BIGG BOSS: బిగ్‌బాస్ సీజ‌న్ 5 ముహూర్తం ఖ‌రారు

BIGG BOSS: బిగ్ బాస్ షో మొద‌లైందంంటే చాలు అన్ని భాషల్లో అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎద‌రుచూస్తారు

Samba Siva Rao
Published on: 6 Jun 2021 4:13 PM IST
Bigg Boss 5 Telugu start on July
X

బిగ్ బాస్ (ఫోటో ది హన్స్ ఇండియా)

BIGG BOSS: బిగ్‌బాస్‌ రియాల్టీ షో బుల్లితెరపై మ‌రోసారి సందండి చేయ‌నుంది, బిగ్ బాస్ షో మొద‌లైందంంటే చాలు అన్ని భాషల్లో అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎద‌రుచూస్తారు. ఇక తెలుగులో కూడా ఈ షో స‌క్సెస్ అయింది. గత నాలుగు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు 5వ‌ సీజన్‌ ప్రారంభం అయ్యేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బిగ్‌బాస్ 5ను ఈ వేస‌విలో ప్రారంభించాలని స్టార్ మా నిర్వాహ‌కులు భావించారు. అయితే ​​కరోనా సెకండ్ వేవ్ కార‌ణంగా అది వాయిదా పడింది. ఈ సారి మరింత కొత్తగా షోని నడిపించాలని షో నిర్వాహకులు భావిస్తున్నారట. పాపులర్‌ అయిన నటీనటులను మాత్రమే షోలోకి తీసుకోబోతున్నారట.

అందులో భాగంగా ఇప్ప‌టికే ఈ షోలో పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్‌ను జూమ్ ద్వారా ఇంట‌ర్వ్యూ నిర్వాహిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నారు. వారం ప‌దిరోజుల్లో ఫైన‌ల్ కంటెస్టెంట్స్‌ను ఖ‌రారు చేసి, వారిని క్వారంటైన్‌లో ఉంచి త‌ర్వాత సీజ‌న్‌ను స్టార్ట్ చేస్తార‌ని స‌మాచారం. జూలై రెండో వారంలో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ప్రారంభం కానునట్లు తెలుస్తోంది. ఇక ఐదో సీజన్‌ త్వరలోనే ప్రారంభం కానుండటంతో కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

ఈ సీజన్‌లో యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, యాంకర్ వర్షిణి, హైపర్ ఆది, సింగర్‌ మంగ్లీ, న్యూస్ యాంకర్ ప్రత్యూష పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. ఈ సారి షోకి కూడా నాగార్జునే హాస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని తెలుస్తోంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story