Top
logo

హవ్వ.. వితికా ఇంత అన్యాయమా? బిగ్ బాస్ కెమెరాలు కళ్ళుమూసుకున్నాయా?

హవ్వ.. వితికా ఇంత అన్యాయమా? బిగ్ బాస్ కెమెరాలు కళ్ళుమూసుకున్నాయా?
Highlights

ప్రేక్షకుల్ని పిచ్చోళ్ళని చేసే ఆటలు చాలానే ఉంటాయి. వాటిలో బిగ్ బాస్ ఒకటనేది చాలామంది నమ్మకం. విజేత ఎవరుకావాలో.. ఎవరు చివరివరకూ పోరాటంలో కనిపించాలో ముందే నిర్ణయించుకుని, దానికి తగ్గట్టుగా వారం వారం ఎపిసోడ్ లు తయారు చేసుకుని.. ఆ స్క్రిప్ట్ కి అనుగుణంగా షో నడిపించడమే బిగ్ బాస్.

ప్రేక్షకుల్ని పిచ్చోళ్ళని చేసే ఆటలు చాలానే ఉంటాయి. వాటిలో బిగ్ బాస్ ఒకటనేది చాలామంది నమ్మకం. విజేత ఎవరుకావాలో.. ఎవరు చివరివరకూ పోరాటంలో కనిపించాలో ముందే నిర్ణయించుకుని, దానికి తగ్గట్టుగా వారం వారం ఎపిసోడ్ లు తయారు చేసుకుని.. ఆ స్క్రిప్ట్ కి అనుగుణంగా షో నడిపించడమే బిగ్ బాస్. ఇది బాగానే ఉంది. కానీ దీనిలో ప్రేక్షకులను వెర్రోళ్లను చేయడమే ఇప్పడు వివాదాస్పదంగా కనిపిస్తోంది. ఎదో షోకి తగ్గట్టుగా అన్నీ నడిపించి ప్రశారం చేస్తే పెద్దగా ఆలోచించనవసరం లేదు. కానీ, బిగ్ బాస్ మాత్రం ప్రేక్షకులను ఇందులో ఇన్వాల్వ్ చేస్తుంది. వారి నుంచి ఓటింగ్ అడిగి ఆ ఓటింగ్ కి అనుగుణంగా హౌస్ లో ఎవరు కొనసాగాలి నిర్ణయిస్తామని చెబుతున్నారు. ఆరకంగా అందర్నీ మభ్య పెట్టె వారు చేయాలనుకున్నది చేయడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బిగ్ బాస్ సీజన్ 3 లో 75 ఎపిసోడ్ లు పూర్తయిపోయాయి. పదిహేనుతో ప్రారంభం అయి తొమ్మిది కి చేరింది. ఇప్పుడు వీరిలో ఎవరు ఫైనల్స్ వరకూ వెళతారనేది అందరికీ ప్రతిరోజూ ఉత్కంఠ కలిగించాలి. కానీ.. జరుగుతున్న పరిణామాలు మాత్రం ఏ మాత్రం ఉత్కంఠ కలిగించడం లేదు. ఎందుకంటే.. పునర్నవి వంటి వారు హౌస్ లో కొనసాగేలా బిగ్ బాస్ ప్లాన్ చేయడం. వితిక షేరు ఫైనల్ కి వెళ్లాలని ప్రత్యేక పథకం తయారు చేయడం. ఈ క్రమంలో నిజాయతీగా కష్టపడి ఆడుతున్న బాబా భాస్కర్ ను అల్లరి చేసి.. తప్పుడు విధానాలతో నిలువరించాలని ప్రయత్నించడం ప్రేక్షకులకు మింగుడు పాడడం లేదు.

గేమ్ అఫ్ మేడాలియన్ అనే పేరుతొ ఇమ్యూనిటీ టాస్క్ ఇప్ప్పుడు నిర్వహిస్తున్నాడు బిగ్ బాస్. అందులో భాగంగా రెండు గేమ్ లు ఆడించాడు. మొదటి గేమ్ గ్రూప్ గేమ్ లాంటిది. దానిలో పునర్నవి ఆధ్వర్యంలో గ్రూప్ వీతికను విజయవంతంగా గెలిపించింది. ఇక రెండో గేమ్ స్టామినా పరీక్షించే గేమ్ దానిలో శ్రీముఖి, అలీ, శివజ్యోతి చేతులెత్తేస్తే.. బాబా భాస్కర్ ఒక రోజంతా నిలబడి సత్తా చూపించి గెలిచారు. ఈ క్రమంలో కూడా వితిక ను హైలెట్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది. ఎవర్ని ఎక్కువ ఇష్టపడతారు అనే మెలిక పెట్టి బాబా పై గుడ్లు కొట్టించాడు బిగ్ బాస్. కచ్చితంగా బాబా పై గుడ్లు పడతాయనేది ఎవర్ని అడిగినా చెబుతారు. అంటే, గ్రూపు గా బాబా భాస్కర్ వీక్. పునర్నవి ఆధ్వర్యంలో భాగోతం గ్రూపు మొదటి నుంచి ప్రత్యేకంగా ఆడుతోంది.

సరే ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు తాజాగా నిన్న ముగిసిన ఎపిసోడ్ లో వితిక, బాబా భాస్కర్ మధ్య రిక్షా టాస్క్ పెట్టారు. దీని ప్రకారం ఈ ఇద్దరూ రిక్షాలో ఎక్కువ సేపు ఎవరు కూచుంటే వారు గెలిచినట్టు. మధ్యలో వారికి రకరకాల టాస్క్ లు ఇచ్చరుల్. అన్నిటినీ ఇద్దరూ విజయవంతంగా దాటేశారు. ఫైట్ టఫ్ గా మరీనా దశలో వితిక బాబా భాస్కర్ ను రిక్షా నుంచి కిందకు తోసేసింది. దాంతో బాబా అవుట్ అయ్యారని రిఫరీగా వ్యవహరించిన పునర్నవి (అసలు పునర్నవి రిఫరీ ఏమిటో ఎవరికీ అర్థం కాదు. ఒక్క టాస్క్ కూడా సరిగ్గా ఆడకుండా.. రాహుల్ తో కల్సి పులిహోర తాలింపు పెట్టె పునర్నవి రిఫరీ ఏమిటని అందరూ నవ్వుకున్నారు) ప్రకటించి బాబా భాస్కర్ ని పరాజితుడిని చేసి.. వితికను విజేతను చేసేసింది.

ఇప్పుడు అసలు ప్రశ్న వితిక గెలుపు ఒక గెలుపేనా అనేది. రూల్స్ లో తోయకూడదని లేదు కాబట్టి తోసేశాను అనేది ఆమె వాదన..నిజమే తోయాలని అందులో లేదు. నిజానికి అలా తోసుకుని అవకాశం ఉంది అంటే.. వితిక బాబా భాస్కర్ బలం ముందు ఒక్క నిమిషం కూడా ఆగలేకపోయేది. కానీ, నిజాయతీగా ఆడిన బాబా ను అవుట్ చేయడానికే బిగ్ బాస్ ఈ రకమైన ప్రయత్నం చేశాడనేది స్పష్టం అవుతోంది. నిన్న ఈ గేమ్ జరిగిన విధానం చూసిన బిగ్ బాస్ ప్రేక్షకులకు ఒక విషయం స్పష్టం అయింది. ఫైనలిస్ట్ లు వితిక, వరుణ్ కచ్చితంగా ఉంటారని. ఇక బాబా భాస్కర్ బయటకు పంపించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని.

ఇక్కడ స్పష్టంగా తేలిన విషయం వితిక, వరుణ్ ల లో ఒకర్ని విజేతలుగా ప్రకటించాలనే లక్ష్యం బిగ్ బాస్ కి చాలా స్పష్టంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక అటువంటప్పుడు ఈ ఓటింగ్.. చీటింగ్ ఎందుకని ప్రేక్షకులు సూటిగానే అడుగుతున్నారు.

వితిక ఇప్పుడు గెలిచినా గెలుపు నిజాయతీ అని భావిస్తే.. భవిష్యత్ లో చాలా గేమ్స్ ఇటువంటివి చూడాల్సి రావచ్చుననేది సుస్పష్టం. ఇక 25 రోజులు ఎన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో? నాగార్జున ఈ శనివారం ఆదివారం వితిక చేసిన పనిని ఏ విధంగా సమర్థిస్తారా చూస్తే.. ప్రేక్షకులకు ఈ సీజన్ బిగ్ బాస్ ఎవరు గెలుస్తారో కచ్చితంగా ఓ అంచనాకి వచ్చేస్తారు. ఇక ఇప్పటి వరకూ ఎవరు బయటకు వెళతారో ముందే తెలుస్తున్న క్రమంలో ఆదివారం మహేష్ బయటకు వెళ్లడం దాదాపు ఖాయం అని అందరూ చెప్పుకుంటున్నారు.

కొసమెరుపేమిటంటే.. అసలు ఆట ఆడకుండా చేతులెత్తేసి.. పులిహోర కలిపేసి.. రొమాన్స్ చేసేసి.. ఫైనల్స్ కి వెళ్లిపోయే లిస్టులో పునర్నవి భూపాలం రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారనేది ఓ టాక్. ఇదీ నిజమే కావచ్చు.. వింటున్నావా జ్యోతక్కా.. అనవసరంగా ఏడ్చి కన్నీళ్లు వెస్ట్ చేసుకోకు.. నువ్వు.. నీ తమ్ముడు అలీ, శ్రీముఖి తోపులు కాదు.. బిగ్ బాస్ లెక్కల్లో ఆటలో అరటిపళ్ళు మాత్రమే.. ఇంకా చెప్పాలంటే నీ ఏడుపుల ఎపిసోడ్ లు.. అలీ రీఎంట్రీలు అన్నీ బిగ్ బాస్ కథకి కరివేపాకులు మాత్రమే అంటున్నారు ప్రేక్షకులు!


Next Story