Bigg Boss 4 Telugu: హోటల్ టాస్క్ తో బిగ్ బాస్ హౌస్ లో రచ్చ..రచ్చ!

Bigg Boss 4 Telugu: హోటల్ టాస్క్ తో బిగ్ బాస్ హౌస్ లో రచ్చ..రచ్చ!
x
Highlights

Bigg Boss 4 : బిగ్ బాస్ 4 ఎపిసోడ్ 32 లో హోటల్ టాస్క్ రకరకాలుగా గొడవలు పడుతున్నారు.

బిగ్ బాస్ 4 లో బీబీ టాస్క్ ఒక రేంజిలో అవుతోంది. ఎవరికీ వారు ఆడేసుకుంటున్నారు. హోటల్ సిబ్బంది టీమ్ ను అతిథి టీమ్ విసిగించేస్తున్నారు. అంతే కాకుండా.. ఫిజికల్ టాస్క్ ల తొ వారిని ఇబ్బంది పెట్టారు. ఒక పక్క మెహబూబ్, సోహైల్ హోటల్ సిబ్బందిని అన్నిరకాలుగానూ ఇబ్బంది పెడుతున్నారు. మరోవైపు అవినాష్ సీక్రెట్ టాస్క్ లో భాగంగా సాధ్యమైనంత వరకూ హోటల్ సిబ్బంది టీమ్ కు వెన్నుపోటు పొడుస్తున్నాడు.

మాస్టర్ రాజశేఖర్ కు వంద సార్లు స్విమ్మింగ్ పూల్ లో దూకాలని టాస్క్ ఇచ్చారు. దీంతో వందసార్లు దూకి టాస్క్ పూర్తి చేశాడు రాజశేఖర్. తరువాత అఖిల్‌కి 150 పుష్ ఐప్ చేయాలని టాస్క్ ఇచ్చారు గెస్ట్‌లు.. అయితే అఖిల్ అతి కష్టం మీద 75 మాత్రమే తీయగలిగాడు. ఇక అభిజిత్‌తో 20 కేజీలు ఎత్తించి 60 పుష్ అప్‌లు చేయించారు.

ఇక స్పా పేరుతో ఎవరి ఇష్టమైన వారికి వారు మసాజ్ చేయించుకుంటూ కనిపించారు. ఇక మెహబూబ్ చేసిన గొడవతో హౌస్ లో కొద్దిసేపు రచ్చ రచ్చ అయింది. మెహబూబ్ తనకి ఫుడ్ పెట్టకపోవడంతో వాదనకు దిగాడు.. అయితే అవినాష్ అతన్ని బాగా విసిగించడంతో.. నీకు రూపాయి కూడా టిప్ కూడా ఇవ్వొద్దని ఆదేశించాడు. ఎవడైనా ఎక్కువ మాట్లాడితే ఒక్కొక్కడికీ పుచ్చలు పగిలిపోతాయి అని మెహబూబ్ వార్నింగ్ ఇవ్వడంతో.. అఖిల్ సీరియస్ అయ్యాడు.. మాటలు దాటకు.. పుచ్చలు ఎవరివి పగలగొడతావ్.. లిమిట్ దాటి మాట్లాడకు అంటూ కౌంటర్ ఇచ్చాడు.

దానికి మొహబూబ్ మరింత రెచ్చిపోయి.. నా జోలికి వస్తే ఎవడికైనా పుచ్చపగిలిపోద్దని మళ్లీ అనడంతో.. అవినాష్ సీన్‌లోకి వచ్చి.. మేమూ మగాళ్లమే మాకు మీసాలు ఉన్నాయి.. నీకు కండలు ఉన్నంత మాత్రాన ఎవడూ భయపడిపోడు.. కాస్త డీసెంట్‌గా బిహేవ్ చేయి.. నీ రౌడీ ఇజం నీ ఇంటి దగ్గర చూపించుకో బిగ్ బాస్ హౌస్‌లో కాదు.. కాస్త లిమిట్‌లో ఉంటు.. ఫుడ్ పెట్టము ఏం చేస్తావో చేసుకో.. అంటూ క్లాస్ పీకాడు. మొత్తానికి మెహబూబ్‌తో వాదన తారాస్థాయికి చేరింది. అయితే నువ్ పుచ్చపగిలిపోతుంది అనే మాట అనకుండా ఉండాల్సింది అంటూ సొహైల్ క్లాస్ పీకాడు. దీంతో మెహబూబ్.. అఖిల్‌తో పాటు హోటల్ టీం దగ్గరకు వెళ్లి సారీ చెప్పాడు. ఇక అవినాష్‌కి 1000 టిప్ ఇచ్చాడు మెహబూబ్.

స్టార్ లు ఇస్తేనే కానీ, మేము సర్వీసు ఇవ్వం అని హోటల్ సిబ్బంది టీమ్ భీష్మించారు. అతిథి టీమ్ ఎన్నిసార్లు అడిగినా అభిజిత్ అన్నీ ఆపేసి కూచున్నాడు. మరోవైపు అభిజిత్ టిప్ ల కోసం రాజశేఖర్ ను ఒత్తిడి చేయడంతో టిప్ డబ్బులు షేర్ విషయంలో రాజశేఖర్-అభిల మధ్య వివాదం రేగింది. నేను మేనేజర్‌ని వాళ్లకి సర్వీస్ చేయడం మానేయమని చెప్తుంటే నువ్వు ఎందుకు వినవు.. అంటూ అభి ఆర్డర్ వేయడంతో రాజశేఖర్ మాస్టర్ నువ్ చెప్తే నేను వినాలా? నేను వాళ్లకి చేసి పెడతా అంటూ గెస్ట్‌లకు వండి పెట్టి టిప్ సంపాదించాడు. ఈ విషయంలో సుజాత కూడా రాజశేఖర్ మాస్టర్‌తో గొడవకు దిగింది. వంట సామాన్లు దాచి పెట్టేసి.. నేను ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఫైర్ అయ్యింది.

ఇక ఈ హోటల్ గేమ్ సాగుతూనే ఉంది. గురువారం కూడా ఈ టాస్క్ కొనసాగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories