Bigg Boss 3 Telugu Episode 91: నామినేషన్స్ లో ఆ నలుగురు.. ఇప్పుడు ఆట అదిరింది!

Bigg Boss 3 Telugu Episode 91: నామినేషన్స్ లో ఆ నలుగురు.. ఇప్పుడు ఆట అదిరింది!
x
Highlights

వీకెండ్ బిగ్ బాస్ నాగార్జున ఎంట్రీతో హుషారుగా మొదలైంది. అంతే హుషారుగా సాగింది. 13 వ వారం ఎలిమినేషన్ ఎవరు అనే దానిపైనే ఈ ఎపిసోడ్ ఆసక్తిని క్రియేట్ చేశారు.

వీకెండ్ బిగ్ బాస్ నాగార్జున ఎంట్రీతో హుషారుగా మొదలైంది. అంతే హుషారుగా సాగింది. 13 వ వారం ఎలిమినేషన్ ఎవరు అనే దానిపైనే ఈ ఎపిసోడ్ ఆసక్తిని క్రియేట్ చేశారు. నంబర్ గేమ్ ఆడించిన నాగార్జున.. ఈవారం సేఫ్ జోన్ లో ఎవరున్నారనేది హౌస్ మేట్స్ కు సర్ప్రైజింగ్ గా చెప్పారు. ఆద్యంతం సరదాగా సాగిన ఎపిసోడ్ విశేషాలివే..

ఎవరు బయటకు వెళతారో?

ఇదే బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరిలోనూ ఆసక్తిగా జరిగిన చర్చ. వితిక, వరుణ్ లు ఒకరికొకరు అప్పగింతలు చెప్పుకున్నారు. ఇక బాబా భాస్కర్, శ్రీముఖిలు ఎవరు వేలిపోతారనేదానిపై ఆసక్తికరంగా చర్చించుకున్నారు. బాబా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ శ్రీముఖి పాటపాడి అల్లరి చేసింది. ఇక శివజ్యోతి, రాహుల్ చాలా చర్చ నడిపించారు. శివజ్యోతి నువ్వు బిగ్ బాస్ లో ఉంటానని అనుకుంటున్నావా అంటూ రాహుల్ ని అడిగింది. దానికి ఉంటానని ఉంది కానీ, అది బయటకు చెబితే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారని సమాధానం ఇచ్చాడు.

ఎవరి నెంబర్ ఎంత?

నాగార్జున ఈసారి నంబర్ గేమ్ ఆడించారు. ఏడు నంబర్లలో తమకు ఏ నంబర్ కరక్ట్ అనుకుంటున్నారో హౌస్ మేట్స్ ఒక్కొక్కరు చెప్పాలి. దానికి బిగ్ బాస్ అక్కడ చూస్తున్న ప్రేక్షకులు అవునా కాదా చెబుతారు. వితిక తనకు నంబర్ 3 ఇచ్చుకుంది. శ్రీముఖి తనకు నంబర్ 1 ఇచ్చుకుంది. ఈ సమయంలో రాహుల్ కి, శ్రీముఖికి మధ్య ఆసక్తికర చర్చ నాగార్జున సమక్షంలో జరిగింది. ఇక శివజ్యోతి తనకు తాను 1 ఇచ్చుకుంది. తానే సరిగ్గా ఆడుతున్నానని చెప్పుకొచ్చింది. బాబా భాస్కర్ 3 నంబర్ ఇచ్చుకున్నారు. ఇక అలీ కూడా 1 ఇచ్చుకున్నాడు.

చివరిలో ఉండే ఆ ఇద్దరు ఎవరు?

హౌస్ మేట్స్ కుటుంబీకులు, స్నేహితులు ఈ ఎపిసోడ్ లోనూ బిగ్ బాస్ కి వచ్చారు. అయితే, వారు నాగార్జున తో స్టేజ్ మీద నుంచే తమ వారిని పలకరించి, గిఫ్ట్ లు ఇచ్చి వెళ్ళారు. ఈసారి వీరితో గేమ్ ఆడించారు నాగార్జున. ఒక బోర్డుపై ఏడుగురు హౌస్ మేట్స్ ఫోటోలు ఉంచారు. వాటిలో నుంచి రెండు ఫోటోలు తీసి పక్కనే ఉన్న బోర్డు పై అతికించాలి. వారికి 6,7 స్థానాలు ఇచ్చి కారణం చెప్పాలి. ఆ తరువాత తమ వారితో మాట్లాడే అవకాశం కల్పించారు. ఇక వారు తెచ్చిన గిఫ్ట్ తో పాటు ఎవరు సేఫ్ అనే విషయం ఉన్న కార్డు కూడా జత చేశారు.

మొదట వరుణ్ చెల్లి వచ్చింది. శివజ్యోతి, అలీలకు 6,7 స్థానాలు ఇచ్చింది. అనంతరం ఆమె తెచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేశాడు వరుణ్. అయితే, ఆటను సేఫ్ కాలేకపోయాడు. శ్రీముఖి తండ్రి రామకృష్ణ వచ్చారు. అయన కూడా శ్రీముఖి అంత అల్లరీ చేశారు. అయన తెచ్చిన గిఫ్ట్ ను రాహుల్ తో ఓపెన్ చేయించారు. దానితో పాటు శ్రీముఖి సేవ్ అయినట్టు వచ్చిన కార్డూ రాహుల్ తీశాడు.

వితిక తల్లి భీమవరం నుంచి వచ్చారు. తన అల్లుడు వరుణ్ బంగారం అని చెప్పారు. అందరూ బాగా ఆడుతున్నారని చెప్పిన ఆమె.. మీరు అక్కడ జరిగిన గొడవలు అక్కడే మర్చిపోండి. బయటకు తీసుకురాకండి అని సలహా చెప్పారు. బయటకు వచ్చిన తరువాత భీమవరం రావాలనీ, అందరికీ భీమవరం వంటలు రుచి చూపిస్తాననీ ఆమె చెప్పారు. వితికాకి ఇచ్చిన గిఫ్ట్ లో వితికా పేరు లేదు. దాంతో ఆమె సేవ్ కాలేకపోయింది.

పటాస్ రవి.. సింగర్ నోయల్ సందడి!

అలీ కోసం అతని దోస్త్ పటాస్ రవి స్టేజి పైకి వచ్చాడు. పిచ్చ అల్లరి చేశాడు. తను జాకెట్ గిఫ్ట్ గా తెచ్చాడు. దానిని ఎంతో ఇష్టపడి తీసుకున్నాననీ, బయటకు వచ్చాక తిరిగి ఇచ్చేయాలనీ అలీకి చెప్పాడు. ఆలీ అలాగే ఒక వారం నేను.. ఒక వారం నువ్వు వేసుకుందాం అన్నాడు. ఇక శ్రీముఖిని పలకరించి మిస్ అవుతున్నాం అని చెప్పాడు రవి. ఇంత హడావుడి చేసినా తన స్నేహితుడిని మాత్రం నామినేషన్ నుంచి కాపాదలేకపోయాడు రవి. ఇక రాహుల్ స్నేహితుడు సింగర్ నోయల్ వచ్చాడు. పాటతో వచ్చిన నోయల్ అదే జోరును కొనసాగించాడు. నువ్ టాస్క్‌లో నెమ్మదిగా ఉంటున్నావని అమ్మ అందికాని కుందేలు తాబేలు కథలో తాబేలుదే విజయం. కుందేలు ఎగురుతూ గంతులు వేసినా విన్నర్ మాత్రం తాబేలుదే అంటూ పంచ్ పేల్చేడు. అయితే నువ్ చెప్పిన కథలో ఆ కుందేలు బయటకు వచ్చేసింది అని నాగార్జున పునర్నవి ఉద్దేశించి పంచ్ పేల్చారు. ఇక నోయల్ ఇచ్చిన గిఫ్ట్‌లో రాహుల్ పేరు ఉండటంతో ఈవారం నామినేషన్స్ నుండి సేవ్ అయ్యాడు.

శివజ్యోతి అక్క బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చి నాగార్జున చూసి సర్ ప్రైజ్ అయ్యింది. శివజ్యోతి మాట పక్కనపెట్టేసి ఎంత గ్లామర్‌గా ఉన్నారో అంటూ నాగార్జునని చూసి మురిసిపోయింది. అనంతరం ఆమె తెచ్చిన గిఫ్ట్‌లను శివజ్యోతికి అందించగా అందులో ఆమె పేరు లేకపోవడంతో నామినేషన్ లోనే ఉండిపోయింది శివజ్యోతి. ఆమె తరువాత బాబా భాస్కర్ అక్క వచ్చి గిఫ్ట్ ఇచ్చి తమ్ముడ్ని నామినేషన్ నుండి సేవ్ చేయగలిగింది.

మొత్తమ్మీద ఎపిసోడ్ ఆసక్తి కరంగా సాగింది.. కొంత ఉత్కంట గా కూడా నడిచింది. హౌస్ మేట్స్ సంబందీకుల్లో ఎక్కువ మంది వితికా, అలీ, శివజ్యోతి లకు టాప్ 5 లో ఉండే అర్హత లేదని చెప్పడం విశేషం. పైగా అలీని దాదాపు అందరూ వ్యతిరేకించారు. ఇక వితిక, వరుణ్ జోడీ విదిపోవాలనీ, వితిక బయటకు వస్తేనే వరుణ్ ఆట చూడగలమనీ ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఈ ఎపిసోడ్ ద్వారా కొంత వరకూ ఫైనలిస్ట్ లు ఎవరు అనే విషయం తెలిసినట్టే. ఇక ఈ వారం లో నామినేషన్ లో రెండు జోడీలు ఉన్నాయి. ఒకటి భార్యా భర్తలు వితికా, వరుణ్, రెండు అక్కా, తమ్ముళ్ళు అలీ, శివజ్యోతి ఈ రెండు జోడీలు మొదట్నుంచీ గ్రూపులుగా ఆడుతున్న వారే కావడం విశేషం. ఇప్పుడు వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఇప్పుడు ఆట రసకందాయంలో పడినట్టే!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories