Top
logo

శ్రీముఖి బిగ్ బాస్ విన్నర్ అవుతుంది అనుకున్నా: బాబా భాస్కర్

శ్రీముఖి బిగ్ బాస్ విన్నర్ అవుతుంది అనుకున్నా: బాబా భాస్కర్
X
Bigg Boss Baba Bhaskar
Highlights

బిగ్ బాస్ 3 లో ఆయనో పెద్ద మాస్కర్ అన్నారు.. జిత్తులమారి అన్నారు.. నటిస్తున్నాడు అన్నారు.. ఎవరేమన్నా.. ఎన్ని రకాలుగా విమర్శించినా తన పద్దతి మార్చుకోలేదు.

బిగ్ బాస్ 3 లో ఆయనో పెద్ద మాస్కర్ అన్నారు.. జిత్తులమారి అన్నారు.. నటిస్తున్నాడు అన్నారు.. ఎవరేమన్నా.. ఎన్ని రకాలుగా విమర్శించినా తన పద్దతి మార్చుకోలేదు. తనెలా ఉండాలనుకున్నాడో అలానే ఉన్నారు. నవ్విస్తూ.. ప్రేక్షకులను కవ్వించారు. వండి వడ్డిస్తూ తన సహచరులకు సంతృప్తి పంచారు. సై అంటే సై అంటూ టాస్కుల్లో పోటీ పడి అందరికీ షాకిచ్చారు. ఈ పాటికి అర్థం అయిపోయి వుంటుంది ఆయనెవరో..అవును బాబా భాస్కర్. నీరసించిన బిగ్ బాస్ 3 కి అయన పెద్ద ఎంటర్తైన్మెంట్ పంచ్! మాస్ స్టెప్పులతో ఆయనిచ్చిన జోష్ ఇప్పటికీ బిగ్ బాస్ ప్రేక్షకుల కళ్ళముందు మెదులుతూనే ఉంది. 17 మందితో పోటీ పది చివరి ఐదులో నిలిచి.. చివరికి మూడు తో సరిపెట్టుకున్నా.. బాబా భాస్కర్ అందరి మదిలోనూ చెరగని ముద్ర వేశారు.

బాబా భాస్కర్ బిగ్ బాస్ లో శ్రీముఖి విజేతగా నిలుస్తారని భావించారట. ఈ విషయాన్ని ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం వివరించారు. తనకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పిన్ ఆయన, తనకు బిగ్ బాస్ ప్రయాణం చాల నేర్పిందని చెప్పారు. తన జీవితంలో ఇదో పెద్ద పాఠం అన్నారు.

ఇంకా బిగ్ బాస్ సంగతుల గురించి మాట్లాడుతూ.. బిగ్ బాస్ సీజన్ 3 లో తనకు మూడో స్థానం దక్కడం సంతోషంగా ఉందన్నారు. వరుణ్, రాహుల్, శ్రీముఖి లలో ఎవరో ఒకరు గెలుస్తారని తాను భావించాననీ.. అందులో శ్రీముఖి కచ్చితంగా గెలిచే అవకాశం ఉందని అనుకున్నాననీ చెప్పారు. కనీ బిగ్ బాస్ లో మనం అనుకున్నది జరగదు కదా అన్నారు. రాహుల్ గెలవడమూ ఫర్వాలేదని చెప్పిన బాబా భాస్కర్ మంచి వాళ్ళను గెలిపిస్తే బావుండేదంటూనే, రాహుల్ కు మంఛి జరగాలని కోరుకుంటున్నట్టు వివరించారు.


Next Story