Bigg Boss 4 Telugu: అమ్మ..రాజశేఖరా..పులిహోర బాగానే కలుపుతున్నావుగా!

Bigg Boss 4 Telugu: అమ్మ..రాజశేఖరా..పులిహోర బాగానే కలుపుతున్నావుగా!
x
Bigg Boss 4 Telugu episode 6 promo (image: Star Maa promo screen shots)
Highlights

Bigg Boss 4 telugu : నాలుగు రోజుల నుంచి మౌనంగా ఉన్న దివి ఇప్పడు హౌస్ లో ఎక్కువ హడావుడి చేస్తోంది.

బిగ్ బాస్ ఐదు ఎపిసోడ్ లు పూర్తి అయిపోయాయి. మొదటి ఎపిసోడ్ పరిచయ కార్యక్రమాలు..నాగార్జున హంగామా ఆదరగోట్టేసింది. ఇక తరువాత ఎపిసోడ్ లు వినోదానికి తక్కువ..సాగదీతకు ఎక్కువ అన్నట్టు సాగాయి. హౌస్ లో ప్రారంభం నుంచీ ఇప్పటివరకూ అందర్నీ ఆకట్టుకున్న పార్టిసిపెంట్ ఎవరన్న ఉన్నారు అంటే అది ఒక్క గంగవ్వే! ఆమె ఒక్కరి కోసమే చాలా మంది ప్రేక్షకులు బిగ్ బాస్ చూస్తున్నారనిపిస్తోంది అంటే అది అతిశయోక్తి కాబోదు. ఇంకా ప్రారంభ ఎపిసోడ్ లె కదా అనుకుందామన్నా సరే.. అసలే కరోనా కాలంలో వినోదం కోసం వెంపర్లాడుతున్న ఇంటిల్లపాదినీ కదలకుండా కూచోపెట్ట గలిగే కంటెంట్ ఇప్పటివరకూ రాలేదనే చెప్పాలి. గంగవ్వ ఇచ్చే వినోదం ఎన్నాళ్ళు నడుస్తుంది.. ఇక బిగ్ బాస్ లెక్కలు మారుస్తున్నాడు. అవును అది నిన్నటి నుంచే కొద్దిగా కనిపించింది.

మూడురోజులుగా నిశ్శబ్దంగా ఉన్న దివి ని ఒక్కసారిగా పైకి లేపాడు బిగ్ బాస్. అసలు దివి అలా మాట్లాడగలదా అనిపించే రేంజిలో ఆమె నిన్నటి ఎపిసోడ్ లో టాస్క్ ఆదరగొట్టేసింది. హౌస్ లో ఉన్న అందరి గురించి మాట్లాడమని చెప్పిన బిగ్ బాస్ టాస్క్ కి అదిరిపోయే రేంజ్ లో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది దివి. ఎవ్వరూ నొచ్చుకోకుండా.. నొచ్చుకున్నా బయటపడలేని విధంగా మొత్తం పార్టిసిపెంట్స్ అందరినీ ఓ ఆట ఆడేసింది. దివి గురించి ప్రేక్షకులకు చాలా అంటే చాలా తక్కువ తెలుసు. అందులోనూ మొదటి మూడురోజులూ అసలు ఉందా లేదా అన్నట్టు ఉండిపోయిన ఆమె మీద ఎవరికీ అంచనాలు లేవు. కానీ ఒక్క ఎపిసోడ్ లో ఆ పరిస్థితి మారిపోయింది. బిగ్ బాస్ అంటేనే అది కదా.. ఎప్పుడు ఎవర్ని పైకి లేపుతాడో..ఎవరిని కింద పాడేస్తాడో తెలియని వినోదం.

నిన్నటి ఎపిసోడ్ లో దివి వేసిన పంచ్ లు కొన్ని..సూర్య కిరణ్ గారు నా మాటే వినాలి అని కాస్త తగ్గించుకుంటే మంచిది.. మోనాల్ మీరు ఏదైనా విషయం వస్తే ఊరికే ఏడ్చేస్తున్నారు.. మీరు నిజంగా బాధ కలిగి ఏడ్చినా అప్పుడు ఎవరూ పట్టించుకోరు.. లాస్య సెన్సిటివ్ ఇలా మొహమాటం లేకుండా చెప్పేసింది. దాదాపుగా ఆమె బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఉన్న అభిప్రాయాలనే చెప్పినట్టు కనిపించింది.

ఇక అసలు విషయానికి వస్తే..ఈరోజు ఎపిసోడ్ కూడా దివి చుట్టూ తిరిగేట్టు ఉంది. అన్నట్టు నిన్న దివి అమ్మ రాజశేఖర్ పెర్ఫెక్ట్ అని ఓ కితాబు ఇచ్చింది. దానికి కొనసాగింపు ఈరోజు చూడొచ్చని తాజా ప్రోమో చూస్తె అనిపిస్తోంది. అమ్మ రాజశేఖర్ దివితో పులిహోర కలిపేస్తున్నారు. అవును.. కిచెన్ లో ఉన్న అమ్మరాజశేఖర్ తన ఎదురుగా ఉన్న సూర్య కిరణ్ తో దివి మంచి క్యారెక్టర్ అని కితాబు ఇచ్చాడు. దీంతో ముసిముసిగా నవ్వుతూ దివి వెళ్లి కిచెన్ లో జాయిన్ అయింది. అటు తరువాత అందంగా ఉంది.. అని అంటూ మనం ఇద్దరం బిగ్ బాస్ లో ఉన్నాం కదా నేను హీరో..నువ్వు హీరోయిన్ అని దివితో అంటూ పులిహోర కలిపాడు. దానికి దివి నాకు నిజంగా వంట చేసే అబ్బాయిలు అంటేనే ఇష్టం అని తాలింపు వేసింది. ఆ ఘాటుకి సూర్యకిరణ్ పడి పడి నవ్వ్వాడు. మొత్తమ్మీద బిగ్ బాస్ ఎదో చేస్తున్నట్టే కనిపిస్తోంది. అన్నట్టు పులిహోర కలిపే హడావుడిలో కూరలో టీపొడి వేశేశాడు రాజశేఖర్.

మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ ప్రోమో అదిరిందనే చెప్పాలి. మరి అసలు ఎపిసోడ్ ఎలా ఉండబోతోందో రాత్రి చూసేద్దాం..

ఈవారం ఎలిమినేషన్ లో ఉన్న వారిలో ఎవరు బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు?

Show Full Article
Print Article
Next Story
More Stories