Bigg Boss 8 Telugu Contestants: బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్‌పై కీలక అప్‌డేట్.. హౌస్‌లోకి ఎవరూ ఊహించనోళ్లు.

Bigg Boss 8 Telugu Contestants: బిగ్ బాస్ 8వ సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా పాపులర్ యాంకర్స్, సీరియల్ నటీనటులు, సోషల్ మీడియా స్టార్స్‌ను ఈసారి హౌస్‌లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారంట.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 July 2024 8:29 PM IST
Bigg Boss 8 Telugu Contestants: బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్‌పై కీలక అప్‌డేట్.. హౌస్‌లోకి ఎవరూ ఊహించనోళ్లు
X

Bigg Boss 8 Telugu Contestants: బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్‌పై కీలక అప్‌డేట్.. హౌస్‌లోకి ఎవరూ ఊహించనోళ్లు..

Bigg Boss 8 Telugu Contestants: ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ పాపులారిటీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో స్టార్ట్ కాకముందే ఎన్నో లీకులు, అంచనాలతో జనాలను ఊపేస్తుంది. ఇక షో మొదలయ్యాక టీవీ రేటింగ్‌లు అమాంతం ఒక్కసారిగి పెరిగిపోతుంటాయి. అంటే, ఈ షోకి ఎంత పాపులారిటీ ఉందో ఇట్టే ఊహించుకోవచ్చు. ఈ క్రేజ్‌తో అన్ని భాషల్లోనూ ఈ రియాలిటీ షో దూసుకపోతుంది. తెలుగులోనూ ఎంతో సక్సెస్ అయ్యి, ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకుంది.

ఇక తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎప్పుడు మొదలువుతుంది, కంటెస్టెంట్స్ ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో వెతుకులాట మొదలైంది. ఈ క్రమంలో తాజాగా ఓ కీలక అప్ డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బిగ్ బాస్ 8వ సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా పాపులర్ యాంకర్స్, సీరియల్ నటీనటులు, సోషల్ మీడియా స్టార్స్‌ను ఈసారి హౌస్‌లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారంట. అయితే, కంటెస్టెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారంట. లీక్ కాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారంట. అయితే, ఎన్నీ జాగ్రత్తలు తీసుకున్నా.. నెట్టింట్లో మాత్రం మాత్రం లీకవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 8లోకి వచ్చే వారు ఎవరనేది బయటకు వచ్చింది. ఈ లిస్టులో ఎవరున్నారో ఓసారి చూద్దాం..

20మందితో మొదలు..

ఆగస్టు 4న లేదా 11వ తేదీల్లో బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 మొదలుకానుందని తెలుస్తోంది. 100 రోజుల పాటుసాగే బిగ్ బాస్ తెలుగు షోలోకి.. దాదాపు 20 మంది కంటెస్టెంట్స్‌ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. బర్రెలక్క, సురేఖావాణి, కమెడియన్ కిరాక్ ఆర్పీ, హేమ, యాంకర్ రీతూ చౌదరి, హీరో రాజ్ తరుణ్, కుమారీ ఆంటీ పేర్లు తెగ వినిపిస్తున్నాయి.

అమృతా ప్రణయ్ ..

తాజగా ఓటీటీలో సంచలనంగా మారిన పరువు హత్య.. అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో కీలక పాత్ర పోషించిన అమృతా ప్రణయ్ పేరు కూడా వినిపిస్తోంది. ఈమెను కూడా బిగ్ బాస్ షోకి తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, కంటెస్టెంట్స్ ఎవరేనేది తెలియాలంటే మాత్రం షో మొదలుకావాల్సిందే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story