Bigg Boss 4 Telugu: ఏకంగా తొమ్మిది మంది.. నామినేషన్ లో! ఎందుకిలా బిగ్ బాస్!!

Bigg Boss 4 Telugu: ఏకంగా తొమ్మిది మంది.. నామినేషన్ లో! ఎందుకిలా బిగ్ బాస్!!
x
Highlights

Bigg Boss 4 : బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ హాట్ గా మారింది. ఐదో వారం ఎలిమినేషన్ కోసం ఏకంగా 9 మంది నమినేషన్స్ లో ఉన్నారు.

బిగ్ బాస్ రోజు రోజు కీ హీట్ పెరుగుతోంది. ఒకరిపై ఒకరు యుద్ధాలు చేస్తున్నారు. సేఫ్ గేమ్ ఆడాలని ప్రయత్నించేవారు కొందరైతే.. పులిహోర కథలతో లైవ్ లో ఉండాలని చూసేవారు కొందరు. నోటికి ఎలా వస్తే అలా మాట్లాడి గొడవ పడేవారు మరికొందరు. వీరందర్నీ అలా ఆటలో నడిపించేస్తున్నాడు బిగ్ బాస్. ఇక సోమవారం నామినేషన్ ప్రక్రియ అనగానే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్లకి..చూసేవాళ్ళకి ఒక రకమైన టెన్షన్. ఎవరు ఎవర్ని నామినేట్ చేస్తారో.. ఎందరు నామినేషన్ లోకి వెళతారో.. చివరకు ఎవరు బయటకు పోతారో అనే టెన్షన్ సోమవారం మొదలవుతుంది. ఈ సోమవారమూ హౌస్ లో అదే టెన్షన్ తొ మొదలైంది.

హౌస్ లో నామినేషన్ ప్రక్రియ మొత్తం ఫైటింగ్ లు ఎదుపులతో సాగింది. ముఖ్యంగా మోనాల్ కేంద్రంగా అఖిల్..అభిజిత్..హారిక చేసిన హంగామా వీధి అల్లర్లను మరిపించింది. ముక్కోణపు పులిహోర కథ మసాలాగా మారిపోయింది. ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిద్దరి చొప్పున నామినేట్ చేసి, ఎందుకు నామినేట్ చేస్తున్నారో కారణాలు చెప్పి వారి ముఖంపై ఫోమ్ పూయాలని చెప్పాడు బిగ్ బాస్.

తొమ్మిది మంది నామినేషన్ లో..

నామినేషన్‌ ప్రక్రియతొ అభి, అఖిల్‌ మధ్య ఉన్న వైషమ్యాలు బయటపడ్డాయి. అఖిల్ మొదటి వ్యక్తిగా సోహైల్‌ని నామినేట్‌ చేస్తు కోపం తగ్గించుకోవాలని సూచించాడు. ఇక రెండో వ్యక్తిగా అఖిల్‌ని నామినేట్‌ చేస్తూ అభిజిత్ రెచ్చిపోయాడు. ''నువ్వు మామాలుగా కన్ఫ్యూజ్‌ అవుతావని నాకు తెలుసు. కానీ నువ్వు పచ్చి అబద్ధం ఆడుతావని ఇప్పుడే తెలుసుకున్నా అని అన్నాడు. కళ్లు ఇలా చేసి, ఇలా చూసి మాట్లాడితే ఎదుటి వాడు భయపడడు'' అందూ అభిజిత్ అఖిల్ కు గట్టిగానే చెప్పాడు. నీ యాటిట్యూడ్‌ కూడా నచ్చలేదు, దేనికైనా లిమిట్స్ ఉంటుంది అంటూ అభి చెబుతుండగా అఖిల్ కౌంటర్ స్టార్ట్ చేశాడు. ఒక అమ్మాయి గురించి మాట్లాడుతూ ఆమె ఐ లక్ యూ అంటే అదరికీ చెప్పుకోవడమే కాకుండా, సుజాత గురించి కూడా బ్యాడ్‌గా మాట్లాడుతున్నావ్.. ఇది నేషనల్ ఛానల్ ఒక అమ్మాయి గురించి ఇలా చెప్తే బయటకు ఎలా వెళ్తుంది అంటూ అభిజిత్ పై అఖిల్ మండిపడ్డాడు. దీంతో గొడవ పెద్దది అయిపొయింది. అభిజిత్ వాళ్ళ గురించి నీకెందుకు? నేను వాళ్ళతో మాట్లాడుకుంటాను. మధ్యలో నువ్వెవరు అమ్మాయిల గురించి మాట్లాడటానికి అంటూ అఖిల్ ని ప్రశ్నించాడు.

ఈ గొడవ మధ్యలో అఖిల్..అభిజిత్ లు పదే పదే తన పేరు తీసుకురావడంపై మోనాల్ సీరియస్ అయింది. ఒక పక్క భోరున ఏడుస్తూనే.. మీరెవరు మధ్యలో నా పేరుతో మాట్లాడుకోవడానికి? నామినేషన్ ప్రక్రియలో మీ విషయాలు చూసుకోండి. ఏదైనా వుంటే పక్కకు పోయి మాట్లాడుకోండి. ఇలా నా పేరు పదిమందిలో నిలబెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? నా క్యారెక్టర్ జడ్జి చేయడానికి మీరెవరు? అంటూ ఏడుస్తూనే ప్రశ్నించింది. ఆమె ఏడుపు ఆపడం ఎవరి వల్లా కాలేదు. గంగవ్వ ఆమెను సముదాయించేందుకు ప్రయత్నించింది.

ఇక అవినాష్..అఖిల్ ని, మోనాల్ ని నామినేట్ చేశాడు. సుజాత అఖిల్..అరియానా లను, కుమార్ సాయి నోయల్, సుజాత లను, సోహైల్ అభిజిత్, నోయల్ లను నామినేట్ చేశారు. అదేవిధంగా గంగవ్వ నోయల్..అభిజిత్ లను, రాజశేఖర్ మాస్టర్ అఖిల్, అరియానాలను, లాస్య దివి.. నోయల్ లను, నోయల్ అమ్మరాజశేఖర్, సోహైల్ లను నామినేట్ చేశారు.

దీంతో మొత్తం తొమ్మిది మంది అఖిల్, నోయల్, అభిజిత్, సొహైల్, రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానా‌లు నామినేషన్ లో ఉన్నారు.

మొత్తమ్మీద ఎపిసోడ్ అంతా నామినేషన్ ప్రక్రియ గోలతోనే గడిచింది. అందరు హౌస్ మేట్స్ ఎవరి వ్యక్తిగత కారణాలు వాళ్ళు చెప్పి అవతల వాళ్ళను నామినేట్ చేశారు. ఐదో వారం వచ్చినా స్ట్రాటజీతొ ఎవరూ లేరు. సిల్లీ రీజన్ లతో నామినేషన్ చేయడం ఎక్కువ కనిపించింది. ఇక ముక్కోణపు పులిహోర ఇప్పుడు బజార్న పడింది. ఈ కథను బిగ్ బాస్ డ్రైవ్ చేస్తున్నాడో.. అక్కడ అలా కుదురుతుందో లేదో తెలీదు కానీ.. ప్రస్తుతం ఇది హాట్ గా మారింది. ఈవారం ఈ తొమ్మిది మందిలో ఎవరు బయటకు వెళతారో చూడాలి మరి!

ఈవారం బిగ్ బాస్ నుంచి ఎవరు బయటకు వెళతారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి!

ఇది అధికారిక పోల్ కాదు..మీ అభిప్రాయం కోసం మాత్రమే..గమనించగలరు.. మరిన్ని బిగ్ బాస్ విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories