Bigg Boss 4 Telugu: నాకూ ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా..కరాటే కల్యాణి కొత్త రచ్చ!

Bigg Boss 4 Telugu: నాకూ ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా..కరాటే కల్యాణి కొత్త రచ్చ!
x
Highlights

Bigg Boss 4 Telugu: కల్యాణి కొత్తరచ్చ..మోనాల్ ఏడుపు కంటిన్యూ..కట్టప్ప ఎవరంటూ పోల్..వెళ్లి గొడవపడండి అంటూ రెచ్చగొట్టిన బిగ్ బాస్..ఇదీ రెండో రోజు బిగ్ బాస్ స్టోరీ..

కొంతమంది ఎక్కడ అవకాశం దొరుకుతుందా ఎమోషన్ పండించేద్దామని చూస్తుంటారు.. బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ గుజ్జర్ లా! మరికొంత మంది ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ రచ్చ చేద్దాం అని ప్రయత్నిస్తారు అదే హౌస్ లోని కల్యాణి లా.. కొంతమంది పాపం ఎరక్కపోయి అని ఇరుక్కుపోతారు అభిజిత్ లా.. కొందరు తమకు దొరికిన అవకాశాన్ని ఘనకార్యంలా ఫీల్ అవుతారు అరియానా గ్లోరీ లా.. ఏది ఏమైనా తమ పని తాము చేసుకుపోతుంటారు గంగవ్వలా! ఎవరెలా ఉన్నా ఎక్కడ ఫిటింగ్ పెట్టాలో బాగా తెలుసు బిగ్ బాస్ కి. అందరి తోనూ ఆడుకోవడానికే కదా..

బిగ్ బాస్ హౌస్ లో రెండోరోజు మాంచి పాటతో ప్రారంభమైంది.

టీచర్ అవతారమెత్తిన కరాటే కళ్యాణి హౌస్‌మేట్స్ అందరికీ పాఠాలు చెప్పింది. బిగ్ బాస్ ఆమెకు ఇంటి నియమాలు ఆ విధంగా చెప్పాలనే టాస్క్ ఇచ్చారు. ఇక ఆమెను ఓ ఆట ఆడుకుంది గంగావ్వ. టాస్క్‌లో భాగంగా.. అవ్వ నువ్వు 50ఏళ్ల నుంచి ఇదే స్కూల్‌లో ఉంటున్నావ్ కదా అని కళ్యాణి గంగవ్వను కామెంట్ చేయడంతో వెంటనే హౌస్‌మేట్స్ అంతా అవ్వ ఇన్నేళ్ల నుంచి ఫెయిల్ అవుతున్నావా? అంటూ ఆమెను టీజ్ చేశారు. దీంతో గంగావ్వ తన స్టైల్ లో కల్యాణి గాలి తీసేసింది. అసలే మాటల తూటాలు పేలుస్తుంది కదా. ''జీతం జీతమే తీసుకుంటున్నావ్.. ఇట్లనే అందరినీ ఫెయిల్ చేస్తున్నావ్. పిచ్చాసుపత్రి లెక్క చేత్తానవ్ అంటూ కౌంటర్ వేసింది.''

ఇక సీక్రెట్ రూమ్ లో ఉన్న సోహైల్, అరియానా గ్లోరీ లు తమకు ఫుడ్ కావాలా అని అడగలేదు అంటూ బిగ్ బాస్ హౌస్ కి ఫోన్ చేసి అడిగారు. అరియానా చేసిన ఫోన్ లిఫ్ట్ చేసిన అఖిల్ రకరకాలుగా ఆమెను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా అమె వినలేదు. దీంతో నోయల్ ఫోన్ తీసుకుని అరియానాకు ఫుడ్ ఇవ్వం ఏమి చేస్తావ్ అని గట్టిగా అడిగి కట్ చేశారు. దీంతో ఇద్దరూ ఫుడ్ లేక మాడిపోయారు. బిగ్ బాస్ వారికి ఇక మీ ఆట మొదలెట్టే టైం వచ్చింది అని చెప్పాడు. మీకు ఫుడ్ లేకుండా మాడ్చారు కదా వెళ్లి హౌస్ లో అడిగి కడిగేయండి అని రెచ్చగొట్టి పంపించాడు.

ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా రాజశేఖర్ మాస్టర్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. దేవి సంచాలకులుగా వ్యవహరించారు. మిగిలిన పన్నెండు మందీ ఆరు గ్రూపులుగా టాస్క్ లో పాల్గొన్నారు. టాస్క్ లో భాగంగా 'చిత్రం ఎవరిది' లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో 14 వేలకు గాను ఐదువేల పాయింట్లు వచ్చాయి.

కల్యాణి అందం రచ్చ..

అభిజిత్ ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు కల్యాణి దగ్గర. మీరు గంగవ్వలా కాని చీర కట్టుకోకండి చూడలేక చస్తాం అని సరదాగా అనడంతో కరాటే కల్యానికి ఈరోజుకు సరిపడా స్టఫ్ దొరికింది. ''నేను మరీ అంత చచ్చిపోయేలా ఉండను.. నేను చచ్చిపోయేలా ఉండను.. నాకూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. మీరు హీరో అయితే అయి ఉండవచ్చు. నేను అంత దరిద్రంగా ఉన్నానా.. ఆ మాట అనకూడదు కదా.. ఫీల్ అయ్యాను. మీ మనసులో నా గురించి ఏదో రన్ అవుతుంది.. నన్ను అబ్జర్వ్ చేస్తున్నావ్'' అంటూ అభిజిత్ సరదా తీరేలా వాయించి రచ్చ చేసింది. సరదాగా అన్నాను బాబోయ్ అని అభిజిత్ చెప్పినా ఆమె వినలేదు. చాల సేపు ఈ రచ్చ నడుస్తూనే ఉంది. అభిజిత్ కి కల్యాణి కన్బదినప్పుడల్లా క్లాస్ పీకింది.

మోనాల్ ఏడుపు..

ఇక ఏడుపు తో గడిపెడ్డామనుకునే వారు బిగ్ బాస్ లో ఒకరు ఎప్పుడూ ఉంటారు. ఈసారి ఆవంతు మోనాల్ ది. చికెన్ వండుతుంటే వాసన వస్తోంది అది భరించలేక పోతున్నాను అంటూ భోరు భోరునా ఏడుపు అందుకుంది మోనాల్. మిగిలిన వారు ఆమెను ఊరుకో పెట్టడానికి తిప్పలు పడ్డారు.

కట్టప్ప ఎవరు?

ఇంట్లో కట్టప్ప ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన బిగ్ బాస్..మీలో కట్టప్ప ఎవరనుకుంటున్నారు అంటూ బ్యాలెట్ పెట్టాడు. లాస్య, అఖిల్, సూర్యకిరణ్ పేర్లు ఎక్కువమంది రాశారు.

మొత్తమ్మీద బిగ్ బాస్ హౌస్ రెండో రోజు అన్ని ఎమోషన్స్ పంచింది. చివరకు యాక్షన్ సన్నివేశం వద్ద ఆగిపోయింది. యాక్షన్ ఏమిటని అనుకుంటున్నారా? సీక్రీట్ రూమ్ లోంచి బిగ్ బాస్ రెచ్చగొట్టి పంపిన అరియానా..సోహైల్ హౌస్ లోకి అడుగుపెట్టారు..పట్టడమే గొడవకి దిగినట్టు కనిపిస్తోంది. మరి ఏం జరగనుందో రేపు తెలుస్తుంది.

ఈవారం బిగ్ బాస్ నుంచి ఎవరు బయటకు వెళతారని అనుకుంటున్నారో మీ అభిప్రాయం చెప్పండి!



Show Full Article
Print Article
Next Story
More Stories