Bigg Boss 3 Telugu Episode 94: మూల్యం చెల్లించుకున్న అలీ.. ఫినాలేలోకి రాహుల్!

Bigg Boss 3 Telugu Episode 94: మూల్యం చెల్లించుకున్న అలీ.. ఫినాలేలోకి రాహుల్!
x
Highlights

బిగ్ బాస్ షో ఆసక్తికరంగా మారిపోయింది. ప్రాణాలకు తెగించి మరీ హౌస్ మేట్స్ పోరాటం చేస్తున్నారు. కొట్టుకు చచ్చేలాంటి టాస్క్ లు ఇచ్చి.. మళ్లీ విజిల్ వేసి మరీ వాళ్ళని నివారిస్తూ వస్తున్నాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ షో ఆసక్తికరంగా మారిపోయింది. ప్రాణాలకు తెగించి మరీ హౌస్ మేట్స్ పోరాటం చేస్తున్నారు. కొట్టుకు చచ్చేలాంటి టాస్క్ లు ఇచ్చి.. మళ్లీ విజిల్ వేసి మరీ వాళ్ళని నివారిస్తూ వస్తున్నాడు బిగ్ బాస్. ఇక అలీ టికెట్ టు ఫినాలేలో సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. రాహుల్ నిదానంగా ఆడి ఫినాలే టికెట్ ఎగరేసుకు పోయాడు. నిజంగానే తాబేలు కుందేలు కథని గుర్తుచేస్తున్నాడు రాహుల్. ఇవీ ఈ ఎపిసోడ్ విశేషాలు.

గత ఎపిసోడ్ కి కొనసాగింపుగా బాబా భాస్కర్, అలీ ల మధ్య పూలు తొట్టెలో ఉంచే టాస్క్ జరిగింది. ఇక ఈ టాస్క్ లో తొట్టెలో పూలు పెట్టడానికి ప్రయత్నిస్తున్న బాబా భాస్కర్ ను అలీ తన కండబలం తో నిలువరించడానికి ప్రయత్నించాడు. దానికి బాబా కూడా తీవ్రంగా ప్రతిఘటించాడు. ఎంతలా అంటే.. అలీ బలంగా నెట్టేస్తే ఆమడ దూరంలో పడిపోయినా, దెబ్బలు తగిలినా మళ్లీ తన పూలను తొట్టెలో పెట్టె ప్రయత్నం చేస్తూ వచ్చాడు. దీంతో బిగ్ బాస్ చేసింది చాలు అంటూ ఇద్దర్నీ ఆపు చేసి టాస్క్ ని రద్దు చేశాడు. తరువాత అలీని టికెట్ టు ఫినాలే గేమ్ నుంచి బయటకు పంపించేశాడు. దీంతో టికెట్ కచ్చితంగా కొట్టాల్సిన అలీ ఏ గేమ్ ఆడకుండా ఉండిపోవాల్సి వచ్చింది.

ఫినాలేకి తొలి టికెట్ రాహుల్ కే!

ఎనర్జీ గేమ్ లో 50 శాతం ఎనర్జీ నిలబెట్టుకున్న రాహుల్ సిప్లిగంజ్ కి టికెట్ టు ఫినాలే దొరికింది. దీంతో బిగ్ బాస్ సీజన్ 3 లో తొలి ఫైనలిస్ట్ గా రికార్డు సృష్టించాడు రాహుల్. బిగ్ బాస్ అందించిన టికెట్ అందుకున్న రాహుల్ తన తల్లిని తలుచుకున్నాడు. అమ్మా.. టాస్క్ లు ఆడాలి అని నువ్వు చెప్పిన మాట ప్రకారం టాస్క్ ఆడాను. ఫినాలే టికెట్ సంపాదించుకున్నాను అంటూ మురిసిపోయాడు.

నా గంట నేనే కొట్టుకున్నాను..

ఇక అలీ, వరుణ్, రాహుల్, మధ్య సరదా సంభాషణ నడిచింది. అరె.. నా గంట నేనే కొట్టుకున్నారా భయ్ అంటూ అలీ సరదాగా వాపోయాడు. ఇంక నాకు ఇంటికి వెళ్లి గంట కొట్టుకోవడమే మిగిలింది అంటూ ఫన్నీగా మాట్లాడాడు. ఇదే సమయంలో రాహుల్ నాకు టికెట్ వచ్చింది అంటూ చెప్పబోయాడు. అదే విషయాన్ని అప్పటికే చాలాసార్లు రాహుల్ చెప్పాడు. దీంతో అలీ.. ఎన్నిసార్లు చేబుతావురా కొత్తగా ఏదన్నా చెప్పు అన్నాడు. బిగ్ బాస్ నన్ను టికెట్ ఇచ్చి మెచ్చుకున్నాడు అని మళ్లీ అదే విషయం చెప్పడంతో అందరూ సరదాగా నవ్వుకున్నారు.

మొత్తమ్మీద క్లైమాక్స్ వేడి బిగ్ బాస్ హౌస్ లో బాగానే రాజుకుంది. బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ లు ఇచ్చి హౌస్ మేట్స్ ని రెచ్చ కొడుతున్నాడు. కానీ, అలీ తప్ప అందరూ కూల్ గానే ఆడుతున్నారు. టాస్క్ ని సీరియస్ గా తీసుకున్నా.. డిప్లమసీ చూపిస్తున్నారు. శ్రీముఖి, అలీ మధ్యలో జరిగిన టాస్క్ లో ఈవిషయం స్పష్టమైంది. మరి ఇదే పద్ధతిలో ఎంతవరకూ ఉంటారో.. బిగ్ బాస్ ఇంకెంత క్రూరమైన గేమ్ లు ఆడిస్తాడో వేచి చూడాల్సిందే!

ఈవారం బిగ్ బాస్ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోతారని మీరు భావిస్తున్నారు (ఇది అధికారిక ఓటింగ్ కాదు)



Show Full Article
Print Article
More On
Next Story
More Stories