బిగ్ బాస్ లోకి విజయ్ దేవరకొండ ఎంట్రీ..

బిగ్ బాస్ లోకి విజయ్ దేవరకొండ ఎంట్రీ..
x
Highlights

బిగ్ బాస్ సీజన్ 3 లో చివరి ఎలిమినేషన్ ఈ సాయంత్రం 27.10.2019 జరగనుంది. 17 మందితో ప్రారంభం అయిన బిగ బాస్ లో ప్రస్తుతం ఆరుగురు ఉన్నారు. వీరిలో ఐదుగురు...

బిగ్ బాస్ సీజన్ 3 లో చివరి ఎలిమినేషన్ ఈ సాయంత్రం 27.10.2019 జరగనుంది. 17 మందితో ప్రారంభం అయిన బిగ బాస్ లో ప్రస్తుతం ఆరుగురు ఉన్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే వచ్చేవారం..చివరి వారం ఫైనల్స్ లో ప్రైజ్ మనీ కోసం పోటీపడతారు. టాప్ ఫైవ్ లోకి ఇప్పటికే రాహుల్..శ్రీముఖి..బాబా భాస్కర్ చేరిపోయారు. ఇక ఈరోజు వరుణ్..శివజ్యోతి..అలీ రెజాల్లో ఒకరు ఎలిమినేట్ అవుతారు.

ఇదిలా వుంటే.. సన్ డే..ఫన్ డే అంటూ బిగ్ బాస్ లో ఆదివారం పలకరించే నాగార్జున ఈరోజు ఒక ప్రత్యేక అతిథిని తీసుకొస్తారని తెలుస్తోంది. యువ సినీ సంచలనం రౌడీ విజయ్.. ఈరోజు బిగ్ బాస్ లో సందడి చేయనున్నారని చెబుతున్నారు. మీకు మాత్రమే చెబుతా అంటూ సినిమా నిర్మించిన విజయ్ తన హీరో తరుణ్ భాస్కర్ తో ఈరోజు బిగ్ బాస్ లో హంగామా సృష్టించనున్నారని సమాచారం అందుతోంది..సో బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్స్ కి ముందు వీకెండ్ ప్రేక్శకులకి పూర్తి దీపావళి వెలుగుల్ని పంచబోతోంది.. మరెందుకు ఆలస్యం రాత్రి తొమ్మిది గంటలకు మీరూ బిగ్ బాస్ హౌస్ మీద రెండుకళ్లూ వేసేయండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories