Bigg Boss 4 Telugu: ఒకరు వెళ్ళారు.. మరొకరు వచ్చారు.. ఇకనైనా వినోదం ఆశించొచ్చా బాస్!

Bigg Boss 4 Telugu: ఒకరు వెళ్ళారు.. మరొకరు వచ్చారు.. ఇకనైనా వినోదం ఆశించొచ్చా బాస్!
x

Bigg Boss 4 Telugu first elimination 

Highlights

Bigg Boss 4 Telugu: అనుకున్నట్టే సూర్యకిరణ్ బిగ్ బాస్ నుంచి నిష్క్రమించారు. కుమార్ సాయి ఎంట్రీ ఇచ్చారు. వీకెండ్ వినోదాన్ని ఇచ్చింది బిగ్ బాస్!

ట్విస్టులేమీ లేవు.. అనుకోనిదేమీ జరగలేదు. ప్రచారంలో ఉన్నట్టు.. అందరూ అనుకున్నట్టు.. ఎలిమినేషన్ జరిగింది. అందరికీ తెలిసినట్టు కొత్త ఎంట్రీ అయింది. ఆదివారం బిగ్ బాస్ హైలైట్స్ ఇలా..

ఆదివారం వినోదం.. బిగ్ బాస్ తో మరింత జోరుగా సాగింది. సండే..ఫన్ డే అంటూ కింగ్ నాగార్జున బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్ వేదికగా పలకరించారు. బిగ్ బాస్ వారంతం లో వచ్చే ఎపిసోడ్ ప్రత్యేకంగా ఉంటాయి. శని, ఆది వారాల్లో హోస్ట్ నాగార్జున అధ్వర్యంలో వినోదం చిందులేసింది అక్కడ. నాగార్జున రాములో రాములో పాత తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. తరువాత హౌస్ మేట్స్ అందరితో గార్డెన్ ఏరియాలో రెండు టీం లుగా విడదీసి డ్యాన్స్ పోటీలు పెట్టారు. దానిలో లేడీస్ బ్యాచ్ గెలిచింది. గంగవ్వ తో ప్రత్యేకంగా డ్యాన్స్ చేయించారు నాగార్జున. అమ్మరాజశేఖర్ చెబుతుంటే గంగవ్వ డ్యాన్స్ ఆదరగోట్టింది. దీంతో ఆమెకు పదికి పది పాయింట్లు ఇచ్చారు నాగార్జున.

అఖిల్ సేఫ్..

ఎలిమినేషన్ కి నామినేట్ అయిన వాళ్ళలో ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారో చెబుతాను అని నాగార్జున చెప్పారు. పాట వస్తుంది. ఆ పాటలో వచ్చే పేరు సేఫ్ జోన్ లో ఉన్నట్టు అని చెప్పారు నాగ్. ఆ సమయంలో అఖిల్ పాత ప్లే అయింది దీంతో అఖిల్ సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు.

మహబూబ్ సేఫ్..

ఈసారి కనెక్షన్ జంటలతో డ్రాయింగ్ గేమ్ ఆడించారు. ఆ తరువాత నాగార్జున ఓ పెయింటింగ్ తెప్పించి ఈ పెయింటింగ్ లో ఉన్న వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నట్టు అని చెప్పారు. ఆ పెయింటింగ్ లో మహబూబ్ ఉన్నాడు. దీంతో మహబూబ్ సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు.

సూర్యకిరణ్ అవుట్..

మోనాల్ తో నాగార్జున మాట్లాడుతూ హౌస్ లోకి అందరూ వచ్చినపుడు మంచినీళ్ళు ఇచ్చి వెల్ కం చెప్పావు. అది చాలా మంచి అలవాటు. ఇప్పుడు కూడా ఒక గ్లాస్ వాటర్ తీసుకురా అని చెప్పారు. ఆమె నీళ్ళు తీసుకువచ్చాకా. దివి, సూర్యకిరణ్ లో ఒకరికి ఆ నీళ్ళు ఇవ్వమన్నారు. దానికి మోనాల్ సూర్యకిరణ్ కు ఇచ్చింది. దీంతో సూర్యకిరణ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు నాగార్జున.

గంగవ్వ చీమ..

బయటకు వచ్చిన సూర్యకిరణ్ నాగార్జునతో మాట్లాడారు. అప్పుడు నాగార్జున హౌస్ లో ఉన్నవారిని జంతువుల ఫోటోలతో పోల్చమన్నారు. దానికి సూర్యకిరణ్ మోనాల్.. నెమలి - చీమ..గంగవ్వ...- దేవి.. మొసలి - సోహైల్..ఎలుక... - అభిజిత్..పిల్లి - దివి..తాబేలు.. -కల్యాణి..కోతి.. - మెహబూబ్..గడ్డ.. - హారిక..పాము - దున్నపోతు..అఖిల్

గుడ్లగూబ..అరియానా - నోయల్..నక్క - సుజాత..కుక్క - లాస్య..గాడిద - అమ్మరాజశేఖర్.. సింహం ఇలా పోల్చారు. ఇక బిగ్ బాంబ్ ఇచ్చారు నాగార్జున. అది పాజిటివ్ బాంబ్ అని చెప్పారు. ఆ బాంబ్ ఎవరి మీద వేస్తె వాళ్ళు ఒకరోజు ఏపనీ చేయకుండా రెస్ట్ తీసుకోవచ్చు. దానికి సూర్యకిరణ్ దేవి పేరును సూచించాడు.

అలా సూర్యకిరణ్ ఒక్క వారంలోనే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేశారు. తరువాత నాగార్జున ఒక సస్పెన్స్ అని చెప్పారు. ఈరోజుల్లో లాంటి సినిమాలలో నటించిన కుమార్ సాయి ని బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపిస్తున్నట్టు చెప్పారు. హౌస్ లో మరింత వినోదం కోసం అతన్ని పంపిస్తున్నామని చెప్పి పంపించారు. నాగార్జున.

మొత్తమ్మీద మొదటి వారం ఎలిమినేషన్ అనుకున్నట్టే పూర్తయింది. ఉదయం నుంచీ వచ్చిన ఊహాగానాలు నిజం చేస్తూ కుమార్ సాయి లోపలి వెళ్ళాడు. అలా ఈవారం గడిచిపోయింది. ఒకరు వెళ్ళారు.. ఇంకొకరు వచ్చారు. మళ్ళీ 16 మందితో బిగ్ బాస్ హౌస్ లో సందడి కొనసాగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories