Bigg Boss 3 Telugu Episode 90: ఇదీ రాహుల్ ఒరిజినల్.. వినోదాల విందులో పసందైన పెర్ఫార్మెన్స్!

Bigg Boss 3 Telugu Episode 90: ఇదీ రాహుల్ ఒరిజినల్.. వినోదాల విందులో పసందైన పెర్ఫార్మెన్స్!
x
Highlights

బిగ్ బాస్ 90 కి వచ్చేసింది. ఇక ప్రీ క్లైమాక్స్ మొదలయినట్టే. అందులో భాగంగా వచ్చే ఎపిసోడ్ లు కొంచెం కష్టతరమైన టాస్క్ లతో సాగే చాన్స్ ఉంది. గత రెండు ఎపిసోడ్ లలో ఎమోషన్ల ఆట ఆడిన బిగ్ బాస్ ఈ ఎపిసోడ్ లో వినోదాల విందు పంచాడు.

బిగ్ బాస్ 90 కి వచ్చేసింది. ఇక ప్రీ క్లైమాక్స్ మొదలయినట్టే. అందులో భాగంగా వచ్చే ఎపిసోడ్ లు కొంచెం కష్టతరమైన టాస్క్ లతో సాగే చాన్స్ ఉంది. గత రెండు ఎపిసోడ్ లలో ఎమోషన్ల ఆట ఆడిన బిగ్ బాస్ ఈ ఎపిసోడ్ లో వినోదాల విందు పంచాడు. హౌస్ మేట్స్ లైఫ్ జర్నీ విశేషాలు.. వారిలో ఉన్న వినోదాత్మక నటనా ప్రతిభలు ప్రదర్శించే అవకాశం కల్పించి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచాడు.

లైఫ్ జర్నీ..

అందర్నీ బోర్డు పై తమ జీవితం లో ఒడిదుడుకులు..విజయాలు గురించి చెప్పి గ్రాఫ్ లా రాయమన్నాడు బిగ్ బాస్. అదేవిధంగా బిగ్ బాస్ లో వారి ప్రయాణం ఎంత వరకూ ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో కూడా చెప్పమన్నాడు. వితిక, బాబా భాస్కర్, శివజ్యోతి తమ అనుభవాలను వివరించారు. తరువాత అసలైన వినోదం మొదలైంది.

మహానటి..దేవసేన..చంద్రముఖి మధ్యలో కాంచన!

డే ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్.. అంటూ హౌస్ మేట్స్ అందరికీ ఇష్టమైన టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. బాబా భాస్కర్ బాషా.. శ్రీముఖి మహానటి, శివజ్యోతి చంద్రముఖి, అలీ గజనీ, వరుణ్,వితికలు దేవసేన..బాహుబలి ఇక కాంచన గా రాహుల్ నటించాలని చెప్పాడు బిగ్ బాస్.

టాస్క్ ఇలా ఇచ్చారోలేదో బజర్ గురించి కూడా ఎవరూ ఆగలేదు. అందరూ తమ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేశారు. ఆలీకి మళ్లీ షర్ట్ విప్పే అవకాశం దొరికింది. ఇక రెచ్చిపోయాడు. బాబా కి రజనీ క్యారెక్టర్ అనగానే పూనకం వచ్చేసింది. ఇక రాహుల్ గురించి చెప్పక్కర్లేదు. కాంచన గా జీవిన్చేశాడు. వరుణ్, వితికలు ది బెస్ట్ ఇవ్వాలని జతగా ప్రయత్నించారు. శివజ్యోతి చంద్రముఖిగా హౌస్ ని కుదిపేసింది. ఇక బిగ్ బాస్ లో మొదట్నుంచీ మహానటి బిరుదు కొట్టేసిన శ్రీముఖి అయితే తన బిరుదుకు సార్థకత తీసుకువచ్చేసింది.

ఈ టాస్క్ లో కొన్ని హైలైట్స్ ఇవీ..

- రాహుల్(కాంచన) వరుణ్ (బాహుబలి) వచ్చాడు. అతడిని చూస్తూనే ఏయ్..బహుబలీ నీ కండలేవీ అన్నాడు రాహుల్. షర్ట్ లోపల ఉన్నాయని బదులిచ్చాడు వరుణ్. హేయ్..అది షర్ట్ కాదు.. కుర్తా అంటూ పంచేశాడు రాహుల్

- మహానటిగా శ్రీముఖి నాగేశ్వర రావు గారు వచ్చారా అంటూ సందడి చేసింది. వరుణ్ వితికలు బాహుబలి సీన్ ప్రాక్టీస్ మొదలెట్టారు. ఈలోపు అక్కడకు చేరిన మహానటి బోట్ సీన్ చేయండి అంది. అంతే వితిక రెడీ అయిపొయింది. వరుణ్ రెండు బల్లల మధ్య కూచుంటే అతని భుజాల మీద నడిచింది వితిక మొదటిసారి సరిగానే నడిచింది. తరువాత మళ్లీ అదే ప్రయత్నం చేసింది. ఈ హడావుడిలో స్లిప్ అయి వరుణ్ మీద పడిపోయింది. అంతే వరుణ్ నా నడుం విరగ్గోట్టావు కదే అంటూ కింద పడిపోయాడు. ఈ లోపు మహానటి వచ్చి నాగేశ్వర రావు గారు వచ్చారా అని అడుగుతూ.. వరుణ్ నేను ట్రై చేయనా అని అడిగింది. దాంతో వరుణ్, వితికలు ఒకటే నవ్వులు నవ్వారు.

- శివజ్యోతి చంద్రముఖిగా హౌస్ ను దద్దరిల్లేలా చేసింది.

- ఇక మహానటి కన్నీటి బొట్లు సీన్ శ్రీముఖి, వరుణ్ కామెడీగా నటించారు.

- బాబా భాస్కర్ బాషా ఆటో పాటకి అదిరిపోయే స్టెప్పులతో అందర్నీ అలరించారు.

-ఇక రాహుల్ పెర్ఫార్మెన్స్ చెప్పక్కర్లేదు. కంచన పాటకి రెచ్చిపోయాడు.

మొత్తమ్మీద ఎపిసోడ్ బిగ్ బాస్ 3 లో వచ్చిన అతి కొద్ది వినోదాల ఎపిసోడ్ లలో ఒకటిగా నిలిచిందని చెప్పాలి. హౌస్ మేట్స్ ఈసారి ఓవర్ యాక్షన్ కొంచెం తగ్గించారు. చక్కని కామెడీ పండిస్తూ.. స్కిట్ లు చేశారు. అందరికంటే చెప్పుకోవాల్సింది.. రాహుల్ ఇన్నాళ్ళూ ఎక్కడ దాచాడో ఈ టాలెంట్ అని ప్రేక్షకులు అనుకునేలా చేశాడు. బహుశా అమ్మకోసం టాస్క్ లో నూరుశాతం జీవించాడెమో.. అనిపించింది. ఇక ఈ వారం అయిపొయింది. ఎవరు ఎలిమినేట్ అవుతారనే దగ్గరకి బిగ్ బాస్ వచ్చేసింది. శనివారం ఎవరు సేవ్ అవుతారో తేలుతుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories