Bigg Boss 4 Telugu: నామినేషన్ లొల్లి.. కుమార్ సాయి మళ్ళీ..!

Bigg Boss 4 Telugu: నామినేషన్ లొల్లి.. కుమార్ సాయి మళ్ళీ..!
x
Highlights

Bigg Boss 4 : నామినేషన్స్ కోసం ప్లాన్స్.. టాస్క్.. పాపం మళ్ళీ కుమార్ సాయి నామినేషన్స్ లో ..

ఏదేదో అనుకుంటాం కానీ, అన్నీ అవుతాయా ఏంటి? ఇలా అయింది కొంతమంది బిగ్ బాస్ హౌస్ మేట్స్ పరిస్థితి. ఈవారం ఎలిమినేషన్ కి వీళ్ళని నామినేట్ చేద్దాం..వాళ్ళని నామినేట్ చేద్దాం అనుకుంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసిన అందరికీ బిగ్ బాస్ చెక్ పెట్టేశాడు. ఎప్పటిలా హౌస్ మేట్స్ నామినేట్ చేసే పధ్ధతి కాకుండా టాస్క్ ఇచ్చి.. టాస్క్ నుంచి నామినేట్ అయ్యవిధంగా గేమ్ ప్లాన్ చేశాడు. మొత్తమ్మీద బిగ్ బాస్ లో ట్విస్ట్ లు మొదలయినట్టే ఉంది.

అబ్బబ్బా స్వాతి రోమాన్స్..లాస్య..నోయల్ ఘర్షణ..మహానటులు!

మార్నింగ్‌ మస్తిలో భాగంగా స్వాతి ఇంటి సభ్యులకు నవరసాలను నేర్పించాల్సి ఉంటుంది. అయితే స్వాతి తన పార్ట్‌నర్‌గా అభిజిత్‌ను ఎంపిక చేసుకుంది. శృంగార రసంలో భాగంగా అభిజిత్‌ను లవ్‌ చేస్తున్నట్లు చెప్పింది. మెలికలు తిరిగిపోతూ స్వాతి అభిజిత్ కి ప్రపోస్ చేసింది. దీంతో హౌస్ లో అందరూ ఎంజాయ్ చేశారు. కోపం.. టాస్క్‌లో భాగంగా లాస్య, నోయల్‌ మధ్య గొడవ పడుతున్నట్లు నటించారు. నా గురించి వేరే వాళ్ల వద్ద ఎందుకు మాట్లాడినవ్‌ అని అనగా.. నాకు వెనకాల చెప్పే అవసరం లేదంటూ లాస్య గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. కొద్ది సేపు ఉత్తుత్తినే ఇద్దరూ అరుచుకుని.. కామెడీ చేశారు. బీభత్సంలో అవినాష్‌ ప్రేమ పెళ్లి చేసుకుంటాను అంటూ హడావుడి చేశాడు. దానికి గంగవ్వ తన స్టైల్ లో రిప్లై ఇచ్చి రచ్చ చేసింది.

ఇక నామినేషన్స్ లో ఎవరిని ఉంచాలి అనే అంశంలో గ్రూపులుగా చేరి డిస్కషన్స్ పెట్టేశారు అందరూ. దివి, మోహబూబ్‌ మాట్లాడుకుంటూ.. అభిని నామినేట్ చేయాలని అనుకున్నారు. తరువాత రెండో పేరు ఎవరిది చెప్పాలనే దానిపై ఇద్దరూ కొంత సేపు తర్జన భర్జన పడ్డారు. ఇక అరియానా, అవినాష్ పై అలిగింది. కొద్దిసేపు అతనితో ఆదుకుంది. ఇక దివి అభి మాట్లాడుకున్నారు. అభిని నువ్వు రకరకాలుగా ప్రవర్తిస్తున్తావు అంటూ చెప్పింది. ఇలా గ్రూపులుగా బాగానే ప్రిపేర్ అయిపోయారు నామినేషన్స్ కోసం.

ఇంట్లో ఇద్దరు హిట్‌ మెన్‌లు(అఖిల్‌, సోహైల్‌) ఉంటారు. మిగిలిన ఇంటి సభ్యులంతా లివింగ్‌ ఏరియాలో ఉండాలి. ప్రతి ఒక్కరికి బిగ్‌బాస్‌ 10 వేల రూపాయలు ఇస్తాడు. అలాగే ఇద్దరు హిట్‌మెన్‌లకు ఒక్కొక్కరికి 5 వేలు ఇస్తాడు. సమయానుసారం ఇంట్లో 5 బజర్లు మోగుతాయి. ప్రతి బజర్‌ మోగినప్పుడు లాంజ్‌లోకి ఎవరు మొదటగా వస్తే వారే హిట్‌మెన్‌లతో మర్డర్‌ డీల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎవరినైతే చంపాలి అనుకుంటున్నారో వారి పేరు చెప్పి, అంందుకు గల కారణాలను వివరించాలి. చనిపోయిన వ్యక్తి నాయినేట్‌ అయినట్లు. ఇందులో మొదట రాజశేఖర్ వచ్చి స్వాతిని నామినేట్ చేయాలని అఖిల్ తో డీల్ కుదుర్చుకున్నారు. దీంతో అఖిల్ స్వాతిని మర్డర్ చేసేశాడు. అయతే, స్వాతి ఈ విషయంలో రాజశేఖర్ తో ఘర్షణ పడింది. రెండోసారి మెహబూబ్ వచ్చి అఖిల్ తో డీల్ కుదుర్చుకుని తాను అనుకున్నట్టుగానే అభిజిత్ ను నామినేట్ చేసి వెళ్ళాడు. ఇక మూడోసారి అరియానా వచ్చి అఖిల్ తో డీల్ కుదుర్చుకుంది. దీని ప్రకారం లాస్య నామినేట్ అయింది. ఇక నాలుగో వ్యక్తిగా వచ్చిన హారిక తన ఫ్రెంఢ్‌ మెహబూబ్‌ను అంతం చేసేందుకు డీల్‌ మాట్లాడుకుంది. చివరిగా రూమ్ లోకి రావడానికి అందరూ పోటీ పడ్డారు. కానీ, నోయల్ వెనుక వైపు నుంచి లోపలి వచ్చాడు. మరో వైపు సుజాత కూడా ముందు వైపు నుంచి లోపలి వచ్చింది. దీంతో noyal వెనుక నుంచి రావడం కరక్ట్ కాదని డిస క్వాలిఫి చేసారు. సుజాత సోహైల్ తో కుమార్ సాయి ని టార్గెట్ చేసి నామినేట్ చేసింది. ఇక హిట్ మెన్ లలో అఖిల్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండడంతో ఆటను సేఫ్ అయి సోహైల్ నామినేట్ అయ్యాడు.

మొత్తమ్మీద ఈ వారం నామినేషన్స్ లో స్వాతి, అభిజిత్‌, లాస్య, హారిక, మహబూబ్, కుమార్‌సాయి, సోహైల్‌ ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ కావాలనేది ప్రేక్షకులు వేసే ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది.

ఈవారం బిగ్ బస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఇక్కడ చెప్పండి

ఇది అధికారిక పోల్ కాదు.. మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం మాత్రమె! మరిన్ని బిగ్ బాస్ వార్తల అకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
Next Story
More Stories