దుమ్మురేపుతోన్న బిగ్ బాస్ 4...టీఆర్పీలో కొత్త రికార్డులు!

దుమ్మురేపుతోన్న బిగ్ బాస్ 4...టీఆర్పీలో కొత్త రికార్డులు!
x

Akkineni Nagarjuna’s Bigg Boss Telugu 4 

Highlights

Bigg Boss 4 Telugu : కరోనా వలన ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 4 ఉంటుందా లేదా అని చాలా మందిలో సందేహం మొదలయింది.. అయితే

Bigg Boss 4 Telugu : కరోనా వలన ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 4 ఉంటుందా లేదా అని చాలా మందిలో సందేహం మొదలయింది.. అయితే అనుమానాలకు బ్రేక్ వేస్తూ రెండు వారాల కింద సీజన్ 4 చాలా గ్రాండ్ గా మొదలైంది.. సీజన్ 3 కి హోస్ట్ గా వ్యవహరించిన అక్కినేని నాగార్జుననే ఈ నాలుగో సీజన్ కి కూడా హోస్ట్ గా చేస్తున్నారు.. మొత్తం 16 మంది కంటెస్టెంట్ లతో మొదలైన సీజన్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.. దీనితో షో రేటింగ్స్ పైన ఆసక్తి అందరిలోనూ నెలకొంది.. అయితే తాజాగా బిగ్ బాస్ 4 రేటింగ్స్ తెలుపుతూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు..

నాలుగో సీజన్ ప్రారంభ వేడుకలకు గాను 18.5 టీఆర్పీ రేటింగ్ వచ్చిందని వెల్లడించారు..టిఆర్పీ పరంగా చూస్తే ఇది రికార్డు అనే చెప్పాలి.. గత సీజన్ టీఆర్పీలను పరిశీలించినట్లు అయితే ఎన్టీఆర్ హోస్ట్‌గా వచ్చిన మొదటి సీజన్‌‌కి 16.18 రేటింగ్ వచ్చింది.. ఇక నాని హెస్ట్ చేసిన రెండో సీజన్‌ కి 15.05 రేటింగ్ వచ్చింది.. ఇక నాగార్జున హోస్ట్ చేసిన మూడో సీజన్‌కు 17.9 రేటింగ్ వచ్చింది.. ఇప్పుడు ఈ మూడింటిని బ్రేక్ చేస్తూ.. నాలుగో సీజన్ కి 18.5 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రతి ముగ్గురిలో ఇద్దరు బిగ్ బాస్ ని చూస్తున్నారట..


దీని పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ బిగ్ బాస్ టీం ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది.. అటు హీరో నాగార్జున కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మీ అందిరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు నాగార్జున.. అయితే ఓపెనింగ్ లో అదరగొట్టిన బిగ్ బాస్ చివరివరకు అలాగే కొనసాగిస్తుందా లేదా అన్నది చూడాలి.. ఇక అటు ఈ సీజన్ లో మొదటి ఏలిమినేషన్ జరిగిపోయింది. మొదటి ఏలిమినేటర్ గా దర్శకుడు సూర్యకిరణ్ హౌస్ నుంచి వెళ్లిపోయాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories