Bigg Boss 4 Telugu: బిగ్ బాస్! అలా.. ఆ ముగ్గురి మధ్యలో మొదలైంది!!

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్! అలా.. ఆ ముగ్గురి మధ్యలో మొదలైంది!!
x

Bigg Boss 4 Telugu Episode 9 Highlights (Image Curtesy: Star Maa)

Highlights

Bigg Boss 4 : ముక్కోణపు పులిహోర ప్రేమ కథ మొదలైంది బిగ్ బాస్ హౌస్ లో .. గంగవ్వ నేను వెళ్ళిపోతాను బాబోయ్ అంటోంది.. ఎపిసోడ్ 9 లో ఎం జరిగిందో మీకోసం..

పులిహోర పురాణం మొదలైంది. అయితే, ఈసారి కొంచెం వెరైటీగా.. ముగ్గురి మధ్యలో.. పులిహోర తాలింపు మొదలైంది. ప్రతి సీజన్ కు ఒక పులిహోర్ స్టోరీ తప్పనిసరి కదా.. అదేవిధంగా ఈసారి కూడా అది ప్లాన్ చేసినట్టున్నారు. మొదటే అభిజిత్ కి మోనాల్ కి ఎదో క్రియేట్ చేయాలని అనుకున్నారు. కానీ వారం గడిచినా వర్కౌట్ కాలేదు. అందుకే అనుకుంటా రంగంలోకి అఖిల్ ని దింపారు. మోనాల్ వెనుక అభిజిత్ పడుతున్నాడు. మరోవైపు అభిజిత్ కూడా అనూహ్యంగా మోనాల్ తో పులిహోర కలిపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అయితే మోనాల్ అఖిల్ తో ఎక్కువగా మాట్లాడుతూ కనిపించింది. మొట్టమ్మీద ముక్కోణపు పులిహోర కథ బిగ్ బాస్ లో మొదలయినట్టే.. మరి ఎన్నిరోజులు ఈస్తోరీని లాగిస్తారో చూడాల్సిందే.

ఇక రేషన్ మేనేజర్ గా ఒకరిని నియమించాలని బిగ్ బాస్ చెప్పాడు. దానిప్రకారం ఇంటి కెప్టన్ అయినటువంటి లాస్య కు ఆ రేషన్ మేనేజర్ ఎంపిక బాధ్యత అప్పగించాడు. ఎవరికీ ఇంట్రస్ట్ వుంటే వాళ్ళు చేతులు ఎత్తుతారని నోయల్ అన్నాడు. అభిజిత్, దేవి ఇలా మరికొందరు చేతులు ఎత్తారు. అప్పుడు లాస్య కిచెన్ లో ఉండేవారికి ఆ బాధ్యత అప్పచెబితే బావుంటుందని భావిస్తున్నాను అని చెబితే. దేవి అభ్యంతరం చెప్పి వాదనకు దిగింది. చివరకు అమ్మరాజశేఖర్ కు ఆ అబాధ్యతలు అప్పచేబుతూ నిర్ణయం తీసుకుంది లాస్య.

నేనే మొదట దిగిపోతా..

ఈవారం ఎలిమినేషన్ కి నామినేషన్ ప్రక్రియ పెట్టాడు బిగ్ బాస్. ఒక పడవ ఇచ్చి అందులో అందరినీ కూర్చోమని.. 9 చోట్ల పడవ ఒడ్డుకు వస్తుందని.. అప్పుడు ఒక్కోరూ ఒక్కో చోట దిగాలని అలా దిగిపోయిన 9 మంది నామినేట్ అయినట్టే అని ప్రకటించారు. ఇక పడవ ప్రయాణం మొదలయింది. మొదట ఎవరు దిగాలి అనే విషయంలో అందరూ తర్జన భర్జన పడుతుంటే అభిజిత్ ముందు గంగవ్వ ను దిగమని అడుగుదాం. ఎలానూ అవ్వను ప్రేక్షకులు బయటకు వేల్లనీయారు అని అన్నాడు. దానికి అందరూ సరే అంటే, గంగవ్వకు ఈ విషయాన్ని నోయల్ చెప్పాడు దానికి సరే అని గంగవ్వ మొదట పడవ దిగిపోయింది. తరువాత వరుసగా నోయల్.. మోనాల్.. సోహైల్.. కల్యాణి..కుమార్ సాయి, అమ్మరాజశేఖర్..హారిక ఇలా 9 మంది దిగిపోయారు. దీంతో వీరు 9 మంది ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.

ఇప్పుడు ఈవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు వీరిలో ఎవరు బయటకు వెళతారో తేలాలంటే వచ్చే ఆదివారం వరకూ వేచి ఉండాల్సిందే. మొత్తమ్మీద గంగవ్వ తాను బయటకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నట్టు పడే పడే చెబుతోంది. అయితే, గంగవ్వే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంది. మరి ఎం జరుగుతుందో చూడాలి.

అన్నట్టు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి అర్ధరాత్రి సమయంలో కుమార్ సాయి వెళ్ళాడు. అక్కడ కనబడిన సోఫాలో పడుకుని కొద్ది సేపు కామెడీకి ప్రయత్నించాడు. అయితే, హౌస్ లో అందరూ కుమార్ సాయి ప్లాన్ వర్కౌట్ కానీయలేదు. ఇక పడవలో కూడా కుమార్ సాయి దిగిపోవాలని చాలా మంది వాదించారు. వారం నుంచి వచ్చి ఇంత కష్ట పడుతున్నాం ఒక్కరోజే గా అయింది నామినేట్ అయితే నష్టం ఏమిటి అనే రీతిలో మాట్లాడుకున్నారు. అందరూ కుమార్ సాయి రాకను వ్యతిరేకిస్తున్నట్టే కనిపిస్తోంది. కానీ, కుమార్ సాయి కొంచెం స్ట్రాంగ్ గానే కనబడుతున్నాడు. మరి ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి.

ఈ వారం వీరిలో ఎవరు బిగ్ బాస్ హౌస్ లోంచి బయటకు వెళతారు అని అనుకుంటున్నారు.. మీ అభిప్రాయం చెప్పండి

Show Full Article
Print Article
Next Story
More Stories