Bigg Boss Season 5 Promo: మాటలు మారాయి.. మనస్పార్ధాలు మొదలయ్యాయి

* రెండోరోజు ఎపిసోడ్ లో కూడా అంతకు మించి మాటల యుద్ధం జరగనున్నట్లు తెలుస్తుంది.

Sandeep Reddy
Published on: 7 Sept 2021 6:11 PM IST
Bigg Boss Season 5 2nd day Promo Released Today 07 09 2021
X

బిగ్ బాస్ సీజన్ 5 (ఫోటో: స్టార్ మా)

Bigg Boss Season 5 Promo : బిగ్ బాస్ సీజన్ 5.. మొదటి రోజు నామినేషన్ టాస్క్ లో గొడవలతో ప్రారంభం అయిన బిగ్ బాస్ హౌస్.. రెండో రోజు ఎపిసోడ్ లో కూడా అంతకు మించి మాటల యుద్ధం జరగనున్నట్లు తెలుస్తుంది. లోబో, సిరి మధ్య మాటలు చిలికి చిలికి గాలివానల మారనుంది. ఇక లహరితో జరిగిన సంభాషణలో ఆర్జే కాజల్ ఎమోషనల్ అయి కంటతడి పెట్టడం తాజాగా విడుదలైన ప్రోమోలో మనం చూడొచ్చు.


గత సీజన్స్ కంటే అయిదవ సీజన్ పోటాపోటీ మాటలతో రసవత్తరంగానే ఉండబోతున్నట్లు అర్ధం అవుతుంది. ఇక సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రోమోలో పవర్ రూమ్ టాస్క్ లో నటుడు విశ్వ.. విజేతగా నిలవడంతో బిగ్ బాస్ ఎవరైనా ఇద్దరి ఇంటి సభ్యులను ఎంచుకొని వారి దుస్తులను స్టోర్ రూమ్ లో పెట్టాల్సి వస్తుందన్నపుడు విశ్వ తనకి రవి, ప్రియల పేర్లు ఎంచుకున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళడం, యాంకర్ రవి లేడీ డ్రెస్ లో దర్శనం ఇవ్వడం వంటి సరదా సన్నివేశాలు కూడా మంగళవారం ఎపిసోడ్ లో మనం చూడబోతున్నాం.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story