bigg boss 3 telugu updates: బిగ్ బాస్ లోకి న్యూ ఎంట్రీ.. ఎవరది?

bigg boss 3 telugu updates: బిగ్ బాస్ లోకి న్యూ ఎంట్రీ.. ఎవరది?
x
Highlights

కొద్దిగంటల్లో ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ లో ఒక లేడీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతున్నట్టు చొప్పిస్తూ "ఎవరదీ.." అనే సౌండ్ ఇచ్చారు. అయితే, మన సోషల్ మీడియా లో అందరూ నీడను చూసి కూడా వారెవరో యిట్టె చెప్పేసే దిట్టలు.. దానికి తోడు రెండు రోజులుగా లీకులు.. ఆ ఎవరనేది చెప్పెస్తున్నాయి.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటేనే భయం పుట్టేలా చేసిన తమన్నా సింహాద్రి దెబ్బకి.. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా చాన్నాళ్ళుగా వైల్డ్ కార్డ్ ఊసే తేలేదు. కాకపొతే, ఆరోవారనికే హౌస్ లో కాంటెస్టెంట్స్ పదకొండు కి చేరడంతో.. అప్పుడే హౌస్ ఖాళీగా కనిపిస్తున్న భావన రాకూడదని వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రెడీ అయ్యారు. అయితే, కొన్ని రోజులుగా శ్రద్ధాదాస్, ఈశారేబ్బా పేర్లు గట్టిగా వినిపించాయి. కానీ, రెండు రోజులుగా.. కొత్త పేరు వినిపిస్తూ వచ్చింది.

ఇక నాగార్జున పుట్టినరోజు సందడిలో ఉండి ఈ వారాంతంలో రమ్యకృష్ణ హోస్ట్ గా పంపించారు. రెండు రోజులూ ఆమె షో ని మరో మెట్టు పైకి ఎకిన్చారనే చెప్పాలి. ఆదివారం అయితే, ఆమె కేక పుట్టించారు. హుందాగా.. బాహుబలి శివగామిని ని గుర్తు తెచ్చే ఆహార్యంతో.. అల్లరి రమ్యకృష్ణ ని మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఆమె హౌస్ మేట్స్ తో కలసి ఉన్నంత సేపూ సందడి అదిరిపోయింది. ఇక నాగార్జున లేరని కాబోసు.. ఈవారం ఎలిమినేషన్స్ ని పక్కకు పెట్టేశారు. అదే విధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఆపారు. కానీ, ఈరోజు విడుదల చేసిన ప్రోమోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్నట్టు చూపిస్తున్నారు.

కొద్దిగంటల్లో ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ లో ఒక లేడీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతున్నట్టు చొప్పిస్తూ "ఎవరదీ.." అనే సౌండ్ ఇచ్చారు. అయితే, మన సోషల్ మీడియా లో అందరూ నీడను చూసి కూడా వారెవరో యిట్టె చెప్పేసే దిట్టలు.. దానికి తోడు రెండు రోజులుగా లీకులు.. ఆ ఎవరనేది చెప్పెస్తున్నాయి. ఎప్పుడో కనుమరుగైపోయిన.. మనమంతా మర్చిపోయిన శిల్పా చక్రవర్తి అనే యాంకర్.. ఎవరని ఆలోచిస్తున్నారా.. సుమ, ఝాన్సీ ల కాలం నాటి యాంకరమ్మ లెండి. వాళ్ళంతా నిలబడ్డారు. ఈవిడ గారు తెరమరుగైపోయింది. ఎన్టీ ఇంకా గుర్తుకు రాలేదా.. ఇటీవల రాక్షసుడు సక్సెస్ మీట్ వీడియోలు చూడండి ఆ భామ ఎవరో తెల్సిపోతుంది. లేదా లేటెస్ట్ అనూస్ యాడ్ చూసినా సరే. ఆ శిల్పా చక్రవర్తి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోన్దనేది అందరి మాట. అది నిజమో కాదో ఆవిడో కాదో తెలియాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories