Bigg Boss: మెహబూబ్‌ దిల్‌సే ఇంట తీవ్ర విషాదం..

Mehaboob Dil Se: బిగ్‌బాస్‌ ​కంటెస్టెంట్‌ మెహబూబ్‌ దిల్‌సే ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

Arun Chilukuri
Published on: 6 Aug 2022 9:25 PM IST
Bigg Boss Contestant Mehaboob Dil Se Mother Passed Away
X

Bigg Boss: మెహబూబ్‌ దిల్‌సే ఇంట తీవ్ర విషాదం..

Mehaboob Dil Se: బిగ్‌బాస్‌ ​కంటెస్టెంట్‌ మెహబూబ్‌ దిల్‌సే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో మెహబూబ్‌ తల్లి మరణించింది. తల్లి మృతి పట్ల మెహబూబ్‌ ఓ సుధీర్ఘ పోస్టును షేర్‌ చేశాడు. అమ్మా.. నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోయావ్.. నేను ఇకపై నిర్ణయాలు ఎలా తీసుకోవాలి?.. నేను ప్రతీ రోజూ ఎవరితో మాట్లాడాలి?.. నువ్ లేకపోతే నేను ఎలా బతకాలి అమ్మా.. నువ్ లేకపోతే ఎలా బతకాలో అర్థం కావడం లేదమ్మా.. నువ్ నన్ను ఎప్పుడూ కూడా ఏ దానికి కూడా అడ్డు పడలేదు.. నా ఎదుగుదలను చూస్తూ మురిసిపోయావ్ అమ్మా.. నా గెలుపోటముల్లో నువ్ అండగా ఉన్నావ్ అమ్మా..

నీ మాటలతో నాలో ఎప్పుడూ ధైర్యాన్ని నింపుతూ ప్రోత్సహించావ్.. అవే నన్ను ముందుకు నడిపించాయ్.. మా కోసం నువ్ ఎంతో పోరాడావ్ అమ్మా.. మా గురించి నువ్ నీ జీవితంతో పోరాడావ్.. ఎవ్వరూ చేయలేని విధంగా నువ్ మాకోసం చేశావ్.. మా కోసం అన్నీ త్యాగం చేశావ్.. నువ్ లేకపోతే మా ఈ జీవితాలు ఎటు వెళ్తాయో ఎక్కడికి వెళ్తాయో అర్థం కావడం లేదు..

ప్రతీ క్షణం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను అమ్మా.. జీవితం అంటే ఏంటో చూపించావ్ అమ్మా.. నువ్ ఎక్కడున్నా సరే నన్ను గమనిస్తుంటావ్ అని నాకు తెలుసమ్మా.. నువ్ గర్వపడేలా చేస్తాను అమ్మా.. తమ్ముడు శుభాన్, డాడీలను జాగ్రత్తగా చూసుకుంటానమ్మా.. మాటిస్తున్నాను అమ్మా..అంటూ మెహబూబ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్‌ చేశాడు. ఇది చూసిన పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు స్టే స్ట్రాంగ్‌ మెహబూబ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story