బిగ్ బాస్ హైలైట్స్: తమన్నారోత.. పునర్నవి రచ్చ!

బిగ్ బాస్ హైలైట్స్: తమన్నారోత.. పునర్నవి రచ్చ!
x
Highlights

మళ్లీ రెచ్చిపోయిన తమన్నా.. ధిక్కారస్వరం వినిపించిన పునర్నవి.. కొందరివాడైన బాబా భాస్కర్.. రచ్చగా మారిన ఎలిమినేషన్ ప్రక్రియ.. ఇవీ బిగ్ బాస్ సీజన్ 3...


మళ్లీ రెచ్చిపోయిన తమన్నా.. ధిక్కారస్వరం వినిపించిన పునర్నవి.. కొందరివాడైన బాబా భాస్కర్.. రచ్చగా మారిన ఎలిమినేషన్ ప్రక్రియ.. ఇవీ బిగ్ బాస్ సీజన్ 3 ఎపిసోడ్ 16 విశేషాలు..

ఆదివారం వినోదాల మత్తు దించేందుకు సోమవారం నామినేషన్ల వేడి పుట్టిస్తాడు బిగ్ బాస్. ఎపిసోడ్ 16 ఎలిమినేషన్స్ నామినేషన్ డే. ప్రతి సారీ రహస్యంగా జరిపే నామినేషన్ ప్రక్రియను ఈసారి బహిరంగంగా పెట్టాడు బిగ్ బాస్. దీంతో హౌస్ మేట్స్ కు షాక్. ఎందుకంటే, సీక్రెట్ నామినేషన్ విధానంలో తాము నామినేట్ చేసిన వ్యక్తి గురించి తమకున్న అభిప్రాయాలను కచ్చితంగా చెప్పే వీలుంటుంది. ఓపెన్ లో అలా కుదరదు కదా. దీంతో సిల్లీ కారణాలతో తాము నామినేట్ చేయాలనుకున్నవారిని నామినేట్ చేశారు.

కొందరి వాడవుతున్న బాబా భాస్కర్..

బాబా భాస్కర్ బిగ్ బాస్ హౌస్ లో అందరికీ నచ్చిన అందరివాడు. రెండు వారాల్లో ఒక్కరు కూడా ఆయనను నామినేట్ చేయలేదు. కానీ, ఈసారి ముగ్గురు ఆయనను నామినేట్ చేశారు. కారణం కూడా స్పష్టంగా కనబడింది. మొదటి సారిగా ఈ అందరివాడు కొందరివాడిగా కనిపించాడు. మహేష్ తో కల్సి నామినేషన్ లో ఎవరు ఉండాలన్న చర్చా జరిపాడు. హౌస్ లో గ్రూపులు ఉన్నా ఎ గ్రూపు కి దగ్గరగా లేని భాస్కర్ ఒక్కసారిగా మహేష్ గ్రూపుకి దగ్గరయ్యాడు. దీంతో తొలిసారి నామినేషన్ కి వెళ్ళాడు.

తమన్నా రచ్చ..

ఇక మొదట్నుంచీ చాలా విషయాల్లో హౌస్ లో గొడవలు చేస్తున్న తమన్నా ఈసారి కూడా రచ్చ చేసింది. రవికృష్ణ ఆమెను నామినేట్ చేస్తూ కారణం చెబుతుండగా.. కూచోరా చెప్పావు గానీ, అని మొదలు పెట్టిన తమన్నా చాలా అభ్యంతరకరమైన మాటలతో రవికృష్ణని తిట్టింది. అయినా రవి కూల్ గానే ఉన్నాడు. కానీ, తమన్నా మాత్రం అసలు ఏమాత్రం తగ్గలేదు. మొత్తం హౌస్ అంతట్నీ తన మాటలతో షేక్ చేసింది. శ్రీముఖి తమన్నాకు సర్ది చెప్పాలని ప్రయతినించి తనూ తిట్లు తింది. ఒక్కరిని కాదు, తనను ఆపాలని ప్రయత్నించిన ప్రతిఒక్కరినీ ఆమె ఇష్టానుసారంగా మాట్లాడింది.

పునర్నవి ఫైర్...

ఆఖరుగా పునర్నవి నామినేషన్ లో ఒక్కసారిగా ఫైర్ అయింది. అసలు అందరూ నన్నెందుకు కార్నర్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేను ఎవరినీ నామినేట్ చేయనని మొండికేసింది. మొదటి వారం ఎవరితోనూ కలవలేదన్నారు.. రెండోవారం అంటీ ముత్తనట్ట్టు ఉన్నావన్నారు.. ఇప్పుడు మూడోవారం కూడా అర్థం లేని కామెంట్స్ తో నామినేట్ చేస్తున్నారు. అంటూ ఆమె రెచ్చిపోయింది. అయితే, బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియలో కచ్చితంగా పాల్గోవాలనీ.. లేకుంటే మొత్తం బిగ్ బాస్ అన్ని వారాలు పునర్నవి డైరెక్ట్ గా నామినేట్ అయిపోతుందని చెప్పాడు. అంతేకాదు.. ఒకవేళ హౌస్ మేట్స్ ఒప్పుకుంటే మొత్తం అందరూ ఈవారం నామినేషన్స్ లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఆలోచించుకోవాలని సమయం ఇచ్చాడు. ఈ సమయంలో వరుణ్..పునర్నవిని పక్కకు తీస్కువెల్లి సముదాయించాడు. నువ్వు అన్నివారాలు నామినేట్ అవడం పద్ధతి కాదు. ఇది ఆట. ఆదుకోవాలి అంటూ సర్ది చెప్పాడు. గ్రూపుగా తయారయి తనను టార్గెట్ చేశారని పునర్నవి చెప్పింది. చివరికి ఆమెను శాంత పరిచి నామినేషన్ ప్రక్రియ కొనసాగేలా చేశాడు వరుణ్. దీంతో నామినేషన్ ప్రక్రియ ముగిసింది..

ఈవారం నామినీలు వీరే!

నామినేషన్ ప్రక్రియలో భాగంగా..తమన్నా- బాబా భాస్కర్‌, రోహిణి.. రాహుల్‌-మహేష్‌, అలీ రెజా.. వితికా- శివజ్యోతి, బాబా భాస్కర్‌.. మహేష్‌- రాహుల్‌, పునర్నవి.. శివజ్యోతి-వితికా, తమన్నా.. అషూ రెడ్డి-శ్రీముఖి, తమన్నా.. హిమజ-రాహుల్‌, పునర్నవి.. వరుణ్‌- మహేష్‌, శ్రీముఖి.. బాబా భాస్కర్‌- వితికా, పునర్నవి.. రవికృష్ణ- తమన్నా, హిమజ.. అలీ రెజా-తమన్నా, రాహుల్‌.. రోహిణి-తమన్నా, పునర్నవి, పునర్నవి- శివజ్యోతి, బాబాభాస్కర్ లను నామినేట్ చేశారు. వీరిలో ఎక్కువ నామినేషన్స్ వచ్చిన పునర్నవి భూపాలం, రాహుల్ సిప్లిగంజ్.. వితికా షేరు, తమన్నా సింహాద్రి, బాబా భాస్కర్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నట్టు బిగ్ బాస్ ప్రకటించాడు.

ఎలా వుందంటే..

తమన్నా వ్యవహార శైలి చాలా చికాకు తెప్పించే విధంగా ఉంది. తన బూతు పురాణం రోత పుట్టించింది. తను ఒక గేమ్ ఆడేందుకు వచ్చినట్టు కనిపించలేదు. తమన్నా వ్యవహారం చూసుంటే.. ఈసారి ఉన్న కాంటెస్టంట్స్ ఎక్కువ మంది కూల్ గా ఉండే వారే ఉన్నారని, కావాలనే.. తమన్నాను హౌస్ లోకి పంపించరనే భావన ప్రేక్షకులకు కలుగుతోంది. విచ్చల విడిగా తమన్నా ప్రవర్తిస్తోంది. ఆమె మాటలు కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి. చూడబోతే హౌస్ లో ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు ఆమె మాటలకు బ్రేక్ అయి రచ్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పునర్నవి కూడా అనవసర రాద్ధాంతం చేసింది. దాదాపుగా ఉడుకుమోత్తనంతో ప్రవర్తించింది. మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ మూడు అలకలు.. ఆరు బూతులు అన్నట్టు సాగింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories