Bigg Boss 5 Promo: వచ్చేసింది బిగ్ బాస్..ఇక చెప్పాలి బోర్ డమ్ కి గుడ్ బై

Sandeep Reddy
Published on: 15 Aug 2021 2:39 PM IST
Bigg Boss Season 5 Telugu 2021 Promo Nagarjuna Promises an end to Boredom
X

బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమోలో నాగార్జున (యూట్యూబ్ ఫోటో)

Bigg Boss Season 5: "బోర్ డమ్ కి చెప్పండి గుడ్ బై" అంటూ ప్రముఖ టెలివిజన్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రోమోని విడుదల చేసింది. గత కొంత కాలంగా బిగ్ బాస్ 5 సీజన్ కి హోస్ట్ గా నాగార్జున పేరుతో పాటు రానా దగ్గుబాటి మరికొంతమంది పేర్లు వినిపించిన తాజా ప్రోమోలో నాగార్జున కనిపించడంతో హోస్ట్ గా నాగార్జున కొనసాగుతున్నడని క్లారిటీ వచ్చింది. ఇక గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో 16 మంది స్టార్ సెలబ్రిటీలను బిగ్ బాస్ టీం జూమ్ మీటింగ్ ద్వారా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 5న బుల్లితెరపై మొదలుకాబోతున్న ఈ బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ కోసం ఇప్పటికే ఎంపిక అయిన కంటెస్టెంట్ లు బిగ్ బాస్ యాజమాన్యం సూచనల మేరకు తమ ఎంట్రీని కూడా గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తుంది.

ఆగష్టు 22న కంటెస్టెంట్ లను హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో క్వారైంటైన్ లో ఉంచబోతున్నట్లు సమాచారం. మరోపక్క కంటెస్టెంట్ లను క్వారైంటైన్ చేసే కంటే ముందుగానే వారి యొక్క వ్యాక్సినేషన్ సర్టిఫికేషన్ తో పాటు కరోనా టెస్ట్ లు కూడా చేయనుంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ ల వివరాలు ఇలా ఉన్నాయి. కొంత కాలంగా యూట్యూబ్ ఫేమ్ శన్ముఖ్ జశ్వంత్ ఎంట్రీపై పలు రకాల వార్తలు వస్తున్నా సీజన్ 5లో తన ఎంట్రీ పక్కా అని తెలుస్తుంది.

యాంకర్ రవి, శన్ముఖ్ జశ్వంత్, టీవీ ఆర్టిస్ట్ విజే సన్నీ, రేడియో జాకీ కాజల్, టివి ఆర్టిస్ట్ మానస్, మోడల్ జశ్వంత్, యాంకర్ లోబో, సిరి హనుమంత్, శ్వేతా వర్మ, ప్రియాంక సింగ్ అనే ట్రాన్స్జెండర్ ని కూడా ఎంపిక దాదాపుగా ఖాయం అయినట్టు సమాచారం. క్వారైంటైన్ కంటే ముందే ఈ కంటెస్టెంట్ ల యొక్క వ్యక్తిగత ప్రోమొలను కూడా షూట్ చేస్తారని సమాచారం.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story