Top
logo

బిగ్ బాస్ ఫినాలే షో ని వినోదాల విందుగా మార్చిన మెగాస్టార్ చిరంజీవి!

బిగ్ బాస్ ఫినాలే షో ని వినోదాల విందుగా మార్చిన  మెగాస్టార్ చిరంజీవి!
X
Highlights

మెగా ఫ్లేవర్ తగిలితే ఏ షో అయినా గ్రాండ్ గా మారాల్సిందే! ఇప్పటివరకూ ఓ లెక్క.. ఇక నుంచి ఇంకో లెక్క అన్నట్టు చిరంజీవి ఎంట్రీ బిగ్ బాస్ ఫినాలేని అమాంతం పైకి లేపింది!

కొన్నిసార్లు రావడం లేటవుతుందేమో కానీ, రావడం మాత్రం పక్కా అన్నట్టుగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే షో లో లేటుగా వచ్చి ఘాటుగా వినోదాల బాక్స్ బద్దలు కొట్టేశారు మెగాస్టార్ చిరంజీవి. ఏ ఈవెంట్ చూసినా ఒకటే పధ్ధతి.. రికార్డింగ్ దాన్సుల్లాంటి డాన్సులూ.. హోస్ట్ లు చేసే హడావుడి.. విషయం పెద్దగా పండదు. ఇదే అనిపించింది ప్రేక్షకులకి బిగ్ బాస్ ఫినాలే చూస్తున్నంత సేపూ..

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్..గ్రాండ్ ఫినాలే..మూడు గంటలపాటు నాన్ స్టాప్ వినోదం గ్యారంటీ అనుకున్న ప్రేక్షకులకు మన్మధుడి లాంటి హోస్ట్ నాగార్జున ఉన్నా.. వరుసగా హీరొయిన్ రాశీఖన్నా..దర్శకుడు మారుతి, నటుడు శ్రీకాంత్, నటి కాథరీన్, హీరోయిన్ అంజలి ఇలా ఎంత మంది వచ్చినా ఆ స్థాయి ఊపు మాత్రం రాలేదు. మరో పక్క అప్పటికే లీకుల పుణ్యమా అని బిగ్ బాస్ విజేత ఎవరో అందరికీ తెలిసిపోయింది. మిగిలిన ఐదుగురిలో ఎవరు ఏ స్థానంలో నిలిచిపోతారనే స్టోరీ అందరికీ స్పష్టమైన అవగాహనా ఉంది. రాజమౌళి సినిమా కథను ముందే రివీల్ చేసినా.. ఆ కథ ఎలా సినిమాలో ఉందొ చూద్దాం అనుకున్నట్టుగా ప్రేక్షకులు బిగ్ బాస్ ఫినాలేని చూస్తున్నారు. ఎక్కడా కొత్తదనం లేదు.. పాపం కింగ్ నాగ్ ఒక్కరూ ఎంత సేపు దానిని అలా సాగదీయగలరు? ఇక అందరికీ మిగిలిన్ ఆశ అల్లా రాహుల్ విజేతగా ఎలా ప్రకటిస్తారో చూద్దామనే! వినోదం గురించి అంతా మర్చిపోయిన పరిస్థితి అది.

సరిగ్గా ఆ సమయంలో ఒక్క చిన్న బ్రేక్ తరువాత సైరా సైరన్ మోగింది. మెగా ఎంట్రీ.. సూపర్ స్వాగతం చిరంజీవి స్టేజి మీద అడుగు పెట్టారు. అంతే! అప్పటివరకూ ఉన్న వాతావరణం మారిపోయింది. వస్తూనే సందడి మొదలు పెట్టేశారు. ఎంతో అలవోకగా షో మొత్తం తన భుజాల మీదకి తీసేసుకున్నారు. సైరా సాంగ్ తొ ఎంట్రీ నుంచి శ్రీముఖి తొ సేల్ఫీ వరకూ అంతా తానే అన్నట్టు షో లో వినోదాల పువ్వులు పూయించారు. పంచ్ ల పటాసులు పేల్చారు.

ముఖ్యంగా హౌస్ మేట్స్ ని పరిచయం చేయాలని నాగార్జున ప్రయత్నించినప్పుడు ఆయనతో వీళ్ళంతా నాకు తెలుసు అంటూ.. ఒక్కోరి గురించి అయన మాట్లాడిన మాటలు ప్రేక్షకులకు కాసేపు అది బిగ్ బాస్ ఫినాలే అనే సంగతి మర్చిపోయేలా చేశాయి. ఈ అమ్మాయి పునర్నవి అంటూ చిరంజీవి అనగానే తనని పునర్నవి గారు అనాలని నగ్క్ష చెప్పడం..దానికి మెగాస్టార్ ఎక్స్ ప్రెషన్.. ఒక్కసారిగా అందరినీ నవ్వుల్లో మున్చేశాయి. ఇక అక్కడ నుంచి ఆ నవ్వులు ఎక్కడా తగ్గలేదు. ఆఖరుకు రాహుల్ ను విజేతగా ప్రకటించినా గానీ.. శ్రీముఖి ని హుషారుగా ఉంచేందుకు చిరు ప్రయత్నాలు అన్నీ అదిరిపోయాయి. కంటెస్టెంట్స్‌ ఒక్కొక్కరి గురించి చెప్తున్న సమయంలో హేమ దగ్గరకు వచ్చినప్పుడు 'నేనంటే గౌరవం. నాగార్జున అంటే క్రష్‌' అని ఆటపట్టించడం కానీ, జాఫర్‌ పై సుతిమెత్తగా వేసిన సెటైర్స్‌ కానీ అసలు ఇదిరా చిరంజీవి అంటే అనిపించాయి. చివర్లో సెల్ఫీ తీసుకునే సమయంలో శ్రీముఖి మెగాస్టార్‌ భుజాల చుట్టు రెండు చేతులు వేసి తీగలా అల్లుకుపోయింది. సురేఖగారు వచ్చారని నాగార్జున అన్నప్పుడు.. అంతకు ముందు నేను సెల్ఫీ తీస్తానని చిరంజీవి సెల్‌ఫోన్‌ తీసుకున్నప్పుడు..చిరంజీవి టైమింగ్‌ కి తిరుగులేదు. మొత్తమ్మీద చిరంజీవి ఎంట్రీ బిగ్ బాస్ ఫినాలే గ్రాండ్ షో గా నిలబెట్టిన్దనేది నిస్సందేహం.


Next Story