Bigg Boss 4 Telugu: చల్లని మంటతో కెప్టెన్ ఎవరో తేల్చాడు బిగ్ బాస్!

Bigg Boss 4 Telugu: చల్లని మంటతో కెప్టెన్ ఎవరో తేల్చాడు బిగ్ బాస్!
x

Bigg Boss 4 Telugu Episode 33 Highlights

Highlights

Bigg Boss 4 : బిగ్ బాస్ 4 ఎపిసోడ్ 33 లో సోహైల్ కెప్టెన్ గా టాస్క్ గెలిచాడు.

బిగ్ బాస్ 4 చల్లని మంట పెట్టాడు. ఒక్కోరి ముసుగూ తీసే కార్యక్రమం పెట్టుకున్నాడు. టాస్క్ ను అర్థం చేసుకోలేక..ఓవర్ స్మార్ట్ నెస్ ప్రదర్శించి అభిజిత్ చిత్తయ్యాడు. టాస్క్ రూల్స్ కరెక్ట్ గా అర్థం చేసుకున్న సోహెల్, మెహబూబ్. అరియానా తమదైన స్టైల్ లో ఆడి విజేతలుగా నిలిచారు. వారి నుంచి విడిపోయి..అభిజిత్ కోసం ఆడాలని ప్రయత్నించిన హారిక కు అభిజిత్ షాక్ తగిలింది. అభిజీత్ చేసిన పనితో కొంత మనస్తాపం చెందింది. అయితే, పులిహోర రాజా అభిజీత్ జాగ్రత్తగా డీల్ చేసి ఓ హాట్ హగ్ ఇచ్చి కూల్ చేశాడు. ఇక బీబీ హోటల్ టాస్క్ లో ఎవరు గెలిచారు అనేదాని పై పెద్ద చర్చ నడిచింది. అది పూర్తయ్యేసరికి ఎవరు కెప్తెన్సీ పోటీకి అర్హులు అనే దాని పై కూడా రచ్చ సాగింది. హాట్ హాట్ గా అన్నీ పూర్తయ్యి చివరకు కెప్టేన్సీని కూల్ గా సోహెల్ ఎగరేసుకుపోయాడు. ఇవీ బిగ్ బాస్ ఎపిసోడ్ 33 విశేషాలు.

మూడురోజులుగా జరుగుతున్న కెప్టెన్సి టాస్క్ బీబీ హోటల్ ముగిసింది. హోటల్ లో ఆతిధ్యం ఇచ్చే టీం.. అతిధులకు సేవలు అందించి స్టార్ లు పొందాలి. అదే విధంగా తమ మంచి సర్వీస్ తో అతిధుల వద్ద నుంచి టిప్ లు పొందాలి. ఇదీ సింపుల్ గా టాస్క్ అయితె, ఆతిధ్యం ఇచ్చిన వారిని ఓడించడం కోసం వారి టీం లోనే ఓ వెన్నుపోటు దారుడ్ని పెట్టాడు బిగ్ బాస్. మొత్తమ్మీద టాస్క్ లో ఆ వెన్నుపోటు దారుడి సహాయంతో ఆతిధ్యం ఇచ్చే టీం దిగ్విజయంగా ఓడిపోయింది. దానికి తోడు ఆ టీం రూల్స్ ని సరిగ్గా అర్ధం చేసుకోలేక పోయింది. రోబో టీం లో మైండ్ తొ ఆడి గెలిచామన్న నమ్మకం ఎక్కువైపోయిన అభిజిత్ స్టార్స్ దొంగతనం చేస్తే సరిపోతుందని భావించాడు. ఎలాగైనా స్టార్స్ తమ దగ్గర ఉంటె గెలిచినట్టే అని తిక్క లెక్కలు వేశాడు. అందుకు హారికను పావుగా వాడుకున్నాడు. పాపం దీంతో హారిక కు ఏడుపే మిగిలింది. ఆమె వద్ద ఉన్న ఐదు స్టార్ లు దొంగిలించి బిగ్ బాస్ కు మేమే గెలిచాం.. ఐదు స్టార్ లు మాదగ్గరే ఉన్నాయని చెప్పాడు. దానికి బిగ్ బాస్ అతిథుల టీం ను ఎన్ని స్టార్ లు మీరు ఇచ్చారో చెప్పండి అని అడిగాడు. అందరూ కలిసి ఒక్క స్టార్ ఇచ్చినట్టు చెప్పారు. దీంతో బిగ్ బాస్ అతిథుల టీం గెలిచినట్టు ప్రకటించాడు.

ఇక కెప్టెన్సి టాస్క్ లో ఎవరు పాల్గోవాలి అనే చర్చ మొదలైంది. ఎక్కువ మంది సోహైల్ పేరు చెప్పారు. ఈ విషయంలో సోహైల్..అరియానా..మెహబూబ్ మధ్య పెద్ద రచ్చ నడిచింది. సోహైల్ మాత్రం కచ్చితంగా నేను ఇంతకు ముందు కెప్టెన్సి టాస్క్ లో నీకు పూర్తిగా సహకరించాను. ఇప్పుడు నువ్వు నాకు సహకరించాల్సిందే. నువ్వే తేల్చుకో. అని అల్టిమేటం ఇచ్చాడు. దాంతో అరియానా కూడా సోహైల్ కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈలోపు కుమార్ సాయి గంగవ్వ అభిప్రాయం అడుగుదామని అన్నాడు. దానికి ''గంగవ్వే ప్రతిదీ చెప్పాలని రూల్ ఏం లేదు.. ఆమె నిర్ణయాన్ని జడ్జిమెంట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రతిసారి ఇలాగే అవుతుంది'' అని అభ్యంతరం చెప్పాడు సొహైల్. తరువాత అందరూ ఏకగ్రీవంగా సోహైల్ ను కెప్టెన్సీకి మొదటి పోటీదారుడుగా ప్రకటించాడు బిగ్ బాస్.

ఇక రెండో పోటీ దారుడిగా ఎవరికీ ఎక్కువ టిప్స్ వచ్చాయో చూసి చెప్పమన్నాడు బిగ్ బాస్.. అఖిల్ కి ఎక్కువ టిప్స్ రావడంతో ఆటను రెండో పోటీదారుడు అని చెప్పాడు బిగ్ బాస్. ఇక ఆతిధ్య టీం కు వెన్నుపోటు పొడిచింది ఎవరో చెప్పాడు బిగ్ బాస్. అవినాష్ కు ఇచ్చిన సీక్రెట్ టాస్క్ గురించి చెప్పి.. అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఆ టాస్క్ లో అవినాష్ గెలిచినట్టు ప్రకటించాడు బిగ్ బాస్. దీంతో మూడో కెప్టెన్సి పోటీదారుడిగా అవినాష్ ఎంపికయ్యాడు.

కింద నుంచి మంట పెట్టి.. చేతిలో చల్లగా ఐసు పెట్టాడు బిగ్ బాస్..

ఇక కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా క్లిష్టమైన టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. రెండు చేతుల్లోనూ ఐస్ బౌల్స్ పెట్టుకుని.. వంగుని నిలబడాలి.. ఎవరు ఎక్కువ సేపు అలా నిలబడితే వారే కెప్టెన్. అంటే కిందనుంచి చేతులకు వేడి తగులుతుంది.. చేతులు పైనుంచి ఐస్ చల్లదనం.. పైగా వంగుని నిలబడాలి.. ముగ్గురూ చాలా ఓపికగా దీనిని చేయడానికి ప్రయత్నించారు. అయితే, మొదట అఖిల్ తట్టుకోలేక బయటకు పడిపోయాడు. దీంతో మోనాల్ వెంటనే ఏడుస్తూ అఖిల్ వద్దకు వెళ్ళింది. తరువాత హౌస్ మేట్స్ అందరూ వెళ్లి అఖిల్ చేతులు రాస్తూ సపర్యలు చేశారు. తరువాత అవినాష్ నిలబడలేక బయటకు వచ్చేశాడు. దీంతో సోహైల్ కెప్టెన్ గా ఎన్నికయ్యాడు.

ఇక ఈసారి టాస్క్ లో ఎవరు చెత్తగా పెర్ఫార్మ్ చేశారనే దానికి అమ్మ రాజశేఖర్ పేరు ప్రకటించాడు బిగ్ బాస్. దాంతో రాజశేఖర్ కి భారీగా ఉల్లిపాయలు ఇచ్చి అవి చిన్న ముక్కలుగా కట్ చేయమని చెప్పాడు బిగ్ బాస్.

ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎవరు బయటకు వెళతారు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి..

ఇది అధికారిక పోల్ కాదు..మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం మాత్రమే! మరిన్ని బిగ్ బాస్ విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories