bigg boss3 episode 38 highlights: గిల్లి కజ్జాల డీల్!

bigg boss3 episode 38 highlights: గిల్లి కజ్జాల డీల్!
x
Highlights

సాధారణంగా నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన తరువాత ఒకరిని రక్షించే టాస్క్ పెట్టి రక్షిస్తాడు బిగ్ బాస్. ఈవారం మాత్రం ముగ్గురికి రక్షణ కల్పించాడు. దీనికోసం గిల్లి కజ్జాలు పెట్టి.. వారిని రక్షించాడు. ఈవారం ముగ్గురే ఎలిమినేషన్ కి నామినేషన్ లో ఉన్నారు. మిగిలిన వారు ఎలా బయట పడ్డారు? బిగ్ బాస్ ఎపిసోడ్ 38 హైలైట్స్..

బిగ్ బాస్ ఈసారి ముగ్గురిని ఎలిమినేషన్ నుంచి రక్షించాలనుకున్నాడు. ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో ముగ్గుర్ని రక్షించాలి. ఇప్పుడు ఆముగ్గురు ఎవరు? అదే ఈరోజు టాస్క్.. బిగ్ బాస్ ఆట!

మీరే తేల్చుకోండి..

నామినేషన్స్ లో ఉన్న రాహుల్, రవికృష్ణ, వరుణ్ సందేశ్, మహేష్ విట్టా, పునర్నవి, హిమజలను ఎక్టివిటీ ఏరియాలోకి పిలిచాడు బిగ్ బాస్. మీకో డీల్ ఇస్తున్నాను. దానిలో చాలా కష్టం ఉంటుంది. చేయగలననే నమ్మకం ఉన్నవారు ముగ్గురు దీనిలో పాలు పంచుకోవాలి. వారు విజయవంతంగా డీల్ పూర్తి చేస్తే వారికి ఈవారం ఎలిమినేషన్ నుంచి రక్షణ లభిస్తుంది. అయితే, మీరే ఆ డీల్ లో పాల్గొనేది ఎవరో తేల్చుకుని నాకు చెప్పండి. అని మొదటి ఫిటింగ్ పెట్టాడు. కాసేపు తర్జన భర్జనలు పడిన తరువాత మహేశ్, పునర్నవి, హిమజలు తాము త్యాగం చేస్తున్నామనీ, రవికృష్ణ, వరుణ్, రాహుల్ లను డీల్ ఆడతారనీ చెప్పారు.

గొడవలు సృష్టించాడు..

ఇక డీల్ లో భాగంగా రవికృష్ణ, వరుణ్, రాహుల్ లకు విడివిడిగా టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. ఒక బోర్డు మీద 8 టాస్క్ లు ఇచ్చి వాటిలో రెండిటిని ఎంపిక చేసుకోమన్నాడు. మొదట రవికృష్ణ వంతు.. తను షేవింగ్ క్రీం ఇంటి సభ్యులలో ఒకరి తలమీద రాయడం.. ఒకరి బెడ్ ను నీటితో తడపడం అనే టాస్క్ లు తీసుకున్నాడు. బయట ఉన్న హౌస్ మేట్స్ కి రవి ఎదో చేయబోతున్నాడని అనిపించి అటూ ఇటూ పరుగులు పెట్టారు. ఈ క్రమంలో వితికను దొరకపుచ్చుకున్న రవి ఆమెను కింద పాడేసి తలపై క్రీం పూసాడు. తరువాత హౌస్ మేట్స్ ఎంత అడ్డుకున్నా.. కిచెన్ నుంచి నీళ్లు తీసుకువెళ్లి శివజ్యోతి బెడ్ మీద పోసి తడిపేశాడు.

ఇక రాహుల్ వంతు.. ఎవరైనా ఇంటి సభ్యులతో గొడవ పడడం.. వీటిక, వరుణ్ ల లవ్ పిల్లోని ముక్కలు చేసి స్విమ్మింగ్ పూల్ లో పాడేయడం టాస్క్ లు ఎంచుకున్నాడు. పిల్లోని చించే కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా జరిగిపోయింది. అయితే, గొడవ పడే విషయంలో మాత్రం గొడవలు పడ్డాడు. హిమజ, రాహుల్ మధ్య ఈ సందర్భంగా చాలా ఘర్షణ జరిగింది. చెప్పుతో కొడతాను.. బేవార్స్ వంటి మాటలు రాహుల్ మీద హిమజ ప్రయోగించింది. ఇక గొడవకు అలీని టార్గెట్ చేశాడు. చివరికి అలీని గొడవకు దింపి అతనితో గొడవ పడ్డాడు. చివరగా వరుణ్.. చల్లని కాఫీని ఎవరిమీదైనా పోయాలి.. ఎవరివైనా ఇష్టమైన బట్టలు చింపేయాలి. దీనికి వితికను టార్గెట్ చేసుకుని సేఫ్ గేమ్ ఆడాడు వరుణ్. వితికను బయటకు పిల్చి ఆమె పై కాఫీ పోశాడు. తనతో గొడవ పడినట్టు చేసి.. కోపం వచ్చినట్టు నటించి వితిక బట్టలు కట్టిరించేశాడు. దీంతో విషయం తెలీని వితిక వరుణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసి తన బట్టలన్నీ బయట పాదేసి అన్నీ చింపు అని అరిచింది.

దీంతో టాస్క్ లు పూర్తయ్యాయి. తరువాత బిగ్ బాస్ అందరికీ అసలు విషయం చెప్పి డీల్ లో భాగంగా వరుణ్, రాహుల్, రవికృష్ణ అలా ప్రవర్తించారని చెప్పాడు. వారు ముగ్గురూ డీల్ విజయవంతంగా పూర్తిచేశారనీ, అందుకే వారు ఎలిమినేషన్ నుంచి రక్షణ పొందారని ప్రకటించాడు. దీంతో హౌస్ మేట్స్ అందరిలో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది.

మొత్తమ్మీద బిగ్ బాస్ గిల్లికజ్జాలు పెట్టి.. చివరికి అందరి గాయాలకీ వెన్న పూశాడు. కచ్చితంగా ఆటలో తాను ఆడాల్సింది ఆడేశాడు. ఎవరు హౌస్ లో ఉండాలని అనుకుంటున్నాడో వాళ్ళని నేరుగా ఉంచేశేలా ఆట ఆడాడు. ఇప్పుడు ఈవారం హిమజ, పునర్నవి, మహేష్ విట్టాలు నామినేషన్స్ లో మిగిలారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories