Bigg Boss 3 Telugu Gossips: బిగ్ ట్విస్ట్.. ఈరోజు డబుల్ ఎలిమినేషన్.. వితిక వెళ్లిపోవడం ఖాయం.. మరి రెండో వారెవరబ్బా?
బిగ్ బాస్ ప్రీ క్లైమాక్స్ మొదలైంది. దానికి తగ్గట్టుగానే ఈ వారంలో బిగ్ బాస్ ఎలిమినేషన్ కి నామినేషన్ లో బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా హౌస్ మేట్స్ అందర్నీ నామినేషన్ లోకి పంపించేశాడు. వారితో ఆటలు కూడా సరదాగా ఆడించాడు. తరువాత హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపించి సందడి చేయించాడు.
బిగ్ బాస్ ప్రీ క్లైమాక్స్ మొదలైంది. దానికి తగ్గట్టుగానే ఈ వారంలో బిగ్ బాస్ ఎలిమినేషన్ కి నామినేషన్ లో బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా హౌస్ మేట్స్ అందర్నీ నామినేషన్ లోకి పంపించేశాడు. వారితో ఆటలు కూడా సరదాగా ఆడించాడు. తరువాత హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపించి సందడి చేయించాడు. ఇక శనివారం ఎపిసోడ్ లో అందరితో మళ్ళీ నెంబర్ గేమ్ ఆడించారు నాగార్జున. ఎలిమినేషన్ నుంచి ఎవరు సేవ్ అయ్యారనేదీ వెరైటీగా చెప్పించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులను పిలిపించి వారి ద్వారా గిఫ్ట్ లు ఇప్పించి మరీ వారిలో ఎవరు సేవ్ అవుతారనేది తేల్చారు.
ఇక్కడ ఇంకో తిరకాసు కూడా పెట్టారు నాగార్జున. ఎవరు ఏ నెంబరుకు అర్హులో చెప్పాలనీ, కారణం చెప్పాలనీ కోరిన నాగార్జున.. అందుకు తన ఎదురుగా ఉన్న ప్రేక్షకులు ఎంత మేరకు కరెక్ట్ అంటున్నారో చెప్పించారు. ఈ రకంగా గత ఎలిమినేషన్ కి నామినేషన్ సమయంలో హౌస్ మేట్స్ వారికి వారు అనుకున్న నెంబర్లను ప్రేక్షకులు లేదా బిగ్ బాస్ స్రినివిగా భావించడం లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.
ఇదిలా ఉంటె ఈ వారం నామినేషన్ లో కూడా బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టు కనిపిస్తోంది. ఈవారం నామినేషన్ లో ఏడుగురు సభ్యులు ఉన్నప్పటికీ.. వారిలో ముగ్గురు సేఫ్ జోన్ లో ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించారు. శ్రీముఖి, బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్ ఈ వారం ఎలిమినేషన్ లో లేరు. ఇక మిగిలిన వరుణ్, వితిక, అలీ, శివజ్యోతి ఈ నలుగురిలో ఎవరు ఈ వారం వెళ్ళిపోతారనేది ప్రశ్న. అయితే, ఇప్పటికే సామాజిక మాధ్యమాలు.. ఎలిమినేషన్ జోస్యులు.. వితిక కచ్చితంగా ఈవారం బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిపోతుందని మౌసులూ, కీబోర్డులూ గుద్ది మరీ చెప్పేస్తున్నారు. కానీ, ఈ వారం వితిక తో పాటూ మరొకరు కూడా బయటకు వెళ్లే ఛాన్స్ ఉందని తాజా గా తెలుస్తోంది. విశ్వసనీయంగా చెప్పుకుంటున్నదాన్ని బట్టీ.. ఈ వారం ప్రోమో ను బట్టీ ఇద్దరు కచ్చితంగా ఎలిమినేటి అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండడం హౌస్ లో ఏడుగురు సభ్యులు ఉండడడంతో ఈ వారామె డబుల్ ఎలిమినేషన్ ఉండాలని బిగ్ బాస్ చూస్తున్నట్టు తెలుస్తోంది.
డబుల్ ఎలిమినేషన్ పక్కా అయితే కనుక అందులో ఒకరు వితిక అనేది ఎలానూ తేలిపోయింది.. ఇక రెండో సభ్యుడు ఎవరనేది ప్రశ్న. వితిక వెళ్ళిపోతోంది కాబట్టి వరుణ్ ఎట్టి పరిస్థితి లోనూ వెళ్లే ఛాన్స్ లేదు. ఇక అలీ, శివజ్యోతి లలో శివజ్యోతిని బయటకు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయనేది ఇప్పటివరకూ అందుతున్న సమాచారం. కానీ, శనివారం ఎపిసోడ్ లో చాలా మంది కోరుకున్నది అలీ వెళ్లిపోవాలని.. మరి ఇప్పుడు రెండో ఎలిమినేషన్ ఉంటె కనుక ఎవరు వెళ్ళిపోతారనేది పెద్ద ప్రశంగానే ఉంది. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం వితిక తో పాటు శివజ్యోతి వెళ్ళిపోతుందని తెలుస్తోంది.
మరి ఎవరు ఉంటారో.. ఎవరు వెళతారో తేలానంటే మరి కొద్దీ గంటలు వేచి చూడాల్సిందే!
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire