Bigg Boss 3 Telugu Episode 82: ముసుగుల తలలు పగిలాయి.. కేకులతో సరదా తీరింది!

Bigg Boss 3 Telugu Episode 82: ముసుగుల తలలు పగిలాయి.. కేకులతో సరదా తీరింది!
x
Highlights

బిగ్ బాస్ వడివడిగా చివరి అంకానికి చేరుకుంటోంది. ఇక హౌస్ లో కూడా బిగ్ బాస్ అందరి మధ్య ఉన్న ముసుగు తెరల్ని పూర్తిగా తొలగించేసి అసలు ఆట మొదలు పెట్టె...

బిగ్ బాస్ వడివడిగా చివరి అంకానికి చేరుకుంటోంది. ఇక హౌస్ లో కూడా బిగ్ బాస్ అందరి మధ్య ఉన్న ముసుగు తెరల్ని పూర్తిగా తొలగించేసి అసలు ఆట మొదలు పెట్టె దిశలో మార్పులు మొదలెట్టాడు. ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారో వీడియోలు చూపించి.. ఎవరి మీద ఎక్కువ కోపం వస్తే వారి తల పగలగొట్టినట్టు భావించి కుండలు బద్దలు కొత్తమన్నాడు. ఈ వేడి తగ్గించడానికి బిగ్ బాస్ తన పుట్టినరోజు వేడుకోలు తీయని కేక్ లతో హౌస్ మేట్స్ మొహం మొత్తేలా జరిపించుకున్నాడు.

ఈ ఎపిసోడ్ లో కుండబద్దలు కొట్టే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ ఒక్కోరికీ తమ గురించి ఎవరి ఏమనుకుంటున్నారో వీడియో చూపించడం.. దానిని చూసిన తరువాత తమ గురించి పరోక్షంగా మాట్లాడుకున్నవారితో మాట్లాడటం.. తరువాత ఎవరైతే తమను టార్గెట్ చేశారని భావిస్తున్నారో వారి ఫోటో కుండకు అంటించి ఆ కుండను బద్దలు కొట్టడం. ఇలా మూడు దశల టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. బాబా భాస్కర్ రాహుల్ కుండ బద్దలు కొట్టారు.. రాములమ్మ శ్రీముఖి మహేష్ మొహం పగిలేలా కొట్టింది.. రాహుల్ కూడా మహేష్ కుండ బద్దలు కొట్టాడు. ఇక వితిక, వరుణ్ లు అలీ కుండను, శివజ్యోతి రాహుల్ కుండను, మహేష్, అలీ శ్రీముఖి ముఖం ఉన్న కుండలనీ బద్దలు కొట్టారు.

బిగ్ బాస్ పుట్టిన రోజు..

అలీకి మళ్లీ షర్ట్ విప్పి సిక్స్ పాక్ చూపించే చాన్స్ వచ్చింది. బిగ్ బాస్ తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవాలని హౌస్ మేట్స్ ని కోరాడు. అందంగా అలంకరించుకుని అందరూ సంతోషంతో డాన్సులు చేస్తూ గడపాలని చెప్పాడు. పాటలకు డాన్స్ చేసేటప్పుడు ఇద్దరు స్విమ్మింగ్ పూల్ లో కచ్చితంగా ఉండాలనే నిబంధాన పెట్టాడు. ఇటువంటి అవకాశం వస్తే వాడులుకోరుగా.. అలీ షర్ట్ విప్పి సిక్స్ ప్యాక్ చూపిస్తే.. రాహుల్ ఫ్యామిలీ పాక్ చూపించి సందడి చేశాడు. ఇక ఇందులో ట్విస్ట్ ఏమిటంటే వరుసగా గ్యాప్ లేకుండా ఎనినిమిది కేక్ లు పంపించాడు బిగ్ బాస్. వాటిని ఒక్క ముక్క వదలకుండా తినాల్సిందే అని చెప్పాడు. ఇక మొదటి కేక్ ఆనందంగా తిని ఎంజాయ్ చేసిన సభ్యులు చివరికి బిగ్ బాస్ కు చేతులెత్తి దణ్ణం పెట్టేశారు.

మొత్తమ్మీద వినోదాత్మకంగా ఎపిసోడ్ తీర్చిదిద్దారు. కుండ బద్దలు కొట్టడం టాస్క్ ఇంటి సభ్యులు ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. చాలా కూల్ గా ఆడారు. పెద్దగా ఎవరూ ఒకరితో ఒకరు ఆర్గ్యూ చేసుకోవడం కనిపించలేదు. ఇక బిగ్ బాస్ బర్త్ డే టాస్క్ మాత్రం చాలా బాగా జరిగింది. పూర్తీ వినోదాన్ని పంచింది ప్రేక్షకులకు. హౌస్ మేట్స్ కేక్ తినలేక కష్టపడుతుంటే.. వారి హావభావాలు చూసి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు.

బిగ్ బాస్ నుంచి ఈవారం ఎవరు బయటకు వెళతారని మీరు భావిస్తున్నారు?



Show Full Article
Print Article
More On
Next Story
More Stories