Bigg Boss 4 Telugu: గంగవ్వా..మజాకా.. ఈ బిగ్ బాస్ లో తనే సంచలనం!

Bigg Boss 4 Telugu: గంగవ్వా..మజాకా.. ఈ బిగ్ బాస్ లో తనే సంచలనం!
x

Gangavva in Bigg Boss 4 Telugu (image courtesy Star Maa)

Highlights

Bigg Boss 4 Telugu: గంగవ్వకు భారీ మద్దతు. సోషల్ మీడియా ఓటింగ్ లో 50 శాతానికి పైగా గంగవ్వకే జై కొడుతున్నాయట!

తెలుగులో బిగ్ బాస్ ఆట మొదలైంది. రెండురోజులు గడిచిపోయాయి కూడా. ప్రారంభమే కదా ఏదో అలా..అలా మొదలవుతుంది అనుకున్నవారికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తున్నాడు బిగ్ బాస్. ఇద్దర్ని మొదటి రోజే సీక్రెట్ రూమ్ లో పెట్టి.. పద్నాలుగు మందిని అసలు హౌస్ లో పెట్టి ఆట మొదలెట్టాడు. ఇక లోపలి వెళ్ళిన వారెవరూ అసలు ఎక్కడా తగ్గకుండా మొదటి రోజే తమ స్ట్రాటజీలు బయటకు తీశారు. సరే పాపం ఏ స్ట్రాటజీలు లేకుండా కూడా కొందరు ఉన్నారనుకోండి. ఈ స్ట్రాటజీలు.. గెంతులు.. ఉబుసుపోని రొట్ట కబుర్లూ ఏమీ చేతకాని స్వచ్చమైన ముత్యం లాంటి అవ్వ ఈసారి బిగ్ బాస్ స్పెషల్ ఎట్రాక్షన్. ఎవరో తెలుసుగా..గంగవ్వ!

అవును పల్లెలో పుట్టి.. అక్కడే పెరిగి.. అక్కడే వ్యవసాయం పనులు చక్కబెట్టుకుని జీవించే గంగమ్మ అవ్వ మై విలేజ్ షో తో పాప్యులర్ అయిపొయింది. ఎంతలా అంటే..ఆమె యూట్యూబ్ వీడియోలకు లక్షల్లో ఫాలోవర్స్.. గంగవ్వ తన వీడియోలతో రికార్డులు సృష్టించింది. ఈసారి ఆమెకు బిగ్ బాస్ లో చోటు కల్పించారు. అసలు బిగ్ బాస్ ఇండియా లో ఇది ఒక ప్రయోగం. గంగవ్వకు చదవనూ...రాయనూ రాదు. కింద కోచోడమే కుదరని పరిస్థితి. చూపూ కాస్త ఇబ్బందే.. కానీ గంగవ్వ సీలబ్రిటీ అంతే. బిగ్ బాస్ అంటేనే తోపులాటలూ.. తన్నులాటలూ.. ఒకరిని కిందకు లాగాలని మరొకరు చేసే వింత ప్రయత్నాలు.. ఏడుపులూ.. ఒకటేమిటి అన్నీ ఉండే హౌస్. మరి అక్కడ గంగవ్వ ఏం చేస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

మొదటిరోజు నామినేషన్లలోనే గంగవ్వను దాదాపుగా హౌస్ లో అందరూ బయటకు పంపేయాలని డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే.. ఆమె ఫాలోయింగ్ ముందు తమ ఆటలు సాగవు అని డైరెక్ట్ గానే చెప్పారు. హౌస్ లో మొదటి రోజే పిల్లగాళ్ళు మొన్ననే కదా వచ్చింది ఉండనీయ్ అంటూ అందరి మనసులూ గెలిచేసింది. ఇక రెండోరోజు కల్యాణిని హౌస్ ని పిచ్చాసుపత్రి లెక్క చేత్తన్నావ్ అంటూ కౌంటర్ వేసి తన డైలాగ్ పవర్ చూపించింది. ఇదిలా ఉంటె మొదటి వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన గంగవ్వకు బయట విపరీతమైన మద్దతు దొరుకుతోంది. బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ ఓటింగ్ జరుగుతుంది. దాని వివరాలు చివరి వరకూ బయటకు రావు. కానీ, బయట చాలా వెబ్ సైట్ లు..చానెళ్ళు.. సోషల్ మీడియాలో జనాలు..నామినేషన్ లో ఉన్నవారికి మద్దతు ఎంత ఉందొ తెలుసుకునే ప్రయత్నాలు గట్టిగానే చేస్తారు. జనం కూడా వీటిలో బాగానే పాల్గొని తమ అభిప్రాయాలను చెబుతుంటారు. ఈ వారం నామినేషన్ లో ఉన్నవారిలో మద్దతు ఎక్కువగా ఎవరికీ దొరుకుతుందో తెలుసా? ఇంకెవరు గంగవ్వకే! అవును ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం వివిధ వర్గాల వారి సర్వేల ప్రకారం గంగవ్వ మిగిలిన వారికంటే చాలా ఎక్కువ మద్దతు పొందుతోంది. దాదాపు 50 శాతం మంది గంగవ్వ హౌస్ లో ఉండాలని కోరుకుంటున్నారు. మిగిలిన వారందరికీ కలిపి 50 శాతం ఓట్లు వస్తున్నాయట. మరి గంగవ్వా..మజాకా!

మొత్తమ్మీద గంగవ్వ హవా చూస్తుంటే బిగ్ బాస్ బయటకు పంపించేయాలనుకున్నా.. బయట జనాలు తమ ఓటింగ్ తో ఆమెను ఎప్పటికప్పుడు రక్షించేలానే కనబడుతున్నారు. ఇటువంటి షో లో గంగవ్వ లాంటి పార్టిసిపెంట్ ఉండాలని బిగ్ బాస్ నిర్వాహకులకు ఎలా ఆలోచన వచ్చిందో కానీ.. అది విజయవంతమైనట్టే. ఏది ఏమైనా గంగవ్వ విషయంలో హౌస్ మేట్స్ తేడా చేశారో వారికి బయట జనాలు గట్టిగానే బుద్ధి చెప్పెట్టు ఉన్నారు. అదీ గంగవ్వ పవర్! అన్నట్టు ఇప్పటివరకూ బయట ఓటింగ్ లలో అతి తక్కువ ఓట్లు వస్తున్నది దివి కి అని తెలుస్తోంది. మరి బిగ్ బాస్ కి వస్తున్నా ఓట్ల పరిస్థితి ఏమిటో..ఎవరిని బయటకు పంపిస్తారో రెండురోజులు ఆగితే తేలుతుంది.

బిగ్ బాస్ లో ఈవారం ఎవరు బయటకు వెళ్లిపోతారని మీరనుకుంటున్నారు..ఇక్కడ మీ అభిప్రాయం చెప్పండి.


Show Full Article
Print Article
Next Story
More Stories