అంతా అనుకున్నట్టే.. రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ 3 విజేత!

అంతా అనుకున్నట్టే.. రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ 3 విజేత!
x
Highlights

రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ విజేతగా నాగార్జున ప్రకటించారు. చిరంజీవి ఆయనకు ట్రోఫీ అందచేశారు.

బిగ్ బాస్ 3 గ్రాండ్ ఫినాలే.. అదిరిపోతోంది. ధూమ్ ధాం డ్యాన్స్ లు.. నాగార్జున హోస్టింగ్ చమక్కులు.. సెలబ్రిటీల సందడి.. వావ్ అనిపించేస్తున్నాయి. ఇప్పటికే టాప్ 5 నుంచి ముగ్గురు ఎలిమినేట్ అయిపోయారు. మిగిలినది శ్రీముఖి..రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరూ టైటిల్ కోసం చివరి వరకూ మిగిలారు.

వీరిద్దరినీ హౌస్ నుంచి బయటకు తీసుకురావడానికి నాగార్జున హౌస్ లోకి వెళ్లారు. అక్కడ ఇద్దరితో కొద్దిసేపు ముచ్చట్లు పెట్టారు. తరువాత రాహుల్ జర్నీ చూపించారు, అదేవిధంగా శ్రీముఖి జర్నీ కూడా చూపించారు. వారిద్దరితో కలిసి నాగార్జున టీవీలో ఆ వీడియోలు చూసి ఆనందించారు. తరువాత వారిద్దరికీ ఓ ఆఫర్ ఇచ్చారు. బిగ్ బాస్ ప్రైజ్ మనీ 50 లక్షలు ఇద్దరూ చెరో 25 లక్షలు తీసుకుని సంయుక్త విజేతలుగా వెళ్ళిపోవాలని కోరారు. దానికి ఇద్దరూ అంగీకరించలేదు. నాగార్జున ఎంత నచ్చ చెప్పినా వారు వినలేదు. దీంతో ఇద్దరినీ తీసుకుని స్టేజి మీదకు వచ్చేశారు.

మెగా ఎంట్రీ..

ఫైనల్స్ విజేతను తేల్చడానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఆయనకు గ్రాండ్ వెల్ కం చెప్పారు నాగార్జున. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఫైనల్స్ లో విజేత ఎవరో మీరు చెప్పండి అంటూ అడిగారు. సరదా మాటలతో హంగామా చేశారు. నాగార్జున జర్నీ విత్ బిగ్ బాస్ వీడియో చూపించమని కోరి చూశారు. తరువాత ఒక్కో కంటెస్టంట్ ని పలకరించి నవ్వుల పువ్వులు పూయించారు. తనదైన శైలిలో వారితో మాట్లాడి అలరించారు.

విజేత రాహుల్ సిప్లిగంజ్...

రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నాగార్జున ప్రకటించారు. చిరంజీవి ఆయనకు ట్రోఫీ అందచేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories