Bigg Boss 4 Telugu: 'గ్లామర్' తో ఈసారి బిగ్ బాస్ హౌస్ 'ఫుల్'!

Bigg Boss 4 Telugu: గ్లామర్ తో ఈసారి బిగ్ బాస్ హౌస్ ఫుల్!
x

Bigg Boss 4 full of glamour (Image courtesy Instagram)

Highlights

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఈసారి గ్లామర్ డోస్ పెరిగింది.

బిగ్ బాస్ అంటేనే మాస్ మసాలా. అక్కడ ఏమాత్రం మొహమాటాలు ఉండవు. ఆట ఆడాలి గెలవాలి అంతే.. ఒక్కసారి హౌస్ లోకి అడుగుపెట్టారా ఇక ఆ హౌస్ మేట్ మదిలో ఉండేది అదొక్కటే. ఒకవేళ ఎవరన్నా కొద్దిగా మొహమాటం..సిగ్గు.. ఇలాంటివి చూపిస్తున్నారని అనుమానం వస్తే బిగ్ బాస్ తన మార్క్ చూపించేస్తాడు. అన్నీ వదిలేసి బరిలోకి దిగిపోయెలా లా చేసేస్తాడు. ఇక బిగ్ బాస్ చూసే ప్రేక్షకుల ధోరణి అదెలా ఉంటుంది. బిగ్ బాస్ ప్రేక్షకులు అంటే యూత్ అని చాలా మంది అనుకుంటారు..వాళ్ళు ఓటింగ్ వేస్తారేమో కానీ నిజానికి ఎక్కువగా వదలకుండా చూసేది ఇంటింటి మహారాణులే. వాళ్ళు కూడా ప్రతిరోజూ బిగ్ బాస్ ఇంట్లో ఏం జరుగుతోంది..ఎవరు ఎలా ఉంటున్నారు ఓ కన్నేసే ఉంచుతారు. అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు కూడా కచ్చితంగా అందరి ఎమోషనల్ స్టోరీస్ ని బయటకు తీసి వదులుతుంటారు.

సరే ఈ ఎమోషన్లు పక్కన పెడితే..హౌస్ లో గ్లామర్ షో కూడా ఎక్కువే ఉంటుంది. ఇంతవరకూ మూడు సీజన్లలోనూ ఒకరో ఇద్దరో దాని కోసం ఉండేవారు. కానీ, ఈసారి సీన్ అంతా గ్లామర్ చుట్టూనే తిరుగబోతున్నట్టుగా కనిపిస్తోంది. కరోనా కాలం.. యూత్ అంతా ఇంటికే పరిమితమైన పరిస్థితి ఉండడంతో ఈసారి బిగ్ బాస్ అంతా యూత్ కి కనెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోన్నట్టు కనిపిస్తోంది. ఫుల్ గ్లామర్ అద్దేశారు బిగ్ బాస్ హౌస్ కి. ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ కి హాట్ లుక్ ఇచ్చేశారు.

మొత్తం హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 16 మందిలో 9 మంది లేదీసే. వారిలో నలుగురు ఫుల్ ఆఫ్ గ్లామర్ బొమ్మలు. పైగా సోషల్ మీడియాలో వీరిలో ముగ్గురు బాగా పాప్యులర్. కచ్చితంగా వీరు నలుగురు బిగ్ బాస్ హౌస్ ను హాట్ హాట్ గా ఉంచుతారని అనిపిస్తోంది. వాళ్ళెవరో మీకు ఈపాటికి అర్థం అయి ఉంటుంది. సరే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ నలుగురి గురించే చర్చ..వీళ్ళు హౌస్ లో ఇరగాదీసేస్తారని అనుకుంటున్నారు. వాళ్లెవరో మీరూ చూడండి..వాళ్ళ సోషల్ మీడియాలో ఫోటోలు చూడండి మీరూ కచ్చితంగా అబ్బో ఈ గ్లామర్ భలే హాటు గురూ..అని!

దేత్తడి హారిక: యూ ట్యూబ్ లో ఈమె మోత మోగిస్తోంది. ఫుల్ మాస్ ఫాలోయింగ్ ఉన్న పిల్ల. అందంతో పాటూ గ్లామరస్ గా కనిపించడానికి ఏమాత్రం వెనుకాడదు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చేతప్పుడే అంత హాట్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ!


దివి: సినీనటి.. తెలుగులో మహర్షి లో కూడా చేసింది. ఈ అందాల భరిణ ఈసారి బిగ్ బాస్ కి స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యే అవకాశాలున్నాయి.


అరియానా గ్లోరీ : టిక్ టాక్ స్టార్ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఈ గ్లామర్ బొమ్మకు. యాంకర్ గా కూడా టీవీ ప్రేక్షకులకు బాగా పరిచయం. ఆ మధ్య యూ ట్యూబ్ కోసం ఆర్జీవీని ఇంటర్వ్యూ చేస్తే ఈమెను ఎదో అన్నారని సోషల్ మీడియా హోరెత్తింది. గ్లామరస్ గా కనిపిస్తూ హౌస్ లో మిగిలిన అమ్మాయిలకు గట్టిపోటీ ఇవ్వగలదు.


మోనాల్ గజ్జల్ : సుడిగాడు సినిమాలో హీరోయిన్ గా చేసిన గుజరాతీ భామ. ఈ అమ్మాయీ ఎక్కడా తగ్గకుండా గ్లామర్ షో చేసే అవకాశాలున్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories