Top
logo

Bigg Boss 4 Telugu: హమ్మయ్య.. ఏడుపు సీను లేని బిగ్ బాస్ ఇన్నాళ్ళకు!

Bigg Boss 4 Telugu: హమ్మయ్య.. ఏడుపు సీను లేని బిగ్ బాస్ ఇన్నాళ్ళకు!
X

Bigg Boss 4 Telugu Episode 10 highlights (image courtesy Star Maa)

Highlights

Bigg Boss 4 Telugu: మోనాల్ కొళాయి తిప్పలేదు... కల్యాణి అరుపులు వినబడలేదు.. గ్లామర్ కి లోటు లేదు.. అన్నిటినీ మించి కామెడీ పండించే ప్రయత్నం జరిగింది. పదో ఎపిసోడ్ కు ఎంటర్టైన్ చేయాలనే సోయి బిగ్ బాస్ టీంకు వచ్చినట్టుంది.

Bigg Boss 4 Telugu Episode 10 Highlights : ఇన్నాళ్ళ తరువాత ఇప్పటికి బిగ్ బాస్ టీం కి మెలకువ వచ్చింది. పదో ఎపిసోడ్ వచ్చాకా వినోదం గుర్తొచ్చింది. నో ఏడుప్స్.. నో కొట్లాట్స్.. ఓన్లీ ఎంటర్తైన్మెంట్! ఎపిసోడ్ మొత్తం పూర్తి ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు. ఉన్నంతలో ఇప్పటివరకూ వచ్చిన ఎపిసోడ్లలో ఈరోజు ఎపిసోడ్ కాస్త వినోదాన్ని పంచింది. ఇక హౌస్ మేట్స్ ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు జీవించేశారు.. అది మామూలే కదా!

మెహబూబ్ కండల ప్రదర్శన.. హారిక మార్నింగ్ మస్తీ గ్లామర్ షో.. కల్యాణి..అమ్మ రాజశేఖర్ ముదర కామెడీ.. దేవీ..లాస్యల వాగ్వివాదం.. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా స్కిట్ ల హంగామా.. మధ్యలో కొత్తగా మొదలైన ముక్కోణపు పులిహోర కథ అన్నీ కలిసి బిగ్ బాస్ సరదాగా సాగింది.

లగ్జరీ బడ్జెట్ టాస్క్..

బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ సభ్యులకు ఇచ్చాడు. సుజాత ను కన్ఫెషన్ రూమ్ కి రమ్మని టాస్క్ వివరాలు చెప్పమని చెప్పాడు. బిబి టీవీ లో కల్యాణి. అఖిల్, అభిజిత్, దేవి, కుమార్ సాయి, సుజాత ఒక టీం గా మెయిన్ స్కిట్ ప్లాన్ చెప్పాడు. అందులో.. కల్యాణి అత్తగారిగా..సుజాత కోడలిగా.. అభిజిత్ ఆమె కొడుకుగా.. దివి ఆమె కూతురుగా.. దేవి ఆ ఇంటిలో పనిమనిషిగా.. కుమార్ సాయి మతిమరుపు ఎకౌంటెంట్.. అఖిల్ అమెరికా నుంచి దివి ని చూడటానికి వచ్చే పెళ్లి కొడుకుగా చేయాలని చెప్పారు. ఇక మిగిలిన వారు ప్రేక్షకులుగా ఉంటూ మధ్యలో కమర్షియల్ యాడ్స్ చేయాలనీ చెప్పాడు.

కల్యాణి కి ఇటువంటి పాత్రలు కొట్టిన పిండే కదా ఇరగదీసింది. ఇక స్కిట్ లో భాగంగా మిగిలిన అందరూ కూడా చక్కగా చేశారనే చెప్పాలి. దివి..అఖిల్ మధ్యలో వచ్చిన సన్నివేశంలో అఖిల్ కు దివి పులిహోర డైలాగ్ వేసి ఆదరగోట్టింది. నీకు పులిహోర కలపడం బాగా వచ్చినట్టు ఉండే అని దివి అంటే...అసలు పులిహోర అంటే ఏమిటి? అని అడిగాడు అఖిల్ దీనినే పులిహోర అంటారు అంటూ చురకేసింది దివి. పెళ్లి ఇష్టం లేని దివి.. అమెరికా అబ్బాయి అఖిల్ ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడమనే పాయింట్ మధ్యలో కల్యాణి కోడలి గొప్పతనాన్ని తెలుసుకున్నట్టుగా చేసి కొంతవరకూ స్కిట్ ను బతికించారు.

మధ్యలో వచ్చే కమర్షియల్ యాడ్ లో భాగంగా నోయల్, సోహైల్ గంగవ్వ కొడుకులు. ఉదయాన్నే గంగవ్వ ఇల్లు ఊడవమని మీ పెళ్ళాలకు చెప్పండిరా అని చెబుతుంది. నోయల్ తన భార్య హారిక కు ఇల్లు ఊదవమని చెబుతాడు. చిన్న చీపుర్తో నేను ఊడ్చాలేను అంటుంది. ఆమెను ఒప్పించి తీసుకు వెళ్తాడు. సోహైల్ తన భార్య అరియానా ను ఇల్లు ఊడ్వ మంటే నేను చేయను అంటుంది. దానికి సోహైల్ నీకు పెద్దది..కొత్తది చీపురు తెచ్చాను అంటాడు దానికి ఆమె అయితే సరే అంటుంది. ఇక నలుగురూ చీపుర్ల కంపెనీ గురించి ముచ్చట్లు పెడతారు. ఇంతలో గంగవ్వ పెద్ద చీపురు తీసుకువచ్చి నలుగురినీ కొడుతుంది. సోహైల్ అవ్వ చేతిలోని చీపురు తీసుకుని అమ్మా ఈ చీపురు ఎంత బాగుందో అంటాడు. దానికి అవ్వ చింది చీపుర్లె వాడండి అంటారు.

ఇక రెండో కమర్షియల్ లాస్య, మోనాల్, అమ్మ రాజశేఖర్, మహబూబ్ చేశారు. అమ్మ రాజశేఖర్..పెళ్లి చూపులకు బయలు దేరతాడు. బట్ట బుర్ర ఎలా కవర్ చేయాలని మహబూబ్ ని సలహా అడుగుతాడు. అతను విగ్ ఇచ్చి దీంతో కవర్ చేయి అంటాడు. ఇక పెళ్లి చూపుల కోసం పెళ్ళికూతురు మోనాల్ ను తల్లి లాస్య రెడీ చేస్తుంది. వాళ్ళిద్దరూ మంచి హెయిర్ స్టయిల్ తో ఉంది మంచి హెయిర్ ఉన్న అబ్బాయినే మోనాల్ చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. రాజశేఖర్ వచ్చేసరికి మోనాల్ అబ్బ జుట్టు ఎంత బావుందో అంటుంది. అవునా..అయితే తీసుకో అని విగ్గు తీసి ఇచ్చేస్తాడు రాజశేఖరు. దాంతో దొరికిపోతాడు..అయితే..మోనాల్ లాస్య కూడా తమ జుట్టూ విగ్గే అని షాక్ ఇస్తారు. జుట్టు లేదని చింత వద్దు మా విగ్గు వాడండి అని చెబుతారు.

ఇలా లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఆదరగోట్టేశారు.

హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్..

మామూలుగానే గంగవ్వ పంచె ఈ ఎపిసోడ్ లోనూ హైలైట్. మార్నింగ్ మస్తీలో భాగంగా దేత్తడి హారిక చిన్న స్కిట్ చేద్దాం అని నోయల్ ని పిలిచింది. గంగవ్వ ను కూడా అందులో పార్ట్ చేద్దామని చెప్పింది. నోయల్ ను తీసుకువెళ్ళి గంగవ్వ కు పరిచయం చేస్తుంది. నోయల్ తో మా అమ్మమ్మ అని పరిచయం చేస్తుంది. గంగవ్వకు ఇతను నోయల్. నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను. పెల్లిచేసుకోనా అమ్మమ్మా అని అడిగింది హారిక. అంతే.. వద్దు అంటూ గయ్యిన లేచింది గంగవ్వ. పెళ్ళయి ఇద్దరు పిల్లలున్న వాడిని పెళ్లి చేసుకుంటావా? అంటూ కచ్చితంగా వద్దని చెప్పేసింది అవ్వ. నోయల్ అవ్వ కాళ్ళు పట్టుకుని నె చచ్చిపోతా అంటాడు. చచ్చిపో అంతే కానీ, పెళ్ళికి మాత్రం ఒప్పుకోను అని చెప్పేసింది అవ్వ. ఇది స్కిట్ నిజం కాదు అని హారిక ఎదో చెప్పబోతే..ఏదైనా సరే ఇజ్జత్ తీసే ఇసుమంటి పనులకు నేను ఒప్పుకోను అంటూ భీష్మించింది. చాలా సహజంగా గంగవ్వ మాట్లాడిన మాటలు స్వచ్చత ఎపిసోడ్ కె హైలైట్ గా నిలిచాయి.

మొత్తమ్మీద ఎంటర్టైన్మెంట్ లేదని బాధపడుతున్న బిగ్ బాస్ ప్రేమికులకు ఈరోజు ఎపిసోడ్ కాస్త వినోదాన్ని పంచి సంతోష పెట్టిందనే చెప్పొచ్చు.

ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి.


Web TitleBigg Boss 4 Telugu episode 10 highlights an entertainment-packed episode first time in this season
Next Story