నా అమల కోసం చూస్తున్నా..బిగ్ బాస్ లో రౌడీ విజయ్ పటాసులు!

నా అమల కోసం చూస్తున్నా..బిగ్ బాస్ లో రౌడీ విజయ్ పటాసులు!
x
Highlights

నటుడిగా సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు నిర్మాతగా మారిపోయారు. అలా ఎందకో "మీకు మాత్రమే చెబుతా" అంటున్నారు ప్రేక్షకులతో. ఇదిలా వుంటే ఈ సినిమా...

నటుడిగా సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు నిర్మాతగా మారిపోయారు. అలా ఎందకో "మీకు మాత్రమే చెబుతా" అంటున్నారు ప్రేక్షకులతో. ఇదిలా వుంటే ఈ సినిమా ప్రమోషన్ కోసం బిగ్ బాస్ లోకి వెళ్లారు విజయ్.. ఆదివారం..దీపావళి.. విజయ్ ఎంట్రీ.. ఇంతకన్నా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి..ప్రేక్షకులకూ కావలసిందేమిటి?

మామూలుగానే మాటల సిసింద్రీ.. ఇక బిగ్ బాస్ లాంటి వరల్డ్‌ ఫేమస్ రియాలిటీ షోలో తగ్గుతారా.. కచ్చితంగాలేదు. ఈరోజు బిగ్ బాస్ షోలో విజయ్ సందడికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. అందులో కన్ఫెషన్ రూమ్ లో విజయ్ హౌస్ మేట్స్ తో మాటల పటాసులు పేలుస్తున్నారు. మీ ఆవిడ లేకుండా ఎలావుంది అని విజయ్ వరుణ్ ని అడుగుతున్నారు..ఈలోపు నాగార్జున విజయ్ నీ పెళ్లెపుడు? అని అడిగారు. నా అమల దొరికితే వెంటనే.. అంటూ నాగార్జున కు పంచ్ వేశారు..ఇటీవల విజయ్ పెళ్లిపై సోషల్ మీడియాలో వదంతులు చక్కర్లు కొడుతున్న నేపధ్యంలో నాగ్ ప్రశ్నకి విజయ్ అదిరిపోయే సమాధానం కిక్ ఇచ్చింది అభిమానులకు.

బిగ్ బాస్ సీజన్ 3 లో చివరి ఎలిమినేషన్ ఈ సాయంత్రం 27.10.2019 జరగనుంది. 17 మందితో ప్రారంభం అయిన బిగ బాస్ లో ప్రస్తుతం ఆరుగురు ఉన్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే వచ్చేవారం..చివరి వారం ఫైనల్స్ లో ప్రైజ్ మనీ కోసం పోటీపడతారు. టాప్ ఫైవ్ లోకి ఇప్పటికే రాహుల్..శ్రీముఖి..బాబా భాస్కర్ చేరిపోయారు. ఇక ఈరోజు వరుణ్..శివజ్యోతి..అలీ రెజాల్లో ఒకరు ఎలిమినేట్ అవుతారు.

ఇక ఈ ఎపిసోడ్ కి సంబంధించిన తాజా ప్రోమో అందరిలోనూ విపరీతమైన ఆసక్తిని రేపింది. ఇక బిగ్ బాస్ లో దీపావళి విజయ్ పటాసులతో ఎలా వెలిగిపోయిందో చూడాలంటే రాత్రి 9 గంటల దాకా ఆగాల్సిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories