Bigg Boss 4 Telugu Episode 5: హమ్మయ్య..దివి మాట్లాడింది! గంగవ్వ మాటల మతాబులు బిగ్ బాస్ ను నిలబెడుతున్నాయి!!

Bigg Boss 4 Telugu Episode 5: హమ్మయ్య..దివి మాట్లాడింది! గంగవ్వ మాటల మతాబులు బిగ్ బాస్ ను నిలబెడుతున్నాయి!!
x
Highlights

Bigg Boss 4 Episode 5 : మళ్ళీ కట్టప్ప గోలే.. దివి మాట్లాడింది..లాస్య అలిగింది.. గంగవ్వ అందరినీ ఓ ఆట ఆడించింది.

నీరసంగా కొనసాగుతున్న బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ లో కొంత వినోదం పండింది. అదీ ఇన్నాళ్ళూ సైలెంట్ గా ఉన్న దివి ఒకవైపు.. హౌస్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉన్న గంగావ్వ ఒకవైపు వినోదాన్ని అందించారు. బిగ్ బాస్ దివికి టాస్క్ ఇచ్చారు. ఇంటి సభ్యులందరి గురించి తన అభిప్రాయం చెప్పమన్నాడు. దీంతో దివి అందరి గురించీ మొహమాటం లేకుండా నిక్కచ్చిగా చెప్పి సభ్యులందరికీ షాక్ ఇచ్చింది. అఖిల్ తో మొదలు పెట్టిన దివి తన పధ్ధతి మార్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పింది. తరువాత గంగవ్వ ను అవ్వా నువ్వు నీ స్థాయికి తగ్గట్టుగా ఉన్నావు. కానీ, ఎవరన్నా ఏడిస్తే నువ్వు కూడా ఏడుస్తున్నావు అంటూ చెప్పింది. దానికి గంగావ్వ..వాళ్ళు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఎదవద్దని అంటావు అంటూ వేసుకుంది. ఇలా అందరి గురించి కుండబద్దలు కొట్టిన దివి లాస్యను నువ్వు చాలా సెన్సిటివ్ అంది. దీనికి లాస్య నొచ్చుకుని..నేనేం సెన్సిటివ్ కాదంటూ తరువాత కూడా మిగిలిన వాళ్ళ దగ్గర మాట్లాడింది.

కట్టప్ప ఎవరు? ఆగని గోల!

ఈ ప్రశ్నకు సమాధానం రాలేదు కానీ.. ఈ ప్రశ్న తో ఈరోజు మరింత సీన్ లాగించారు. సోహైల్, అరియానా జంటను కన్ఫెషన్ రూమ్ కి పిలిచి హౌస్ మేట్స్ కట్టప్ప ఎవరని అనుకుంతున్నారో ఒక్కోరినీ పిలిచి తెలుసుకోవాలని టాస్క్ ఇచ్చాడు. వారిద్దరూ వచ్చి విషయం అందరికీ చెప్పారు. దాంతో పెద్ద చర్చ రాద్ధాంతం జరిగింది. అసలు ఎందుకు చెప్పాలని ఒకరు.. బిగ్ బాస్ మనకే చెప్పొచ్చుకదా..సోహైల్ చెబితే మనమెందుకు నమ్మాలి అని కొదరు తర్జన భర్జన పడి చివరకు ఒక్కోరూ వెళ్లి తమ అభిప్రాయం చెప్పారు.

ఇక కట్టప్ప ఎవరనే విషయంలో హౌస్ లో అందరి మధ్య మంచి చర్చ జరిగింది. అందులో గంగవ్వ ఒక్కో కంటెస్టెంట్ గురించి చెప్పింది. అందరూ ఆమె మాటలను ఎంజాయ్ చేశారు. సూర్యకిరణ్ ను నువ్వు బూచోడివి అనడంతో అందరూ హాయిగా నవ్వేశారు. గంగావ్వ లేకపోతె బిగ్ బాస్ మరింత నీరసంగా సాగేది అనడంలో సందేహం లేదు. దేవీ నాగావల్లిని దేవక్కా అని పిలిచి గంగవ్వ ఫన్ క్రియేట్ చేసింది.

టమాటా పల్ప్ టాస్క్..

బిగ్ బాస్ హౌస్ లో మొదటి ఫిజికల్ టాస్క్ ఈరోజు ఇచ్చాడు బిగ్ బాస్. టాస్క్ లో భాగంగా 4 టీములు ఏర్పాటు చేశాడు. ఒక్కో టీములో ముగ్గురు చొప్పున ఉండేలా ఏర్పాటు చేశాడు. సోహైల్, అరియానా క్వాలిటీ చెక్ అధికారులుగా, గంగవ్వ వారికి సహాయకురాలిగా, సూర్యకిరణ్ సంచాలకుడిగా నియమించాడు బిగ్ బాస్. కనేవేయర్ బెల్ట్ పై వచ్చిన టమాటాలు, సీసాలు, మూతలు తీసుకుని.. టమాటా లను చేతులతో పల్పీ గా చేసి బాటిళ్ళలో నింపాలి. అదీ టాస్క్.. ఏ టీం ఎక్కువ సీశాలు నింపితే వారు గెలిచినట్టు. ఈ ఎపిసోడ్ లో టాస్క్ కొనసాగుతోంది.

మొత్తమ్మీద 5వ ఎపిసోడ్ గత ఎపిసోడ్ తో పోలిస్తే కొద్దిగా ఫరవాలేదనిపించింది. నిజానికి ఇది కూడా బిగ్ బాస్ రేంజి ఎంటర్టైన్మెంట్ అయితే కాదు. గంగవ్వ లేకపోతే ఈమాత్రం వినోదమూ దొరకకపోవును అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. దానిలో తప్పేమీ లేదు.

ఈవారం బిగ్ బాస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు..మీ అభిప్రాయం చెప్పండి


Show Full Article
Print Article
Next Story
More Stories