చిరంజీవి..నాగార్జున ఇద్దరూ కల్సి రేటింగుల దుమ్ము దులిపారుగా!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఫినాలే రికార్డ్ సృష్టించింది. దేశంలో బిగ్ బాస్ ఏ ఎపిసోడ్ కీ రానటువంటి టీఆర్ఫీ రేటింగ్ సాధించింది.
వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలను సృష్టించిన షో. ఈ షో మన దేశంలోనూ ఒక ఊపు ఊపుతోంది. వివాదాలు..విమర్శలూ అన్నిటినీ తట్టుకుని బిగ్ బాస్ మన దేశంలో పలు భాషల్లో ప్రసారం అవుతూ, ఎన్నో సంచలనాలు రేపుతోంది. తెలుగులో బిగ్ బాస్ ఇప్పటి వరకూ మూడు సీజన్ లు పూర్తయ్యాయి. మూడో సీజన్ ఈ మధ్యనే గ్రాండ్ ఫినాలేతో అద్భతంగా ముగిసింది. ఈ సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచారు.
ఇప్పటివరకూ తెలుగులో బిగ్ బాస్ మూడు సీజన్ లకు ప్రముఖ తెలుగు వెండితెర హీరోలు హోస్ట్ లుగా వ్యవహరించారు. మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ తన దూకుడైన విధానంతో ప్రాణం పోశారు. ఇక రెండో సీజన్ కు నాచురల్ స్టార్ నానీ తనదైన చిలిపి స్టైల్ లో రక్తి కట్టించారు. ఇక మూడో సీజన్ కు సీనియర్ స్టార్ మన్మధుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. తనదైన స్టైల్ లో.. హుందాగా.. రసవత్తరంగా షో ను ముందుకు తీసుకు పోయారు.
ఇక మూడో సీజన్ ఫైనల్స్ మాత్రం ఒక రేంజిలో జరిగాయి. మొదట అలా అలా మొదలై..చివరికి వచ్చేసరికి ప్రేక్షకులను ఉర్రూతలూగించి మాయలో పడేసింది మూడో సీజన్ ఫైనల్స్. నాగార్జున కు తోడుగా హీరో శ్రీకాంత్, దర్శకుడు మారుతి, హీరోయిన్ రాశీ ఖన్నా, అంజలి వరుసగా వచ్చి ప్రేక్షకులను అలరించారు. ఇక విజేతను ప్రకటించడానికి, షీల్డ్ ఇవ్వడానికి మెగా స్టార్ చిరంజీవి వచ్చారు. ఆయన వచ్చిన తరువాత బిగ్ బాస్ స్టేజ్ సీన్ మారిపోయింది. అప్పటిదాకా ఓ లెక్క.. అప్పట్నుంచి మరో లెక్క గా మారిపోయింది. నాగార్జున, చిరంజీవి ఇద్దరూ కలిసి కార్యక్రమాన్ని తమ అనుభవంతో ఒక రేంజి లోకి తీసుకు వెళ్లారు. ఇదంతా అందరికీ ఇంకా గుర్తుండే ఉంటుంది.
ఇకపోతే, ఇప్పుడు ఆ షో కి వచ్చిన టీఆర్పీ రేటింగ్స్ చూస్తె చిరంజీవి, నాగార్జున చేసిన అద్భతం విలువ తెలుస్తుంది. ఇప్పటివరకూ మన దేశంలో ఏ భాషలోనూ బిగ్ బాస్ ఒక ఎపిసోడ్ కి రానంత టీఆర్పీ రేటింగ్ బిగ్ బాస్ తెలుగు ఫినాలెకు వచ్చాయి. ఈ విషయాన్ని షో నిర్వహించిన ఎండేమాల్ షైన్ ఇండియా తన ట్విట్టర్ లో వెల్లడించింది. ఆ ఫినాలే ఎపిసోడ్ కి 18.29 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇదే విషయాన్ని స్టార్ మా కూడా తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. ఇప్పటివరకూ మన దేశంలో ఏ బిగ్ బాస్ ఎపిసోడ్ కి ఇంత స్థాయిలో టీఆర్పీ రేటింగ్ రాలేదట.
ఇక ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, ఈ ఎపిసోడ్ మొత్తం 4.5 గంటలకు వచ్చిన టీఆర్పీ ఇది. అయితే, చిరంజీవి వచ్చిన తరువాత చివరి అరగంటలో టీఆర్పీ 20.23 రేటింగ్ వచ్చిందట. నాగర్జున తొ కలసి చిరంజీవి మాయ చేశారనే చెప్పాలి. ఇప్పుడు మెగా అభిమానులు చిరంజీవి వల్లే ఇంత రేటింగ్ వచ్చిందని సంబరాపదిపోతున్నారట.
#BiggBossTelugu Season 3 Finale scores a TRP of 18.29 for 4.5 hours. Congratulations team #BBTelugu and @StarMaa!! The highest ever TRP of any BB across India.@Abhishek_S_Rege @iamnagarjuna @GauravS_Gokhale pic.twitter.com/FTQ4Di7nDd
— Endemol Shine India (@EndemolShineIND) November 14, 2019
Keywords: Bigg Boss 3 Telugu TRP ratings Record, Megastar in Bigg Boss finale, Bigg Boss grand finale, Nagarjuna, Bigg Boss Finale TRP ratings


