Bigg Boss 4 Telugu: గుంజీళ్ళు తీయించిన బిగ్ బాస్.. నాకు సారీ చెప్పాల్సిందే..నోయల్ రెచ్చిపోయాడు!

Bigg Boss 4 Telugu: గుంజీళ్ళు తీయించిన బిగ్ బాస్.. నాకు సారీ చెప్పాల్సిందే..నోయల్ రెచ్చిపోయాడు!
x

Bigg Boss 4 Telugu Episode 13 highlights

Highlights

Bigg Boss 4 : ముక్కోణం కొనసాగుతోంది..బిగ్ బాస్ కు కోపం వచ్చింది.. నోయల్ కు సహనం చచ్చింది.. అలా నడిచింది బిగ్ బాస్ 13 వ ఎపిసోడ్!

బిగ్ బాస్ స్కూలు మాస్టారులా తయారయ్యాడు. క్రమశిక్షణ నేర్పించాడు హౌస్ మేట్స్ అందరికీ. అభిజిత్..మోనాల్ లోకాన్ని మర్చిపోయి పక్కకు జరిగి మాట్లాడుకున్నారు. అసలు ఈ ముక్కోణపు పులిహోర ఏమిటో బిగ్ బాస్ కైనా అర్ధం అవుతోందా అనే అనుమానం ప్రేక్షకులకు కలిగింది. బీబీ స్కిట్ లు అందరి మధ్యలో చిన్న చిచ్చుపెట్టాయి. నోయల్ బిగ్ బాస్ సారీ చెప్పాల్సిందే అని చాలెంజ్ చేసి.. హౌస్ కెప్టెన్ అయిపోయాడు. గంగవ్వ ఆరోగ్యం ఇంకా కుదుట పడినట్టు లేదు. ఇవీ బిగ్ బాస్ 13వ ఎపిసోడ్ హైలైట్స్..

బీబీ టీవీ స్కిట్ లు అలా..అలా..

కుమార్ సాయి సారధ్యంలో ఓ అమ్మ రాజశేఖర్, దేవి, దివి, దేత్తడి హారిక స్కిట్ వేశారు. గందరగోళం పేరుతో..దేవి జోకులతో..గందరగోళమైన స్కిట్ చేశారు. తరువాత ముక్కు అవినాష్ సారధ్యంలో కల్యాణి, అఖిల్, మోనాల్, సుజాత బకరా స్కిట్ చేశారు. రెండు స్కిట్లూ మరీ అంత ఆకట్టుకునేలా లేవు. ఇక ఎవరి స్కిట్ బావుంది అనే విషయం పెద్ద దుమారం లేపింది హౌస్లో అందరూ రెండు స్కిట్లకు సమానంగా ఓట్లేశారు. దాంతో గంగవ్వని నోయల్ ఎవరి స్కిట్ బావుంది అని అడిగాడు. ఆమె రెండో స్కిట్ అంటే బకరా బావుంది అని చెప్పింది. దీంతో ఆ స్కిట్ కి పాయింట్లు ఇస్తున్నట్టు ప్రకటించారు.. దీంతో అమ్మ రాజశేఖర్ అది సరికాదు అంటూ కోపగించుకున్నాడు. ఈ గోల కొద్దిసేపు జరిగింది. మొత్తమ్మీద అందరూ రెన్సు స్కిట్లు బావున్నాయి అనుకుంటూ సర్దుకున్నారు.

క్రమశిక్షణ తప్పారు!

ఇంతలో బిగ్ బాస్ క్రమశిక్షణ తప్పారు అంటూ బిగ్ బాస్ అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. తెలుగులో మాట్లాడాటం లేదనీ.. అందరూ సైరన్ మోగినప్పుడు వెంటనే రెస్పాండ్ కావడం లేదనీ,,, అదేవిధంగా మైక్ లు సరిగ్గా ధరించాడంలేదనీ అందరికీ చెప్పి వాళ్లకు పనిష్మెంట్ లు ఇచ్చాడు. గుంజీలు తీయించాడు. తెలుగులోనే మాట్లాడతాం అని ఇంపోజిషన్ రాయించాడు. సుజాత దగ్గర తెలుగు నేర్చుకోమని అందరికీ చెప్పాడు. నోయల్ ఇంపోజిషన్ రాస్తూ అందరికీ సరదా తీరుస్తాన్. అందరూ నాకు సారీ చెప్పాల్సిందే. బిగ్ బాస్ కూడా నాకు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ గట్టిగా మాట్లాడాడు. తరువాత అందరూ బిగ్ బాస్ శిక్షలను అనుభవించారు.

కెప్టెన్ గా నోయల్..

హౌస్ లో రెండో కెప్టెన్ ఎన్నుకోవాల్సిందిగా బిగ్ బాస్ చెప్పాడు. అందరూ కలిసి నలుగురిని ఎన్నుకున్న తరువాత వారిలో చివరికి నోయల్ ను ఎన్నిక చేసుకున్నారు.

ఇక ఈ ఎపిసోడ్ హైలైట్ అంటే..కరాటే కల్యాణి పాడిన పాట. చుక్కలు తెమ్మన్నా తెన్చుకురానా అంటూ ఆమె పాడిన పాటకి హౌస్ అంతా చప్పట్లు కొడుతూ మోత మోగించారు. ఇక అసలు చెత్త అంటే అఖిల్..మోనాల్..అభిజిత్ మధ్యలో నడుస్తున్న సంభాషణలే అని చెప్పవచ్చు. మొత్తమ్మీద అందరినీ బోరు కొట్టిస్తున్న ఈ సన్నివేశాలు ఎప్పుడు ఆగిపోతాయో. ఇక గంగవ్వ ఆరోగ్యం ఇంకా కుదుటపడి నట్లు లేదు. మరి రేపు వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున వస్తారు ఏమి చేస్తారో?

బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎవరు బయటకు వెళ్లిపోతారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి.


Show Full Article
Print Article
Next Story
More Stories