి కూడా పాల్గొన్నారు.

ఒక అరవ్ మరియు రాహియా ఒకరిని ఒకరు ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు.. వీరి ప్రేమకి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో ఈ రోజున ఒకటయ్యారు. ఈ వివాహ వేడుకకి బిగ్ బాస్ సీజన్ 1 పోటీదారులు స్నేహన్, గాయత్రి రఘురామ్, బిందు మాధవి, హరతి, హరీష్ కల్యాణ్ మరియు సుజా వరుణీ పాల్గొన్నారు. ప్రఖ్యాత దర్శకులు కె.ఎస్.రవికుమార్, చరణ్, విజయ్, రంజిత్ జయకోడి హాజరయ్యారు.

వీరితో పాటు డైరెక్టర్లు కె.ఎస్.రవికుమార్, చరణ్, విజయ్, రంజిత్ జయకోడి, ప్రదీప్ క్రిష్ణమూర్తి, సంగీత దర్శకుడు సైమన్ కింగ్, సినిమాటోగ్రాఫర్ శక్తివేల్, నటుడు వరుణ్ తడితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం అరవ్, రాహియాకి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. అటు అభిమానులు కూడా వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొదటి సీజన్ అనంతరం మంచి స్నేహితులుగానే ఉన్న అరవ్ మరియు రాహియా ఆ తరవాత ప్రేమికులుగా మారి ఇప్పుడు ఒక్కటయ్యారు.


Krishna

Krishna

Next Story