Bigg Boss 3 Telugu Episode 88: బంధాల భావోద్వేగాలలో బిగ్ బాస్
సరదా ఆటలో.. బంధాల్ని చూపిస్తూ బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో భావోద్వేగాలను తారాస్థాయికి తీసుకు వెళుతున్నాడు. గత ఎపిసోడ్ లో వితిక చెల్లెలి ఎంట్రీ తొ మొదలైన హౌస్ మేట్స్ కుటుంబ సభ్యుల రాక ఈ ఎపిసోడ్ లోనూ కొనసాగింది.
సరదా ఆటలో.. బంధాల్ని చూపిస్తూ బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో భావోద్వేగాలను తారాస్థాయికి తీసుకు వెళుతున్నాడు. గత ఎపిసోడ్ లో వితిక చెల్లెలి ఎంట్రీ తొ మొదలైన హౌస్ మేట్స్ కుటుంబ సభ్యుల రాక ఈ ఎపిసోడ్ లోనూ కొనసాగింది.
ఇంకా నామినేషన్ల వేడి తగ్గలేదు ఎవరిలోనూ. ముఖ్యంగా వితిక. రాహుల్ తన భర్త వరుణ్ కి తన స్థానాన్ని త్యాగం చేయలేదనే అక్కసు ఇంకా మనసులోనే పెట్టుకుంది. శ్రీముఖి, బాబా భాస్కర్ దగ్గర ఈ విషయం చెబుతూ వాపోయింది. కొంతమంది మనషులు బయట ద్రోహం చేయడం సహజం. ఇక్కడ కూడా ఇలా చేస్తారా అంటూ రాహుల్ పేరు చెప్పకుండా వారితో మాట్లాడింది. శ్రీముఖి ఈ విషయంలో ఏమీ కామెంట్ చేయలేదు. బాబా కూడా పోనీ వదిలేయ్ అని చెప్పారు.
ఇదిలా ఉండగా నిన్నటి ఎపిసోడ్ లో ప్రారంభమైన బిగ్ బాస్ హోటల్ టాస్క్ ఇంకా కొనసాగుతోంది. అతిథులుగా హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు వస్తున్నారు. గత ఎపిసోడ్ లో వితిక చెల్లెలు వచ్చి వెళ్ళగా.. ఈ ఎపిసోడ్ లో మొదట అలీ భార్య వచ్చారు. ఆమె వచ్చేసరికి హౌస్ మేట్స్ అందర్నీ స్లీప్ మోడ్ లో ఉంచారు. ఆమె వస్తూనే అలీ వద్దకు వెళ్లి అతని తలను తన ఒళ్లో పెటుకుని తీవ్ర భావోద్వేగానికి గురైంది. తరువాత ఆమె శివజ్యోతి వద్దకు వెళ్లారు. దీంతో శివజ్యోతి ఇక కుళాయి తిప్పింది. అందరు హౌస్ మేట్స్ ను పేరు పేరునా పలకరించిన ఆమె అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. తరువాత అలీ కి జాగ్రత్తగా గేమ్ ఆడమని సూచించారు. శివజ్యోతి విషయంలో కూడా గేమ్ ని గేమ్ లా ఆడామని విజేతగా తిరిగి రావాలని చెప్పి ఆమె వెళ్ళిపోయారు.
శివజ్యోతి కన్నీటి వరద..
ఎపిసోడ్లో సగ భాగం శివజ్యోతి కన్నీటి వరదే కనిపించింది. మొదట అలీ భార్య వచ్చినప్పుడు మొదలైన రాగం కొద్దిగా ఆగింది.. కానీ, ఆమె భర్త హౌస్ లోకి రావడంతో ఇక ఆపడం ఎవరి వల్లా కాలేదు. ఆమె భర్త ఎంత చెప్పినా ఏడుస్తూనే ఉంది.
సరదాగా బాబా భాస్కర్..
బాబా భాస్కర్ పిల్లలు ముందు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. దాంతో బాబా ఆనందానికి హద్దులు లేవు. వారిద్దరూ తండ్రి బాగా ఆడుతున్నాడని చెప్పారు. హౌస్ మేట్స్ అందర్నీ పలకరించారు. అమ్మ రాలేదా అని అడిగితె రాలేదని చెప్పారు. ఇంతలో బాబా భార్య కూడా వచ్చారు. దీంతో బాబా డబుల్ ఖుషీ అయిపోయారు. అప్పుడప్పుడు ఎందుకు ఎమోషన్ అవుతున్నరంటూ ఆయన భార్య అడిగారు. దానికి బాబా ఒక్కోసారి ఇక్కడ పరిస్థితులు అలా అనిపిస్తున్నాయి అని సమాధానం ఇచ్చారు. మీరు ఇంత కాలం ఉంటారని అనుకోలేదు అని ఆమె చెప్పారు. బాగా ఆడుతున్నారు. అలానే అది గెలిచి రండి అని కోరారు. తరువాత వితికను బాబా పరిచయం చేశారు. రిక్షా టాస్క్ అని గుర్తు చేశారు. దానికి ఆమె ఆట అలానే ఆడాలి అంటూ చెప్పారు. ఇక బాబా వంట గురించి మాట్లాడుతూ మీరే ఎక్కువ వంట ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించారు బాబా భార్య. దానికి నాకు కాలక్షేపం కావలిగా అని సమాధానం ఇచ్చారు బాబా. హౌస్ మేట్స్ అందరి కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు ఉన్నంత ఎమోషన్స్ లేకుండా.. సరదాగా తన కుటుంబ సభ్యులతో వ్యవహరించి ఎపిసోడ్ కి రిలీఫ్ ఇచ్చారు బాబా భాస్కర్.
మొత్తమ్మీద భావోద్వేగాలతో నిండిన ఈ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతుంది. ఎపిసోడ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.. 85 రోజుల పాటు తమవారికి దూరంగా ఉన్న వారికి ఒక్కసారిగా తమ ఆత్మీయులు కనిపిస్తే కనిపించే భావోద్వేగాలే కనిపించాయి. వాటితోనే ప్రేక్షకులూ కనెక్ట్ అయ్యారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire