Bigg Boss 4 Telugu: పాకాన పడుతున్న ప్రేమ కథ.. టాప్ లేపిన హారిక..మెహబూబా!

Bigg Boss 4 Telugu: పాకాన పడుతున్న ప్రేమ కథ.. టాప్ లేపిన హారిక..మెహబూబా!
x

Bigg Boss 4 Telugu episode 11 highlights 

Highlights

Bigg Boss 4 : బిగ్ బాస్ హౌస్ లో వినోదం కొనసాగుతోంది. ఒక వైపు ప్రేమకథ.. మరోవైపు హౌస్ మేట్స్ డ్యాన్సులు ఈ ఎపిసోడ్ లో వినోదాన్ని పంచాయి.

ముక్కోణపు ప్రేమకథ మెల్లగా రసకందాయంలో పడుతోంది. ఒకవైపు అభిజిత్..మరోవైపు అఖిల్ మోనాల్ కు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇద్దరూ కూడా మోనాల్ వేరే ఎవరితో మాట్లాడినా అసూయతో ఉడికిపోతున్నారు. అఖిల్ తో మోనాల్ మాట్లాడుతుంటే చూస్తూ సుజాత, లాస్యలతో ముచ్చట్లు పెట్టిన అభిజిత్.. అఖిల్, మోనాల్ ఎం మాట్లాడుకుంటున్నారో అంటూ మదన పడుతున్నాడు. తరువాథ అఖిల్, మోనాల్ మాట్లాడుకుంటుంటే.. లాస్య, సుజాత వారి వెనుక సోఫాలోనే కూర్చుని ఇద్దరి గురించి మాట్లాడుకున్నారు. బిగ్ బాస్ ఈ ముక్కోణపు ప్రేమకథను జాగ్రత్తగానే ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది రాబోయే రోజుల్లో ఈ ముగ్గురి మధ్యలోనే హౌస్ మొత్తం చీలిపోయి గ్రూపులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.

బీ బీ టీవీలో అదిరిపోయే డాన్స్ షో!

ఈ ఎపిసోడ్ టాస్క్ లో భాగంగా బీ బీ టీవీలో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని సూచించాడు బిగ్ బాస్. దాని ప్రకారం అరియానా యాంకర్ గా వ్యవహరించాలి. నోయల్, లయ జడ్జిలుగా వ్యవహరించాలి. అమ్మ రాజశేఖర్ సోలో సాంగ్ తో పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సోహైల్ మోనాల్ ఒక జంటగా, మహబూబ్ హారిక ఒక జంటగా.. మిగిలిన వాళ్ళు ప్రేక్షకులుగా ఉండాలి. ప్రేక్షకులు కమర్షియల్ యాడ్ చేయాలి.

ఇక ఈ పెర్ఫార్మెన్స్ కోసం అందరూ రిహార్సల్స్ మొదలు పెట్టారు. అభిజిత్ దేవి కల్యాణి అఖిల్ కమర్షియల్ స్కిట్ చేయడానికి మాట్లాడుకున్నారు. కామెడీ గా చేయాలని అభిజిత్ చెబితే.. దేవి అభ్యంతరం చెప్పింది. నేను కామెడీ చేయను అని చెప్పింది. నాకు బయట ఉన్న ఇమేజి వేరు అంటూ అభిజిత్ తో వాదనకు దిగింది. కల్యాణి.. ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించింది.

ఇక రాజశేఖర్ అందరికీ డాన్స్ నేర్పించాడు. మోనాల్..సోహైల్ ఇద్దరకూ డాన్స్ నేర్పించారు. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే అఖిల్ దగ్గరలోనే కూచుని మోనాల్ మూమెంట్స్ ను చూసి మాడిపోయాడు. ఆమె సోహైల్ తో డాన్స్ చేస్తుంటే భరించలేనట్టుగా చూస్తూ ఉండిపోయాడు.

అదరగొట్టిన మెహబూబా..హారిక..

షో ప్రారంభం అయ్యాకా.. మొదట అమ్మ రాజశేఖర్ సినిమా చూపిస్తా మామా పాటకు డాన్స్ చేశాడు. తరువాత వానా వానా వెల్లువాయే పాటకు సోహైల్..మోనాల్ సూపర్ గా చేశారు. సోహైల్ చాలా ఈజ్ తో డాన్స్ చేశాడు. తరువాత కమర్షియల్ బ్రేక్ లో దేవీ, కళ్యాణి బం చిక్ ఫ్యాన్ అంటూ హడావుడి చేశారు. వారికి తోడుగా..అఖిల్.. అభిజిత్ ఎలా అంటే అలా వాడుకోవచ్చు. అంటూ యాడ్ ముగించారు. తరువాత మహబూబ్..హారిక.. టాప్ లేచిపోద్ది.. అంటూ టాప్ లేచిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వారిద్దరి డ్యాన్స్ కి హౌస్ మొత్తం ఫిదా అయిపొయింది. మెహబూబ్ మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. పెర్ఫార్మెన్స్ కి ఇచ్చే మెడల్స్ వారిద్దరికీ ఇచ్చారు. గంగవ్వతో మహబూబ్ కు.. రాజశేఖర్ తో హారిక కు మెడల్స్ ఇప్పించారు. ఈ డాన్స్ షో మధ్యలో గంగవ్వ తనదైన స్టైల్ లో పాట పాడింది.

మొత్తమ్మీద ఎపిసోడ్ ప్రేమకథ.. ఆట పాటల వినోదంగా నడిచిపోయింది. ఎపిసోడ్ లో హైలైట్ ఏమిటంటే.. సోహైల్..మోనాల్ డ్యాన్స్ రిహార్సల్ చేస్తుంటే.. అఖిల్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్. బిగ్ బాస్ అంటేనే కొద్దిగా రియాల్టీ.. మరికొంత రియాల్టీలా కనిపించే కల్పితం కదా. ప్రస్తుతం బిగ్ బాస్ ను ముక్కోణపు ప్రేమ కథ నేపధ్యంలో నడిపించేలా కనిపిస్తోంది. అందులో భాగంగానే అయినా అఖిల్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది అంతే.


Show Full Article
Print Article
Next Story
More Stories