తనని తాను శిక్షించుకున్నాడు..కెప్టెన్ కిరీటం పట్టాడు..రసవత్తరంగా బిగ్ బాస్ 3

తనని తాను శిక్షించుకున్నాడు..కెప్టెన్ కిరీటం పట్టాడు..రసవత్తరంగా బిగ్ బాస్ 3
x
Highlights

తమన్నా విశ్వరూపం.. జాఫర్ ఆట.. బాబా భాస్కర్ మార్క్ వినోదం.. వరుణ్ కెప్టెన్ కిరీటం.. ఇదీ బిగ్ బాస్3 ఎపిసోడ్ 12 సాగిన విధానం.తనకు తానుగా జైలుకు వెళ్లిన...

తమన్నా విశ్వరూపం.. జాఫర్ ఆట.. బాబా భాస్కర్ మార్క్ వినోదం.. వరుణ్ కెప్టెన్ కిరీటం.. ఇదీ బిగ్ బాస్3 ఎపిసోడ్ 12 సాగిన విధానం.

తనకు తానుగా జైలుకు వెళ్లిన వరుణ్ పై హిమజ చేసిన కామెంట్.. వితిక, హిమజల మధ్య వాగ్వివాదానికి దారితీసాయి. తన బిహేవియర్ బాలేదని వరుణ్ రియలైజ్ అయ్యాడు అందుకే.. జైలుకి వెళ్ళడానికి సిద్ధం అయ్యాడు అని హిమజ వ్యాఖ్యానించింది. దీనిని ఖండిస్తూ వాదించింది వితిక. మధ్యలో కలగ చేసుకుని వితికను సపోర్ట్ చేసిన పునర్నవిని నీ పని నువ్వు చూసుకో అంటూ గట్టిగా చెప్పింది హిమజ. ఈ విషయాన్ని జైల్లో వున్నవరుణ్ కి చెప్పింది వితిక. వరుణ్ ఆమెను కూల్ గా ఉండమని చెప్పి సముదాయించాడు. తర్వాత అలీ కూడా ఈ విషయం పై హిమజకి వరుణ్ గురించి చెప్పబోతుంటే ఆమె అలీని కూడా గట్టిగా దేబ్బలాడింది. కావాలంటే నన్ను ఎలిమినేషన్ కి నామినేట్ చేస్కో అంటూ దురుసుగా చెప్పింది.

తమన్నా హల్ చల్..

రాహుల్ జైలు లో ఉన్న తమన్నాను మీ ఇంట్లో మీ పేరెంట్స్ అంతా బాగానే ఉంటారు కదా..మీరు మాత్రమే ఎందుకిలా అని ప్రశ్నించాడు. దానికి తమన్నా తన జీవిత విశేషాల్ని వివరంగా చెప్పింది.

సరిగ్గా ఇలా తమన్నా తన గురించి తాను చెప్పుకున్న కొద్ది సేపటికి బిగ్ బాస్ వాళ్ళని జైలు నుంచి విడుదల చేశాడు. అనంతరం వాళ్ళకి డిమాండ్ టాస్క్ ఇచ్చాడు. హౌస్ బయట లాన్ లో ఒక వజ్రాన్ని ఉంచి.. అది దక్కించుకున్న వాళ్లకి హౌస్ మీద పూర్తి అధికారం వస్తుందని చెప్పాడు. వాళ్ళు చెప్పినట్టు మిగిలిన హౌస్ మేట్స్ వినితీరాల్సిందే అనీ, అది సాధించిన వాళ్ళు హౌస్ మేట్స్ తో తమకు నచ్చిన పనులు చేయిన్చుకోవచ్చనీ చెప్పాడు. ఈ టాస్క్ లో మొదట వరుణ్ వజ్రం దక్కించుకున్నాడు. దాంతో హౌస్ కి కింగ్ అయిపోయాడు. అంతే, వెంటనే హిమజ పై రివెంజ్ తీర్చుకున్నాడు. తన బట్టలన్నీ ఉతకాలని ఆర్డర్ వేశాడు. తరువాత శ్రీముఖి, మహేష్ లకు బెడ్ షీట్స్ మడత పెట్టాలని ఆదేశించాడు. బాబా భాస్కర్ ను మంత్రిగా పెట్టుకుని.. అతని ద్వారా తన ఆజ్ఞలు నెరవేరేలా చేసుకున్నాడు. ఇక తమన్నా తో నాగినీ డ్యాన్స్ చేయించాడు. రాహుల్ ని రంగా రంగా రంగస్థలాన..పాట పాడమని దానికి జాఫర్ ని డాన్స్ చేయమన్నాడు. జాఫర్ చాలా యాక్టివ్ గా డ్యాన్స్ చేశాడు. ఇక తరువాత వంతు అలీకి వచ్చింది. అలీ డిమాండ్ గెల్చిన వెంటనే.. జంబలకడిపంబ స్టైల్ లో అందర్నీ మరిపోవాలన్నాడు. అంటే, మగవాళ్ళు ఆడవాళ్ళ లాగా.. ఆడవాళ్ళు మగాళ్ల లాగా.. దానికి జాఫర్ ఇటువంటి పనులు తాను చేయలేనని చెప్పేశాడు. దాంతో అలీ మీ ఇష్టం అన్నాడు. ఇక మిగిలిన వారంతా ఒక్కొరుగా..ఇద్దరిద్దరుగా అలీ చెప్పినట్టు చేశారు. బాబా భాస్కర్ తనదైన స్టైల్ లో రెచ్చిపోయాడు. అలీ తమన్నాను కూడా అలా చేయమని అడిగాడు. దానికి జాఫర్ అభ్యంతరం చెప్పాడు. తాను సోషల్ వర్కర్ అటువంటి పనులు చెప్పకూడదని వారించాడు. అంతే.. ఒక్కసారిగా తమన్నా అలీ మీద విరుచుకు పడింది..

అసలు నీకు సిగ్గు, శరం ఏమైనా ఉందా? అంటూ రెచ్చిపోయింది. ఇష్టం వచ్చినట్టు తిట్లు అందుకుంది. అందరూ ఆమెను అడ్డుకోవాలని ప్రయత్నించినా ఆమె ఆగలేదు. వీడికి నెత్తిన కిరీటం వస్తే కోతికి కొబ్బరికాయ దొరికినట్టుంది.. బాడీ తెల్లగా ఉంటె హీరో అనుకున్తున్నవేమో.. నువ్వు సీరియల్స్ లో చిన్న క్యారెక్టర్ గాడివి.. జీవితంలో సినిమా హీరో కాలేవు.. నేను కానివ్వను. బిగ్ బాస్ లోకి వచ్చేటప్పుడు నాకు విలన్ ఎవరా అని చూసాను. ఇప్పుడు తెలిసింది అలీ గాడు నాకు విలన్. వాడి సంగతి తేలుస్తా ఇలా రకరకాలుగా తిట్టిపోసింది. శివజ్యోతి, రోహిణిలు నవ్వు గేమ్ ఆడితే ఆడు.. లేకపోతే లేదు.. అంతేకానీ, ఇలా మాట్లాడటం పధ్ధతి కాదని చెప్పారు. వారి మీద కూడా తమన్నా ఫైర్ అయింది. అసలు తమన్నా తనకు తాను తగ్గేవరకూ హౌస్ మొత్తం మోత మోగింది.

తరువాత హిమజ డిమాండ్ సాధించింది కానీ, ఇంతలో టాస్క్ ముగిసింది.

హౌస్ తొలి కెప్టెన్ వరుణ్..

డైమండ్ పవర్ గేమ్ లో కిరీటం సాధించిన వరుణ్, అలీ, హిమజలను ఈ వారం హౌస్ కెప్టెన్ పోటీదారులుగా బిగ్ బాస్ ప్రకటించాడు. హౌస్ మేట్స్ అందరూ కల్సి వారి ముగ్గురులో ఒకరిని కెప్టెన్ గా ఎన్నుకోవాలని సూచించాడు బిగ్ బాస్. ఇందులో హిమజకు ఒక్క ఓటు కూడా రాలేదు. పోటీ అలీ, వరుణ్ మధ్య హోరాహోరీ గా సాగింది. పన్నెండు ఓట్లలో వరుణ్, అలీ లలకు చేరి ఆరు ఓట్లు వచ్చి టై అయింది. ఈ సమయంలో శ్రీముఖి హిమజను హౌస్ మేట్ గా నువ్వు కూడా ఓటు వేయొచ్చు అని చెప్పింది. దీంతో హిమజ తన ఓటు వరుణ్ కి వేసింది. అలా వరుణ్ బిగ్ బాస్ సీజన్ 3 మొదటి కెప్టెన్ అయ్యాడు.

ఎలావుందంటే..

చాలా ఆసక్తికరంగా ఎపిసోడ్ నడిచింది. తమన్నా తన జీవితం గురించి చెప్పడం.. అది అందర్నీ కదిలించింది. అదే తమన్నా.. అలీ మీద ఇష్టానుసారంగా రెచ్చిపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. మామూలుగా కాదు అసలు ఆమె విపరీతంగా అలీని తిట్టింది. వ్యక్తిగతంగా కూడా చాలా డేమేజింగ్ గా మాట్లాడింది. అయితే, ఇక్కడ అలీ అందరి మనసుల్నీ గెలిచేసుకున్నాడు. తమన్నా నా విలన్ నువ్వే అంది కానీ హౌస్ లో హీరో అలీ అనే చెప్పాలి. తమన్నా అంతగా రెచ్చి పోతున్నా.. ఒక్క తప్పుమాట కూడా అలీ అనలేదు. కొందరు అలానే అంటారు.. మన టాస్క్ మనం చేయాలి అంటూ తమన్నాను అడ్డుకుంటున్న మిగిలిన హౌస్ మేట్స్ ని సముదాయించాడు. అంత ఓర్పుగా ఉన్నందుకు అలీకి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక కెప్టెన్ టాస్క్ అని తెలియక అందరూ డిమాండ్ సాధించే విషయంలో పెద్దగా పోటీ పడలేదు. ఆ ట్విస్ట్ బావుంది.

మొత్తమ్మీద బిగ్ బాస్ మెల్లగా రసవత్తరంగా మారుతోంది. అందరూ కలసి మెలసి ఆడే ఆట కాదని హౌస్ మేట్స్ కి తెలిసివచ్చేలా.. ఎవరి గేమ్ వాళ్లు ఆడటానికి పురికోల్పేలా పరిస్థితులు మారుస్తున్నాడు బిగ్ బాస్.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories