Top
logo

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ హంగామా మొదలైంది! ఇక రోజూ రచ్చ రచ్చే! హౌస్ లో ఉన్నది వీళ్ళే!

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ హంగామా మొదలైంది! ఇక రోజూ రచ్చ రచ్చే! హౌస్ లో ఉన్నది వీళ్ళే!
X

Bigg Boss 4 Telugu Image curtesy Star Maa

Highlights

Bigg Boss 4 : బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు సందడి మొదలైంది మొత్తం 16 మంది హౌస్ మేట్స్ ని నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో పెట్టేసి లాక్ చేసేశారు. ఇక వినోదాల మాస్క్ తీసుకుని చూడడమే మన పని!

ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న బిగ్ బాస్ నాలుగో సీజన్ హంగామా ప్రారంభం అయింది. నాగార్జున హోస్ట్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. గ్రాండ్ గా రావడమే కాదు..వస్తూనే బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. డబుల్ ధమాకా.. అనిపించేలా ఒక పక్క కుర్ర నాగార్జున అందరినీ స్టేజ్ మీదకు పిలుస్తుంటే.. మరోపక్క ముసలి నాగార్జున టీవీ ముందు కుర్చుని కామెంట్లు పాస్ చేస్తూ కనిపించారు..

ఇక వరుసగా నలుగురు హౌస్ మేట్స్ ని పిలిచిన నాగార్జున వారిని పరిచయం చేసి హౌస్ లోకి ఒక్కొరుగా పంపించారు, తొలి హౌస్మేట్‌గా హీరోయిన్ మోనాల్ గజ్జర్, రెండో హౌస్ మెట్ గా దర్శకుడు సూర్య కిరణ్, మూడో కంటె స్టంట్ గా ప్రముఖ యాంకర్ లయ, నాలుగో కంటెస్టంట్ గా నటుడు అభిజిత్ హౌస్ లోకి అడుగుపెట్టారు.

ఆట మొదలెట్టారు...

అవును ఇంతకు ముందు బిగ్ బాస్ సీజన్ లలో అందర్నీ హౌస్ లోకి పంపించిన తరువాత బిగ్ బాస్ ఆట మొదలయ్యేది. అయితే.. ఈసారి మాత్రం నలుగురు హౌస్ మేట్స్ ని లోపలికి పంపిన వెంటనే నాగార్జున ఆట మొదలెట్టేశారు. 'కనెక్టింగ్ గేమ్' అంటూ ఒక వీల్ పై నాలుగేసి లక్షణాలతో ఉన్న నెంబర్లు ఉంచి వాటిలో వారికి సూటయ్యే లక్షణాలను సెలక్ట్ చేసుకోమన్నారు. తరువాత ఆ నెంబర్లకు సంబంధించి బాక్స్ లు తీసుకోమన్నారు.

తరువాత నుంచి వచ్చిన ఒక్కో హౌస్ మెట్ కి నాగార్జున గిఫ్ట్ బాక్స్ అంటూ ఒక బాక్స్ ఇచ్చి లోపలి పంపించారు. ఈ బాక్స్ లో ఉన్న నెంబర్..లోపల ఉన్నవారి నెంబర్ తో మ్యాచ్ అయిన వారితో వీరు కనెక్ట్ అవుతారని చెప్పారు.

కనెక్షన్ లు మొదలెట్టేశారు..

బిగ్ బాస్ ప్రారంభం రోజునే కొత్త లింకులు పెట్టడం ప్రారంభించారు నాగార్జున. అభిజిత్ తో మాట్లాడిన నాగ్.. హౌస్ లో ఎవరైనా నీకు కనెక్ట్ కావచ్చంటూ..హింట్ ఇచ్చి మరీ పంపించారు. ఇక హారిక వచ్చినపుడు నీకు పులిహోర కలపడం వచ్చా అంటూ లోపలి వేలుతున్నావుగా ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అని చెప్పారు. ఇక ప్రత్యేకంగా ఇద్దరినీ వేరే చోట పెట్టి మీరు దెబ్బలాడుకోకండి అంటూ చెప్పి..హౌస్ లో మీకు చాలా ఎడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పారు.

మొత్తం 16 మందిని హౌస్ లోకి పంపించిన నాగార్జున వారిలో ఇద్దరినీ మాత్రం ప్రత్యేకంగా ఉంచారు. 14 మందితో హౌస్ లో హంగామా ప్రారంభం అయింది.

అప్పుడే ఎలిమినేషన్...

రేపటి నుంచే ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుందని ప్రోమో చెబుతోంది. మరి బిగ్ బాస్ అంటేనే మెలికల వ్యవహారం కదా.. మరి ఇది నిజమా కాదా చూడాలంటే రేపటి దాకా ఆగాల్సిందే.

ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎవరెవరు ఉన్నారో వారి వివరాలు సంక్షిప్తంగా ఒకసారి మీకోసం..

గంగవ్వ.. 16వ కంటెస్టెంట్‌గా యూట్యూబ్‌ స్టార్‌ గంగవ్వ

అఖిల్‌.. 15వ కంటెస్టెంట్‌గా నటుడు అఖిల్‌ ఎంటరయ్యాడు.

దివి.. 14వ కంటెస్టెంట్‌గా దివి వచ్చేసింది.

నోయల్‌.. 13వ కంటెస్టెంట్‌గా సింగర్‌ నోయల్‌ వచ్చాడు.

కరాటే కల్యాణి.. 12 వ కంటెస్టెంట్‌గా కరాటే కల్యాణి ఎంట్రీ ఇచ్చింది.

అమ్మ రాజశేఖర్‌.. 11వ కంటెస్టెంట్స్‌గా డైరెక్టర్‌ అమ్మ రాజశేఖర్‌ ఎంట్రీ ఇచ్చాడు.

సయ్యద్ సోహైల్.. తొమ్మిదో కంటెస్టెంట్‌గా టీవీ నటుడు సయ్యద్ సోహైల్ వచ్చాడు.

అరియానా గ్లోరీ.. పదో కంటెస్టెంట్‌గా యాంకర్‌ అరియానా గ్లోరీ వచ్చింది. జెమిని కెవ్వు కామెడీ యాంకర్‌గా అరియానా ఫేమస్‌.

దేత్తడి హారిక .. ఎనిమిదో కంటెస్టెంట్స్‌గా యూట్యూబ్‌ స్టార్‌ దేత్తడి హారిక ఎంట్రీ ఇచ్చింది. హారికకు నెటిజన్స్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది.

దేవి నాగవల్లి.. ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ జర్నలిస్ట్‌. ఇటు యాంకరింగ్‌లోనూ, అటు రిపోర్టింగ్‌లోనూ దిట్ట.

మెహబూబ్‌ దిల్‌సే.. ఆరో కంటెస్టెంట్స్‌గా టిక్ టాక్ షార్ట్ ఫిల్మ్ స్టార్ మెహబూబా దిల్‌ సే ఎంట్రీ ఇచ్చారు.

జోర్దార్ సుజాత.. ఐదో కంటెస్టెంట్స్‌గా HMTV యాంకర్‌ జోర్దార్ సుజాత వచ్చేసింది. రెండు తెలుగు న్యూస్‌ ఛానల్స్‌లో యాంకర్‌గా పనిచేసిన సూజాత కూడా ఒక కంటెస్టెంట్‌. తెలంగాణ యాసతో పాపులర్‌ అయిన న్యూస్‌ యాంకర్స్‌లో సుజాత ఒకరు.

అభిజిత్‌.. బిగ్‌బాస్‌ నాలుగో కంటెస్టెంట్స్‌గా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు లైఫ్‌ ఈజ్‌ బ్యూటీవుల్‌ హీరో అభిజిత్‌.

యాంకర్‌ లాస్య.. వివాహం అయిన తర్వాత టీవీకి దూరమైయ్యారు. ఇప్పుడు బిగ్‌బాస్‌ 4తో మళ్లీ రిఎంట్రీ ఇవ్వబోతున్నారు.

సూర్యకిరణ్.. రెండో కంటెస్టెంట్‌గా డైరెక్టర్‌ సూర్యకిరణ్‌ ఎంట్రీ ఇచ్చారు.

మోనల్‌ గజ్జర్.. సుడిగాడు సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన గుజరాతీ భామ మోనల్‌ గజ్జర్‌.

Web TitleBigg Boss 4 telugu grand opening of bigg boss telugu season 4 Nagarjuna mark entertainment
Next Story