Bigg Boss 7 Telugu: ఒరేమ్ మావా.. ఎవర్రా వీళ్లంతా.. రతికా ఓవర్ యాక్షన్‌తో నెటిజన్ల కామెంట్స్..!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ 11వ వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం నాటి ఎపిసోడ్‌లో నామినేషన్స్ కూడా మొదలయ్యాయి. వైల్డ్ కార్డు ఎంట్రీతో రీ ఎంట్రీ ఇచ్చిన రతిక చాలా సేఫ్ గేమ్ ఆడుతోంది.

Jyothi
Published on: 14 Nov 2023 11:49 AM IST
Bigg Boss 7 Telugu Day 71 Fight Between Rathika And Priyanka and Shobha Shetty in Nominations
X

Bigg Boss 7 Telugu: ఒరేమ్ మావా.. ఎవర్రా వీళ్లంతా.. రతికా ఓవర్ యాక్షన్‌తో నెటిజన్ల కామెంట్స్..!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ 11వ వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం నాటి ఎపిసోడ్‌లో నామినేషన్స్ కూడా మొదలయ్యాయి. వైల్డ్ కార్డు ఎంట్రీతో రీ ఎంట్రీ ఇచ్చిన రతిక చాలా సేఫ్ గేమ్ ఆడుతోంది. శివాజీ చెప్పినట్లే ముందుకుసాగుతోంది. చాలా స్ట్రాంగ్‌గానూ కనిపిస్తోంది. రీఎంట్రీ నుంచి శివాజీ చుట్టే తిరుగుతోంది. అయితే, నామినేషన్ ఎపిసోడ్‌లో మాత్రం ఓ రేంజ్‌లో యాటిట్యూడ్ చూపించడంతో అంతా అవాక్కయ్యారు.

ఇక నామినేషన్స్‌లో కార్తీకదీపం ఫేమ్ శోభా శెట్టిని రతిక తొలుత నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.మొత్తంగా వీరిద్దరు కలిసి ప్రేక్షకులకే విసుగు తెప్పించేలా చేశారు. ఆ తర్వాత ప్రియాంకాను రతికా నామినేట్ చేసింది. దీంతో మరోసారి రతికా ఇళ్లు పీకి పందిరి వేసింది. రతికా అడిగిన ప్రశ్నలకు ప్రియాంకా సమాధానం చెబుతుంటే.. నాన్ సింక్‌లో మాట్లాడుతూ.. ప్రేక్షకులకు విసుగు పుట్టించేలా చేసింది.

ఈ గొడవ తర్వాత ప్రియాంక ఊరుకుంటుందా.. రతికాను నామినేట్ చేసింది. ఇక కోపం పట్టలేని రతికా.. హౌస్‌లో రచ్చ రచ్చ చేసింది. ఇదంతా చూసి ప్రియాంక మాత్రం షాక్‌లో ఉండిపోయింది. ఇలా మొత్తానికి నామినేషన్స్‌లో రతికా చేసిన ఓవర్ యాక్షన్ చూసి మిగతా కంటెస్టెంట్స్ అంతా ముక్కున వేలేసుకున్నారు. మరోవైపు నెటిజన్లు మాత్రం ఇదెక్కడి సంత రా బాబు.. ఎక్కడి నుంచి వచ్చార్రా బాబూ అనుకుంటున్నారు.

Jyothi

Jyothi

Next Story