Bigg Boss 4 Telugu: వినోదానికి ముసుగెందుకు అంటూ బిగ్ బాస్ ఆట షురూ చేస్తున్నారు!

Bigg Boss 4 Telugu: వినోదానికి ముసుగెందుకు అంటూ బిగ్ బాస్ ఆట షురూ చేస్తున్నారు!
x

Bigg Boss 4 Promo (curtesy: Star Maa)

Highlights

Bigg Boss 4 Telugu | బిగ్ బాస్ గత సీజన్ లో కంటెస్టెంట్ ల మనసులకు వేసుకున్న ముసుగు తీయిస్తా అంటూ అదరగొట్టిన నాగార్జున..ఈసారి వినోదానికి ముసుగెందుకు అంటూ వచ్చేస్తున్నారు!

''మాస్క్ ముఖానికి ఎంటర్ టైన్మెంట్ కి కాదు'' అంటూ వచ్చేస్తున్నాడు బిగ్ బాస్.. ఈరోజు సాయంత్రం 6 గంటలకు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ ప్రారంభం కాబోతోంది.

బిగ్ బాస్ వినోదం కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం నాలుగో సీజన్ ఈరోజు సాయంత్రం గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా సరికొత్త స్టైల్ లో పలకరిస్తూ వచ్చిన ప్రీమియర్ ప్రోమో ఆకట్టుకుంటోంది. వినోదానికి మాస్క్ ఉండదు అని టైంలీ పంచ్ తో మొదలైన ఈ ప్రోమో లో నాగార్జున రెండు గెటప్ ల్లో కనిపిస్తున్నారు. ఒకటి సూట్ తో బిగ్ బాస్ హుందాని చూపిస్తుంటే.. రెండోది సోగ్గాడి గెటప్ లో మాస్ మసాలాను ప్రతిబింబిస్తోంది. అంటే లేటుగా వచ్చినా మసాలా మిస్ అవదు నాది గ్యారెంటీ అని నాగార్జున చెప్పకనే చెప్పేస్తున్నారు.

కరోనా కారణంగా ఈసారి బిగ్ బాస్ సీజన్ చాలా ఆలస్యంగా మొదలవుతోంది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ స్టార్ మా, హాట్ స్టార్‌లలో బిగ్ బాస్ సీజన్ 4 తొలి ఎపిసోడ్ ప్రారంభం కానుంది. శని ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు బిగ్ బాస్ 4 ప్రసారం అవుతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 9.30 గంటలకు బిగ్ బాస్ అందరినీ అలరించే ఆట ఆదుకోబోతున్నాడు. ఇక నాగార్జున వారాంతాల్లోనే కనిపిస్తారు షరా మామూలుగానే.

ఈసారి కరోనా కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని బిగ్ బాస్ మొదలెడుతున్నారు. ఇందులో పాల్గొబోతున్న వారందరినీ 14 రోజుల ముందుగానే కరోనా పరీక్షలు చేయించి.. ఇన్ని రోజులు క్వారంటైన్ లో ఉంచి చివరగా మళ్ళీ కరోనా పరీక్షలు చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. నిజానికి ఈ షో వారం క్రితమే ప్రారంభించాలని అనుకున్నా కరోనా కారణంగానే ఆలస్యం అయింది. అయితే ఈరోజు రాత్రి నుంచి ప్రతి ఇంతా బుల్లితెర పై బిగ్ బాస్ హంగామా మొదలవబోతోంది.

బిగ్ బాస్ 4 షో కోసం మీరూ సిద్ధమేనా.. !



Show Full Article
Print Article
Next Story
More Stories