కార్తీకదీపం వెలుగుల్లో మసకబారిన బిగ్ బాస్

కార్తీకదీపం వెలుగుల్లో మసకబారిన బిగ్ బాస్
x
Highlights

తెలుగు టీవీల్లో ప్రసారమయ్యే వాటిలో నెంబర్ వన్ వినోదాత్మక కార్యక్రమం ఏదని అడిగితే తడుముకోకుండా బిగ్ బాస్ అని చాలా మంది చెబుతారు. కానీ, అది కాదని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. కోట్లాది రూపాయల పెట్టుబడి, ప్రచారం బిగ్ బాస్ సొంతం. అన్నీ ఉన్నాసరే.. కేవలం కుటుంబ కథతో వస్తున్న కార్తీక దీపం రేటింగ్స్ లో టాప్ లో ఉంది. ఆశ్చర్యం అనిపించినా ఇదే నిజం!

బిగ్ బాస్ ప్రపంచంలోనే నెంబర్ వన్ గేమ్ షో! ప్రపంచ టీవీ చరిత్రలో సంచలనం ఈ షో. ఇప్పుడు ఈ షో తెలుగులో కూడా తన సత్తా చాటుతోంది. అయితే, గేమ్ షో లలో నెంబర్ వన్ అయినా సరే.. ఒక తెలుగు సీరియల్ రేటింగ్స్ దరిదాపుల్లోకి కూడా ఈ షో రేటింగ్స్ రావడం లేదు. కోట్లాది రూపాయల బడ్జెట్ తో ఆర్భాటంగా ప్రసారమయ్యే బిగ్ బాస్ రేటింగ్స్ విషయంలో ఓ కుటుంబ కథా సీరియల్ ముందు తేలిపోతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది వాస్తవం అని టీఆర్పీ రేటింగ్స్ చెబుతున్నాయి. అన్నట్టు ఆ సీరియల్ పేరు చెప్పలేదు కదూ. అవును మీరు ఊహించింది కరెక్టే.. అది కార్తీకదీపం. సాయంత్రం 7:30 గంటలకు మాటీవీలో ఈ సీరియల్ ప్రసారం అవుతోంది. దీని తరువాత బిగ్ బాస్ ప్రసారం అవుతుంది. కానీ, టీఅర్పీల్లో మాత్రం ఇప్పుడు తెలుగు టీవీ తెరపై ప్రసారం అవుతున్న ఏ కార్యక్రమమూ కార్తీక దీపం పక్కకి కూడా చేరలేకపోయాయి.

ఎంతో వ్యయప్రయాసలతో ప్రారంభించిన బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్ 17.9 టీవీఆర్ రేటింగ్ రాగా.. కార్తీకదీపం 18.36 సాధించడం చెప్పుకోతగ్గ విశేషం. వీకెండ్‌లో నాగార్జున వస్తుండడంతో బిగ్ బాస్ 10-12 టీవీఆర్ రేటింగ్ సాధింస్తోంది.. అయితే, కార్తీక దీపం సింగిల్ హ్యాండ్‌లో 15.44 తక్కువ కాకుండా వీవీఆర్ రేటింగ్ సాధిస్తోంది. అంటే.. దాదాపు మూడు 5-3 పాయింట్ల తేడా రెండిటి మధ్యా ఉంటోంది.



ఇక బార్క్ రేటింగ్ లలో అయితే కార్తీకదీపం తిరుగులేని వెలుగుల్ని వెదజల్లుతోంది. ఈ సీరియల్‌కి బీట్ చేయడానికి దగ్గర్లో మరే సీరియల్ లేకపోవడం గమనార్హం. ఈ సీరియల్ రేంటింగ్‌కి రెండో స్థానంలో ఉన్న సీరియల్‌గా సగానికిపైగా వ్యత్యాసం ఉంది. 31వ వారానికి సంబంధించి జూలై 27 నుండి ఆగస్టు 2 వరకూ వీక్షకుల ఇంప్రెషన్ లెక్కలు చూస్తే.. కార్తీకదీపం సీరియల్‌ 15247 పాయింట్‌లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.. కోయిలమ్మ 8719, వదినమ్మ 8047, మౌనరాగం 7919 పాయింట్లతో తరువాతి స్థానంలో ఉంది. 5511 పాయింట్లతో ఈటీవీ న్యూస్ ఐదో స్థానంలో ఉంది.

ఇక ఎంటర్టైన్మెంట్స్ చానల్స్ రేటింగుల్లో మాటీవీ దూసుకుపోతోంది. 'కార్తీకదీపం' వెలుగులకు ఓవరాల్‌గా స్టార్ మా ఛానల్ నంబర్ వన్ పొజీషన్‌లో కొనసాగుతోంది. కార్తీకదీపం, మౌనరాగం, కోయిలమ్మ, అగ్నిసాక్షి తదితర సీరియల్స్‌‌తో స్టార్ మా దూకుడు తట్టుకోవడం మిగిలిన ఛానల్స్‌కి ఛాలెంజ్‌గా మారాయి. 800 పాయింట్లకు పైగా సాధించి టాప్ ప్లేస్‌లో ఉంది స్టార్ మా. ప్రతివారం 'కార్తీకదీపం' సీరియల్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సీరియల్‌ ఏకంగా 18.36 టీవీఆర్ రేటింగ్‌తో బుల్లితెరపై సరికొత్త రేటింగ్ రికార్డుల్ని నమోదు చేసింది.

ఓవరాల్ రేటింగ్స్‌లో ఈటీవీ సెకండ్ ప్లేస్‌లో ఉండగా.. ఎప్పటిలాగే సీరియల్స్ కంటే ఈటీవీలో రాత్రి 9 గంటలకు ప్రసారం అయ్యే బులిటెన్‌కే ఎక్కువ రేటింగ్ వస్తోంది. జబర్దస్త్, ఢీ జోడీ, క్యాష్ లాంటి వీక్లీ ప్రోగ్రామ్స్‌కి రేటింగ్ బాగానే ఉన్నా.. 'కార్తీకదీపం' సీరియల్‌ని బీట్ చేయలేకపోవడం విశేషం. ఇక జెమిని టీవీ మూడో స్థానంతో, జీటీవీ నాలుగో స్థానంలో, స్టార్ మా మూవీస్ ఐదో స్థానంతో సరిపెట్టేసుకున్నాయి. మొత్తంగా కార్తీకదీపం దెబ్బకి బిగ్ బాస్‌తో సహా అన్ని రేటింగ్ పడిపోయిందని చెప్పొచ్చు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories