నాగిని లో నటించనున్న బిగ్ బాస్ బ్యూటీ

Tejaswi Prakash: ఈ మధ్యనే పూర్తయిన బిగ్బాస్ సీజన్ 15 గ్రాండ్ ఫినాలే టైటిల్ను సొంతం చేసుకుంది బుల్లితెర నటి తేజస్వి ప్రకాష్.

admin1
Updated on: 1 Feb 2022 12:31 PM IST
Bigg Boss Beauty to star in Nagini
X

నాగిని లో నటించనున్న బిగ్ బాస్ బ్యూటీ

Tejaswi Prakash: ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ హిందీలో ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ మధ్యనే పూర్తయిన బిగ్బాస్ సీజన్ 15 గ్రాండ్ ఫినాలే టైటిల్ను సొంతం చేసుకుంది బుల్లితెర నటి తేజస్వి ప్రకాష్. అయితే బిగ్ బాస్ ట్రోఫీని అందుకున్న ఈమె విజేతగా నిలిచినందుకు 40 లక్షలు క్యాష్ ప్రైస్ ను కూడా అందుకున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా తేజస్వి ప్రకాష్ కు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఈ మధ్యనే ప్రముఖ హిందీ సీరియల్ నాగిని సీక్వెల్ లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది ఈ భామ.

2017 లో వచ్చిన స్వరాగినీ అనే సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన తేజస్వి ఆ సీరియల్ సూపర్ హిట్ అవ్వడంతో పలు రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నారు. బిగ్బాస్ సీజన్ 15 లో కంటెస్టెంట్ గా వచ్చిన తేజస్వి ప్రకాష్ కు మరి ఇంత జనాదరణ లభించింది. దీంతో తేజస్వి ప్రకాష్ పై ప్రస్తుతం ఆఫర్ లో వర్షం కురుస్తునట్లు తెలుస్తోంది.


admin1

admin1

Next Story