Bigg Boss 3 Telugu Episode 89: ఎమోషనల్ బాటలో బిగ్ బాస్ రేటింగ్ వేట!

Bigg Boss 3 Telugu Episode 89: ఎమోషనల్ బాటలో బిగ్ బాస్ రేటింగ్ వేట!
x
Highlights

బిగ్ బాస్ సీజన్ 3 లో ఇప్పటివరకూ చూడనంత ఏడుపు ఈ ఒక్క ఎపిసోడ్ లో చూడగలిగాం. బిగ్ బాస్ హోటల్ టాస్క్ లో భాగంగా మూడో ఎపిసోడ్ లోనూ హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు వచ్చి పలకరించి వెళ్లారు. గత ఎపిసోడ్ లలో వితిక, అలీ, శివజ్యోతి, బాబా భాస్కర్ కుటుంబ సభ్యులు వచ్చి వెళ్లారు. ఇక తాజా ఎపిసోడ్ లో వరుణ్, రాహుల్, శ్రీముఖి కుటుంబ సభ్యులు వచ్చారు.

బిగ్ బాస్ సీజన్ 3 లో ఇప్పటివరకూ చూడనంత ఏడుపు ఈ ఒక్క ఎపిసోడ్ లో చూడగలిగాం. బిగ్ బాస్ హోటల్ టాస్క్ లో భాగంగా మూడో ఎపిసోడ్ లోనూ హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు వచ్చి పలకరించి వెళ్లారు. గత ఎపిసోడ్ లలో వితిక, అలీ, శివజ్యోతి, బాబా భాస్కర్ కుటుంబ సభ్యులు వచ్చి వెళ్లారు. ఇక తాజా ఎపిసోడ్ లో వరుణ్, రాహుల్, శ్రీముఖి కుటుంబ సభ్యులు వచ్చారు. ఇక వీరి రాక సందర్భంగా అందరిలోనూ ఎమోషన్ లు పీక్స్ కి వెళ్ళాయి. వరుణ్ బామ్మ గారు వచ్చి బిగ్ బాస్ కి చుక్కలు చూపించారు. తమ ఇంటికి బిగ్ బాస్ ను ఆహ్వానించారు. రాహుల్ తల్లి వచ్చి బాగా ఆడామని చెప్పి వెళ్లారు. ఇక శ్రీముఖి తల్లి హౌస్ లోకి రావడమే పెద్ద సీన్ క్రియేట్ చేశాడు బిగ్ బాస్. అసలే అవకాశం కోసం ఎదురుచూసే శ్రీముఖి కి ఆటోమేటిగ్గా పెద్ద అవకాశం దొరికేసింది. మహానటి బయటకు వచ్చేసింది. ఇవీ ఈ ఎపిసోడ్ విశేషాలు.

బామ్మగారి సందడి!

ఇదే కదా పెద్ద తరం అంటే అనిపించారు వరుణ్ సందేశ్ బామ్మ గారు. వస్తూనే అందర్నీ హడావుడి చేసేశారు. పేరు పేరునా పలకరించేశారు. బాబా భాస్కర్ కు కాంప్లిమెంట్ ఇచ్చేశారు. ఒక దగ్గర ఉన్నపుడు చిన్న చిన్న గొడవలు సహజం అంటూ సర్ది చెప్పారు. బిగ్ బాస్ ఫోటో అడిగారు. వరుణ్ ని పార్టీల కోసం డబ్బులు పాడు చేసుకోకు అన్నారు. ఇలా కొద్ది సేపట్లోనే బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరి దగ్గరా ఫుల్ మార్కులు కొట్టేశారు.

రాహుల్ కి కొద్దిగా బద్ధకం..

రాహుల్ తల్లి వచ్చారు. కన్ఫెషన్ రూమ్ లో ఉన్న ఆమె రాహుల్ ని పిలిచే సమయానికి రాహుల్ ఫ్రీజ్ మోడ్ లో ఉన్నాడు. కొద్దిసేపటి తరువాత రాహుల్ కన్ఫెషన్ రూమ్ కి వెళ్లి ఆమెను హౌస్ లోకి తీసుకువచ్చాడు. ఆమె అందర్నీ పలకరించారు. తరువాత రాహుల్ కు టాస్క్ లలో ఆడామని చెప్పారు. ఇక ఇంటి సభ్యులందరికీ.. తమ రాహుల్ ఉన్నది ఉన్నట్టు మాట్లాదేస్తాడు.. మనసులో ఏదీ ఉంచుకోడు అని చెప్పారు. కొంచెం బద్ధకం ఎక్కువ అంటూ చెప్పిన ఆమె టాస్క్ లలో పెర్ఫార్మెన్స్ బాగా చేయాలని సూచించి అందరినీ బాగా ఆడాలని చెప్పి వెళ్ళిపోయారు.

శివజ్యోతిని మించిపోయింది శ్రీముఖి..

ఇక అందరూ వచ్చారు.. శ్రీముఖి కుటుంబం నుంచి ఎవరూ రాలేదు. శ్రీముఖి కి టెన్షన్ ప్రారంభం అయింది. గతంలో లా తనను ఎవరినీ కలవకుండా చేస్తాడేమో బిగ్ బాస్ అనే సందేహంలో పడిపోయింది. ఆమె అనుకున్నాట్టు గానే బిగ్ బాస్ ఆమెకు ఓ ఝలక్ ఇచ్చాడు. ఆమె ఫ్రీజ్ మోడ్ లో ఉండగా ఆమె తల్లిని పంపించారు. తన తల్లిని చూసిన శ్రీముఖి ఏడ్చి గోల చేసింది. రావద్దు అంటూ అరిచింది. అయినా ఆమె వచ్చి శ్రీముఖిని వాటేసుకుంది. దీంతో కదలడానికి లేని పరిస్థితుల్లో పూర్తిగా ఉద్విగ్నంగా మారిపోయింది శ్రీముఖి. కొద్ది నిమిషాల్లోనే శ్రీముఖి తల్లిని వెనక్కి వెళ్ళిపొమ్మని చెప్పాడు బిగ్ బాస్. అసలు ఇలా ఎందుకు చేశాడు బిగ్ బాస్ అంటూ ఏడుపు అందుకుంది శ్రీముఖి. అందరూ ఆమెను ఓదార్చారు. కొద్ది సేపటి తరువాత మళ్లీ శ్రీముఖి తల్లి వచ్చింది. మరోసారి శ్రీముఖి మొదలు పెట్టింది. శివజ్యోతి ఇన్నాళ్ళూ ఏడ్చిన ఏడుపు ఒక్క ఎపిసోడ్ లో శ్రీముఖి ఏడ్చేసింది. దీంతో హౌస్ మేట్స్ అందరూ ఆమె ఎమోషన్ కు ఆశ్చర్యపోవడం తొ పాటు కామెంట్స్ కూడా చేశారు. ఇక శ్రీముఖి తల్లి అందరితో మాట్లాడారు. రాహుల్తొ ప్రత్యేకంగా మాట్లాడుతూ నువ్వు ఉన్నవని ఎంతో ధైర్యంగా ఉన్నాం. కానీ, మీ ఇద్దరూ దెబ్బలాడుకోవడం.. తేట్టుకోవడం నచ్చలేదు. ఆడండి.. గంతులు వేయండి.. ఒకరిని ఒకరు ఆటల్లో దేబ్బలాడుకోంది కానీ తిట్టుకోకండి. బయట మీ తల్లి దండ్రులు చూస్తున్నారు. అందరూ ఏమనుకుంటారు? వారి గురించి కూడా దృష్టిలో పెట్టుకోండి అంటూ ఆమె చెప్పారు. తరువాత బీబీ హోటల్ కి ఎడో స్టార్ ఇచ్చి ఆమె వెళ్ళిపోయారు.

మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ అంతా బిగ్ బాస్ ఎమోషన్ల తొ ఆడుకున్నాడు. మామూలుగా ఎక్కడా వర్కౌట్ కావట్లేదనుకున్నట్టున్నారు.. నాటకీయత ఎక్కువ చేసి.. అందులోంచి ఎమోషన్ పిండుకున్నారు. దానికి పరాకాష్ట శ్రీముఖి ఏడుపు. అనుకున్నది బిగ్ బాస్ సాధించాడు. ఇక తరువాతి ఎపిసోడ్ లో ఎవరేం చేయబోతారో చూడాల్సిందే!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories