Bigg Boss 3 Telugu Updates: శ్రీముఖి అభిమానుల అత్యుత్సాహం రాహుల్ కి కలిసొచ్చిందా?

Bigg Boss 3 Telugu Updates: శ్రీముఖి అభిమానుల అత్యుత్సాహం రాహుల్ కి కలిసొచ్చిందా?
x
Highlights

వంద రోజులకు పైగా ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ చివరికి వచ్చేసింది. జోరుగా జరుగుతున్న ప్రచారం ప్రకారం రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ విజేతగా నిలిచినట్టు తెలుస్తోంది.

వంద రోజులకు పైగా ప్రేక్షకులను అలరించిన వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ చివరికి వచ్చేసింది. ఇక ఒక్కరోజులో బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఏభై లక్షలు ఎవరు గెల్చుకోబోతున్నారో తేలిపోనుంది. 17 మంది తొ ప్రారంభమై.. ఆటలు..పాటలు.. కోపాలూ..తాపాలూ.. యాక్షన్ లు రియాక్షన్ లు.. టాస్క్ లు.. రిస్కులు అన్నీ దాటుకుని చివరి వారానికి ఫైనల్స్ కి ఐదుగురు చేరారు. ఈ వారమంతా వారి బిగ్ బాస్ జర్నీ.. బయటకు వెళ్ళిన వారు హౌస్ లోకి వచ్చి చేస్తున్న హంగామా వంటి సరదాలతో గడిచిపోయింది. ఇక ఇప్పుడు విజేత ఎవరో తేలిపోయే రోజు దగ్గరకొచ్చేసింది.

రాహుల్ సిప్లిగంజ్..శ్రీముఖి..బాబా భాస్కర్..వరుణ్ సందేశ్.. అలీ రెజా ఈ ఐదుగురిలో గెలుపెవరిది? ఇప్పడు బిగ్ బాస్ అభిమానుల్లోనే కాదు.. బుల్లితెర అభిమానులందరిలోనూ నెలకొని ఉంది. ఇక గెలిచేది వీరే అంటూ సోషల్ మీడియాలో గత నాలుగు రోజుల్లోనూ ప్రచారమూ హోరెత్తుతోంది. ప్రేక్షకుల ఓట్లు కోసం బిగ్ బాస్ బయటకు వెళ్ళిపోయిన వారు కూడా తమ కిష్టమైన వారికి కావలసినంత ప్రచారం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి.. ప్రేక్షకులలో నెలకొన్న అభిప్రాయాలూ.. ఓటింగ్ సరళిపై అందుతున్న లీకులు.. మొదట్నుంచి బిగ్ బాస్ ఎలిమినేషన్ ఎవరనేది ముందుగానే చెబుతూ వస్తున్న లీకువీరులు అందిస్తున్న సమాచారాన్ని క్రోడీకరించి చూస్తే పోటీ రాహుల్ సిప్లిగంజ్.. శ్రీముఖిల మధ్యే ఉన్నట్టు తెలుస్తోంది.

బయటకు వెళ్లి వైల్డ్ గా వచ్చినా ఫలితం లేదు..

అలీ రెజా తన ప్రవర్తనతో ఒకసారి ప్రేక్షకుల కోపానికి గురై ఎలిమినేట్ అయ్యారు. అయితే, వైల్డ్ కార్డ్ పేరుతో మళ్లీ వచ్చారు అలీ. కానీ, మొదటిసారి ఏ తప్పైతే చేశారో అదే తప్పు మళ్లీ చేసి.. ఓటింగ్ లో చిట్ట చివరికి పడిపోయారని తెలుస్తోంది. బిగ్ బాస్ లో అందరికంటే, తక్కువ ఓట్లు అలీ రేజాకే వచ్చినట్టు సమాచారం. దీంతో, ఐదో స్థానంలో అయన ఆగినట్టు అర్థం అవుతోంది.

భార్య లేక వెనకబడ్డారా?

బిగ్ బాస్ చరిత్రలో భార్యా భర్తలు పోటీదారులుగా మొదటిసారి ఈ సీజన్ లో వైవిధ్యంగా ఎంట్రీ ఇచ్చారు వరుణ్ సందేశ్ తన భార్య వీటిక షేరు తొ కల్సి. అమె చివరి వారానికి ముందు ఎలిమినేట అయ్యారు. అంత వరకూ లాక్కొచ్చిన వరుణ్ ఆతరువాత డీలా పడినట్టు కనిపించారు. దీంతో ప్రేక్షకులు కూడా అయన విషయంలో పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ఓటింగ్ సరళి ప్రకారం ఈయన నాలుగో స్థానం తొ సరిపెట్టుకోవలసి వస్తుందని చెప్పుకుంటున్నారు.

జీరోగా వచ్చి హీరోగా మారినా..

అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి పడ్డ పోటీదారు బాబా భాస్కర్. ఈయన తన నడత తొ బయట ప్రేక్షకుల నుంచే కాకుండా..ఇంటి సభ్యుల నుంచి కూడా మంచి మార్కులు సాధించేశారు. ఈ సీజన్ లో బిగ్ బాస్ లో వినోదాన్ని పంచిన ఏకైక పోటీదారుగా అందరి అభిమానాన్నీ సంపాదించుకున్నారు. ఫైనల్స్ కు చేరిన రెండో పోటీదారుగా నిలిచారు. ఈయనకు బ్యత్క లాబీయింగ్ చేసి ఓటింగ్ వేయిన్చేంత్రాంగం లేదు. కానీ తన మంచితనంతోనే ఫైనల్స్ వరకూ చేరుకున్నారు. అయితే, ఫైనల్స్ లో ఆ అభిమానం సరిపోదు.. ఆయనకు అదే అజ్రిగినట్టు తెలుస్తోన్దిఒ. అతి తక్కువ తేడాతో అయన మూడో స్థానంలో ఆగిపోయినట్టు లీకు వీరుల సమాచారం.

ఆ ఇద్దరి మధ్యా.. నువ్వా..నేనా?

ఇక రాహుల్ సిప్లిగంజ్..శ్రీముఖి ఇద్దరి మధ్యలో నువ్వా నేనా పోటీ ఓటింగ్ ముగిసేవరకూ సాగినట్టు విపరీతంగా ప్రచారం సాగుతోంది. ఒకదశలో శ్రీముఖి విజేత గా నిలిచినట్టు తెలిసింది. కానీ, ఓటింగ్ ప్రక్రియముగిసేసరికి ఆమెను దాటి రాహుల్ ముందుకు చేరిపోయాడని తాజా సమాచారం. ప్రస్తుతం బలంగా వినిపిస్తున్న లీకుల సమాచారాన్ని బట్టి ఈ బిగ్ బాస్ విజేత గా నిలుస్తోంది రాహుల్ సిప్లిగంజ్ అని తెలుస్తోంది. రెండు రోజులుగా శ్రీముఖి విజేత అని సోషల్ మీదియాలో మార్ఫింగ్ ఫొటోలతో జరిగిన ప్రచారం శ్రీముఖి విజయావకాశాల మీద తీవ్ర ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా శుక్రవారం రాహుల్ కు ఓట్ల వర్షం కురిసిందని లీకులు విపరీతంగా ప్రచారం అవుతున్నాయి.

మొత్తమ్మీద ఇప్పటివరకూ అందుతున్న సమాచారం..జోరుగా జరుగుతున్న ప్రచారం రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ విజేతగా నిలిచినట్టు చెబుతున్నాయి. మరి ఎవరు ఆ కిరీటం దక్కించుకున్నారో తెలియాలంటే ఇంకోక్క రోజు ఆగాల్సిందే!



Show Full Article
Print Article
More On
Next Story
More Stories