Bigg Boss 5 Telugu: హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్‌లు వీరే!

Bigg Boss 5 Telugu: హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్‌లు వీరే!
x

Bigg Boss 5 Telugu: హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్‌లు వీరే!

Highlights

Bigg Boss 5 Telugu: హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్‌లు వీరే!

Bigg Boss 5 Telugu: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో లలో ఒకటైన బిగ్ బాస్ ఐదవ సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కింగ్ నాగార్జున తనదైన శైలిలో ఒక్కొక్క కంటెస్టెంట్ ను ఆహ్వానించి వారిని బిగ్ బాస్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈసారి 19 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశపెట్టారు. వీరిలో టీవీ నటులు, సినీ నటులు, యాంకర్లు, ఆర్జేలు, ఓ మోడలింగ్ ట్రైనర్ తదితరులు ఉన్నారు. మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లోపలికి వెళ్లారు. సిరి హనుమంత్‌ మొదటి కంటెస్టెంట్‌ కాగా, యాంకర్‌ రవి చివరిగా వెళ్లారు. తొలి కంటెస్టెంట్‌గా యూట్యూబర్‌ సిరి హనుమంత్‌ ఎంట్రీ ఇచ్చింది. రెండో కంటెస్టెంట్‌గా సీరియల్‌ నటుడు విజయ్‌ సన్నీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మూడో కంటెస్టెంట్ గా ల‌హ‌రి బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నాలుగో కంటెస్టెంట్ గా ప్ర‌ముఖ గాయ‌కుడు శ్రీరామ చంద్ర హౌస్ లోకి వెళ్లాడు. ఐదో అభ్య‌ర్థిగా యానీ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ లోకి వ‌చ్చింది. ఆరో కంటెస్టెంట్ గా లోబో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఏడో కంటెస్టెంట్ గా ప్రియ బిగ్ బాస్ హౌస్ లోకి వ‌చ్చింది. మోడ‌ల్ జెస్సీ ఎనిమిదో కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ట్రాన్స్ జెండ‌ర్ ప్రియాంకా సింగ్ తొమ్మిదో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. ప‌దో కంటెస్టెంట్ గా ష‌ణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప‌ద‌కొండ‌వ కంటెస్టెంట్ గా హ‌మిద హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పన్నెండో కంటెస్టెంట్ గా న‌ట‌రాజ్ మాస్ట‌ర్ బిగ్ బాస్ హౌస్ లోకి వ‌చ్చాడు. ప‌ద‌మూడో కంటెస్టెంట్ గా స‌ర‌యు హౌస్ లోకి వ‌చ్చింది. 14వ కంటెస్టెంట్‌గా విశ్వ ఎంట్రీ ఇచ్చాడు. 15వ కంటెస్టెంట్ గా ఉమాదేవి బిగ్ బాస్ హౌస్‌లోకి వ‌చ్చింది. మానస్‌ 16వ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి 17వ కంటెస్టెంట్‌గా ఆర్జే కాజల్ ఎంట్రీ ఇచ్చారు. 18వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్వేత వర్మ. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి 19వ కంటెస్టెంట్‌గా యాంకర్‌ రవి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories